Smartphone: ఈ చిన్న ట్రిక్ ద్వారా మీ ఫోన్ జీవితకాలం పెంచుకోండి..

ముందుగా వాట్సాప్ ను ఓపెన్ చేయండి. అందులో మీకు అనవసర ఫైల్స్ వద్దనుకుంటే అందుకు సంబందించిన కాంటాక్ట్ పై గట్టిగా నొక్కండి.

Written By: Srinivas, Updated On : June 22, 2023 6:17 pm

Smartphone

Follow us on

Smartphone: విద్యార్థుల నుంచి కార్పొరేట్ ఉద్యోగుల వరకు ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ మొబైల్ ఉంటోంది. ఈ మొబైల్ లో ఉండే రకరకాల అప్లికేషన్స్ వివిధ పనుల కోసం ఉపయోగిస్తున్నాం. వీటిలో అతి ముఖ్యమైంది వాట్సాప్. ఇప్పుడున్న పరిస్థితుల్లో కమ్యూనికేషన్ కోసం వాట్సాప్ మించిన యాప్ మరొకటి లేదు. ప్రతి స్మార్ట్ ఫోన్ లో వాట్సాప్ యాప్ తప్పనిసరిగా ఉంటుంది. అయితే ఈ యాప్ ను మెటా సంస్థ ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తుంది. కానీ వాట్సాప్ ను యూజ్ చేసేటప్పుడు కొన్ని విషయాలను తప్పనిసరిగా తెలుసుకోవాలి. ముఖ్యంగా ఈ యాప్ నిత్యం స్టోరేజీ ఫుల్ అవుతూ ఉంటుంది. దానిని క్లీన్ ఎలా చేసుకోవాలో చాలా మందికి అవగాహన ఉండదు. చిన్ని ట్రిక్ ద్వారా స్టోరేజీ ఫుల్ కాకుండా చూసుకోవచ్చు. ఆ ట్రిక్ గురించి తెలుసుకుంది.

వాట్సాప్ లో ఉండే కాంటాక్ట్స్, గ్రూప్సులల్లో నిత్యం వందల కొద్ది మెసేజ్ లు వస్తుంటాయి. వీటిలో ఫొటోలు, వీడియోలు ఉంటాయి. మనకు అవసరం లేనివి, గ్రూప్ లోషేర్ చేసిన చాలా ఫైల్స్ అటోమేటిక్ గా డౌన్లోడ్ అవుతూ ఉంటాయి. ఇవి నేరుగా గ్యాలరీలోకి వెళ్లి స్టోరేజి ఫుల్ అవుతోంది. దీంతో మనకు కావాల్సిన పిక్ లేదా వీడియో వెతుక్కోవడానికి చాలా సమయం పడుతుంది. లేదా వాటిని డెలీట్ చేయాలని అనుకుంటే చాలా సమయం పడుతుంది. ఒక్కో ఫైల్ లేదా మల్టీపుల్ ఫైల్ డెలీట్ చేయాలన్నా కనీసం గంట వరకు సమయం తీసుకోచ్చు.

అయితే ఇలాంటి ఫైల్స్ ఆటోమేటిక్ గా డౌన్లోడ్ కాకుండా ముందే ఓ ఆప్షన్ పై క్లిక్ చేస్తే అనవసర ఫైల్స్ డౌన్లోడ్ కావు. అలాగే మనకు కావాల్సిన వాటినిక డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల మీ ఫోన్ స్టోరేజి నిండిపోదు. అనవసర డేటా కూడా ఖర్చు కాదు. ఇలా రెండు విధాలుగా ఉపయోగం ఉంటుంది. అయితే ఈ ఆప్షన్ ఎలాఎంపిక చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..

ముందుగా వాట్సాప్ ను ఓపెన్ చేయండి. అందులో మీకు అనవసర ఫైల్స్ వద్దనుకుంటే అందుకు సంబందించిన కాంటాక్ట్ పై గట్టిగా నొక్కండి. దీంతో దాని ప్రొఫైల్ లోకి వెళ్తారు. అక్కడ మీడియా విజిబిలిటిపై మరోసారి గట్టిగా ప్రెస్ చేయండి. ఇక్కడ మీకు ఆటో డౌన్లోడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీనిని ‘నో’ సెలెక్ట్ చేయండి. ఇలా చేయడం వల్ల అనవసర ఫైల్స్ ఆటోమేటిక్ గా డౌన్లోడ్ కావు. ఒకవేళ ఈ ఆప్షన్ కావాలనుకుంటే ఆటోమేటిక్ డౌన్లోడ్ అనే ఆప్షన్ పై ‘ఎనెబుల్’ను టిక్ చేయండి.

ఇలాంటి చిన్న పని ద్వారా మీకు అనవసర శ్రమ తగ్గుతుంది. దీంతో గ్రూపుల్లో, కాంటాక్టుల్లో పంపించిన వీడియోలు, ఫొటోలు అవసరం అనుకుంటే మాత్రమే డౌన్లోడ్ చేసుకునే వీలుంటుంది. దీని వల్ల డేటా అదనంగా ఖర్చు కాకుండా సేవ్ అవుతుంది. అయితే ఇది చాలా మంది ఎనేబుల్ చేసుకోరు. దీంతో చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇప్పటికైనా ఈ ఆప్షన్ ను ఎంచుకొని మొబైల్ ను ఎక్కువకాలం కాపాడుకోండి.