Soham Parekh: ఐటీ ఉద్యోగులు ఒక కంపెనీలో చేస్తే ఉద్యోగం అంటారు. అదే ఒకటికి మించి కంపెనీలలో పని చేస్తే దానిని మూన్ లైట్ అంటారు. కరోనా సమయంలో చాలామంది ఉద్యోగులు మూన్ లైట్ విధానాల్లో ఉద్యోగాలు చేశారు. భారీగా డబ్బులు సంపాదించారు. అప్పుడు కంపెనీల అవసరాలు కూడా అలానే ఉండేది. ఉద్యోగులు అలా చేస్తున్నా పట్టించుకునేవి కాదు. ఎప్పుడైతే కరోనా తగ్గిందో.. అప్పటినుంచి కంపెనీలు మూన్ లైటింగ్ విధానాన్ని వ్యతిరేకించడం మొదలుపెట్టాయి. ఆయనప్పటికీ కొంతమంది ఉద్యోగులు మూన్ లైటింగ్ విధానంలో పనిచేస్తూనే ఉన్నారు. ఇటీవల కాలంలో లే ఆఫ్ లు అధికం కావడంతో మూన్ లైటింగ్ విధానానికి ఉద్యోగులు స్వస్తి పలికినట్టు తెలుస్తోంది.
Also Read: నాన్న.. మళ్లీ రావా.. జగన్ ఏమోషనల్ వీడియో
మూన్ లైటింగ్ లో మహా అయితే ఒక ఉద్యోగి రెండు కంపెనీలలో పని చేస్తాడు. అంతకుమించి పని ఒత్తిడి ఎదుర్కోవడం ఉద్యోగి వల్ల కాదు. పైగా ఇటీవలి కాలంలో ఐటి పరిశ్రమ పనితీరులో చాలావరకు మార్పులు వచ్చాయి. అదేపనిగా కంప్యూటర్ ముందు కూర్చోవడం వల్ల ఆరోగ్య సమస్యలు కూడా ఎదురవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఓ ఉద్యోగి సరికొత్త రికార్డు సృష్టించాడు. మూన్ లైటింగ్ విధానానికే సరికొత్త భాష్యం చెప్పాడు. ఏకంగా నాలుగు కంపెనీలలో పనిచేస్తున్నాడు. అంతేకాదు వారానికి 140 గంటలు పని మీదే ఉంటున్నాడు. రోజుకు మూడు లక్షలు సంపాదిస్తున్నాడు. అయితే రోజులు మొత్తం ఒకే తీరుగా ఉండవన్నట్టు.. ఇలా మూన్ లైటింగ్ లో సరికొత్త చరిత్ర సృష్టిస్తున్న అతడి బండారం ఒకరోజు బయటపడింది.
భారతదేశానికి చెందిన ఐటీ ఉద్యోగి సోహం పరేఖ్ అద్భుతమైన నాలెడ్జ్ ఉన్న వ్యక్తి. ఇతడికి ఐటీ లో అన్ని రంగాలపై విపరీతమైన పట్టు ఉంది.. ఇటీవల కాలంలో ఇతడి పై మిక్స్ ప్యానల్, ప్లే గ్రౌండ్ సహ వ్యవస్థాపకుడు సుహేల్దోషి తీవ్రమైన ఆరోపణలు చేశాడు. పరేఖ్ నుంచి కంపెనీలు దూరంగా ఉండాలని ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. ” పరేఖ్ నా స్టార్టప్ కంపెనీలో చేరాడు. కానీ అతడు ఇతర కంపెనీలతో కూడా పని చేస్తున్నాడు. మేము నిర్వహించిన అంతర్గత విచారణలో ఇది తేలింది.. ప్లీట్ ఆల్, నిండి, యాంటి మెటల్ వంటి స్టార్టప్ కంపెనీలలో అతడు పనిచేస్తున్నాడు. ఇంటర్వ్యూల సమయంలో ఫరేఖ్ ఆకట్టుకునే విధంగా మాట్లాడుతాడు. ఒప్పించే విధంగా మాట్లాడుతాడు. అప్పుడు అతడి మరో కోణాన్ని అంచనా వేయడం కష్టమవుతుంది. ఇంటర్వ్యూ మొత్తాన్ని అతడు గొప్పగా కొనసాగిస్తాడు. అందువల్లే ఇంటర్వ్యూ చేసే వారికి అనుమాన రాదని” సుహైల్ వెల్లడించాడు.
బహుళ ఉద్యోగాలు చేయడానికి ఆయా కంపెనీలను ఫరేఖ్ అత్యంత తెలివిగా ఒప్పించాడు. టైం జోన్ సమస్యలు, కంపెనీల మార్పులు వంటి సాకులు చెప్పేవాడు. దీంతో ఆయా కంపెనీలు అతడు చెప్పిన మాటలు నమ్మేవి.. అందువల్లే అతడు బహుళ ఉద్యోగాలు చేయడానికి అవకాశం ఏర్పడింది. అయితే ఫరేఖ్ వ్యవహారం “అధిక ఉపాధి” అనే అంశంపై విపరీతమైన చర్చకు దారితీసింది. కేవలం ఫరేఖ్ మాత్రమే కాదు.. చాలామంది ఉద్యోగులు ఇలా బహుళ ఉపాధి పొందడానికి రకరకాల మార్గాలు అన్వేషిస్తున్నారు.. స్మార్ట్ షెడ్యూలింగ్, టూల్స్ ఉపయోగించి మూన్ లైటింగ్ కు పాల్పడుతున్నారు. ఇలా సంవత్సరానికి ₹26.5 కోట్లకు పైగా సంపాదిస్తున్నారు. ఇలా సంపాదించడానికి వారు గొప్పగా చెప్పుకుంటున్నారు.. రిమోట్ వర్క్ విధానం వల్ల ఇటువంటి వారికి అన్నీ కలిసి వస్తున్నాయి. ఈ విధానాన్ని అడ్డం పెట్టుకొని వారు నాలుగుకు మించి కంపెనీలలో పనిచేస్తున్నారు.. అయితే ఈ వ్యవహారంపై కంపెనీలు మండిపడుతున్నప్పటికీ.. కొన్ని విభాగాలలో పనిచేసే వారికి మినహాయింపు ఇస్తున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఆ విభాగాలలో పని చేయాలంటే నిపుణుల అవసరం అధికంగా ఉంది. మార్కెట్ అవసరాలకు అనుగుణంగా నిపుణులు ఆ స్థాయిలో అందుబాటులో లేరు. ఇక మూన్ లైటింగ్ వ్యవహారంపై పరేఖ్ ఇంతవరకు స్పందించలేదు. అదే మరి కొద్ది రోజుల్లో ఆయన ఈ వ్యవహారంపై నోరు విప్పుతారని.. తాను నాలుగు కంపెనీలలో పని చేయాల్సిన అవసరం ఏమొచ్చిందో వివరిస్తారని తెలుస్తోంది.