Smartphone Tracking: స్మార్‌ఫోన్ కాలం ఇది. ఫోన్ లేకుండా రోజు గడవని పరిస్థితి. ఫోన్ నంబర్లతోపాటు ఆర్థిక వ్యవహారాలు, వ్యక్తిగత సమాచారమంతా ఈ ఫోన్లలోనే ఉంటోంది. అయితే కొన్నిసార్లు మన అశ్రద్ధ వలన ఫోన్లు పోతే.. కొన్నిసార్లు దొంగిలిస్తున్నారు. దీంతో సమాచారం మొత్తం పోతోంది. ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన ఓ ర్యాలీలో దొంగలు 20 ఫోన్లు కొట్టేశాలు. అంతకు ముందు ఎన్నికల సభల్లో ఇలాంటి పరిస్థితే నెలకొంది. వంద మందిలో ఫోన్ పోతే ఇక ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితి. అయితే వందల మందిలో ఫోన్ పోతే చిన్న ట్రిక్‌తో చిటికెలో పట్టుకోవచ్చని చెబుతున్నారు ఓ టెక్ ఇన్‌ప్లూయెన్సర్. ఆ ట్రిక్ ఏంటో తెలుసుకుందాం.
రంజాన్ సందర్భంగా..
టెక్ ఇన్‌ప్లూయెన్సర్లలో ఒకరైన షారుక్.. గతేడాది రంజాన్ సందర్భంగా జరిగిన ఘటనను తాజాగా పంచుకున్నాడు. తన భార్యతో ఢిల్లీలోని జామా మసీదుకు ఇఫ్తార్ విందుకు వెళ్లినప్పుడు జరిగిన ఘటనను వివరించాడు. రెండు ఫోన్లు ఎలా పోగొట్టుకున్నది, వాటిని తిరిగి ఎలా పొందాడో తెలిపాడు. వరుస ట్వీట్లలో దానిని వివరించాడు.
‘‘2024 ఏప్రిల్ 15న ఢిల్లీలోని జామా మసీదుకు నేను, నా భార్య ఇఫ్తార్ విందుకు వెళ్లా. చుట్టూ ఇసుకేస్తే రాలనంత జనం. మాదగ్గర మూడు సెల్‌ఫోన్లు ఉన్నాయి. వాటిలో ఐఫోన్ 13, షావోమీ సీవీ2, రెండ్‌మీ కే50 అల్ట్రా. మూడు ఫోన్లను బ్యాగ్‌ఓల ఓ జిప్‌లో ఉంచాం. కాసేపటి తర్వాత చూస్తే బ్యాగు తెరిచి ఉంది. అందలో ఐఫోన్, షావోమీ ఫోన్లు మాయమయ్యాయి. వెంటనే దొంగా.. దొంగా.. నాఫోన్లు ఎవరో కొట్టేశాలు అంటూ అరిచాను. అయినా ఫలిత లేదు. వెంటనే అక్కడ అధికారులకు సమాచారం ఇచ్చా. నాకు సాయం చేయకపోగా మీ లాంటి వాళ్ల కోసమే జాగ్రత్తలు చెబుతుంటాం పట్టించుకోకుంటే ఎలా అని అరిచారు.’’
ఏం చేశానంటే..
– తొలుత ఐఫోన్‌కు కాల్ చేశా. స్విచ్‌ఆఫ్ వచ్చింది. తర్వాత ఇంకో ఫోన్‌కు కాల్ చేశా. ఆఫోన్ ఆన్‌లో ఉంది. ఆ ఫోన్‌ను ఆపలేకపోయారు. షట్‌డౌన్ కన్ఫర్మేషన్ ఫీచర్‌ని ఎనబుల్ చేసుకోవడమే ఇందుకు కారణం. ఈ ఫీచర్ ఆన్‌లో ఉన్నప్పుడు స్విచ్ ఆఫ్ చేయాలంటే పాస్‌వర్డ్ ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో ఆ ఫోన్ ఆఫ్ చేయలేదు.
– వెంటనే నా దగ్గర ఉన్న వేరే ఫో¯Œ లో ‘ఫైండ్ మై డివైజ్’ ఫీచర్ ఓపెన్ చేశాను. అందులో చూస్తే మొబైల్ లొకేషన్ అదే మసీదు ప్రాంగణంలో కనిపించింది. ఫైండ్ మై డివైజ్లో మిస్ అయిన మొబైల్ సెలక్ట్ చేసుకుని ట్యాప్ సౌండ్ క్లిక్ చేశా. దీంతో ఆ ఫోన్ మోగడం మొదలైంది. ఆ సౌండ్‌ను సైలెంట్ చేయాలన్న అవతలి వ్యక్తికి కుదరదు.
– ఆ ఫోన్ నుంచి వబ్దం గట్టిగా వస్తూనే ఉండడంతో వెంటనే ఆ ఫోన్‌కి కాల్ చేశా. అప్పటి వరకు ఫోన్ ఎత్తని వ్యక్తి ఆ తర్వాత చేసేది లేక కాల్ లిఫ్ట్ చేశాడు. మసీదు గేట్ నంబర్ 2 దగ్గరకు వచ్చి రిసీవ్ చేసుకోవాలని చెప్పాడు. నేను వెల్లగానే రెండు ఫోన్లూ నా చేతికి ఇచ్చాడు. కింద పడిపోతే తీసుకున్నా అని చప్పాడు. నా ఫోన్లు నాకు దొరికే సరికి ఏం మాట్లాడలేదు. కాస్త ఓపికగా ఆలోచిచండం మూలంగా నా ఫోన్లు నాకు దొరికాయి. ఆ దొంగ తెలివైనవాడు అయితే నా ఫోన్లు అంతే అని ట్వీట్‌లలో వివరించాడు షారుక్. ఈ ట్రిక్ రివీల్ చేసిన షారుక్‌ను నెటిజన్లు అభినందిస్తున్నారు. కొందరేమో దొంగలకు ఐడియాలు ఇవ్వకు అంటూ కామెంట్ పెడుతున్నారు.