WhatsApp, Telegram: వాట్సాప్‌, టెలిగ్రామ్’ నుంచి అదిరిపోయే కొత్త ఫీచర్స్‌ ఇవే !

WhatsApp, Telegram: స్మార్ట్ ఫోన్ వాడే ప్రతి వ్యక్తి వాట్సాప్‌, టెలిగ్రామ్ వాడకుండా ఉండలేడు. స్మార్ట్ ఫోన్ అనగానే వాట్సాప్‌ వాడకం అనేది సర్వసాధారణం అయిపోయిది. ఇక టెలిగ్రామ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. నిజానికి టెలిగ్రామ్ వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. చాలా చక్కగా పెద్ద ఫైల్స్ ను కూడా టెలిగ్రామ్ ద్వారా పంపవచ్చు. మరి ఈ రెండు వాట్సాప్‌, టెలిగ్రామ్ లో వచ్చిన లేటెస్ట్ అదిరిపోయే కొత్త ఫీచర్స్‌ గురించి తెలుసుకుందాం. ముందుగా టెలిగ్రామ్ […]

Written By: Sekhar Katiki, Updated On : January 22, 2022 12:52 pm
Follow us on

WhatsApp, Telegram: స్మార్ట్ ఫోన్ వాడే ప్రతి వ్యక్తి వాట్సాప్‌, టెలిగ్రామ్ వాడకుండా ఉండలేడు. స్మార్ట్ ఫోన్ అనగానే వాట్సాప్‌ వాడకం అనేది సర్వసాధారణం అయిపోయిది. ఇక టెలిగ్రామ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. నిజానికి టెలిగ్రామ్ వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. చాలా చక్కగా పెద్ద ఫైల్స్ ను కూడా టెలిగ్రామ్ ద్వారా పంపవచ్చు. మరి ఈ రెండు వాట్సాప్‌, టెలిగ్రామ్ లో వచ్చిన లేటెస్ట్ అదిరిపోయే కొత్త ఫీచర్స్‌ గురించి తెలుసుకుందాం.

WhatsApp, Telegram:

ముందుగా టెలిగ్రామ్ గురించి, తమ యూజర్లకు మరింత ఈజ్‌ను పెంచేందుకు టెలిగ్రాం కొత్త ఫీచర్స్‌ని తీసుకొచ్చింది . ఈ ఫీచర్స్‌ తో ఇప్పుడు టెలిగ్రామ్‌ మెసేజింగ్‌ మరింత ఆకర్షణీయంగా మారబోతోంది. యాపిల్‌ ఇమేజెస్ తరహాలో మెసేజ్‌ రియాక్షన్, మనం పంపే మెసేజ్‌లో కొంత భాగాన్ని హైడ్‌ చేసేందుకు స్పాయిలర్‌, గ్రూపులో అన్ని భాషలను అర్థం చేసుకునేందుకు మెసేజ్‌ ట్రాన్స్‌లేషన్‌, మన ఫేవరెట్ పేజ్‌ ను షేర్‌ చేసేందుకు థీమ్ క్యూఆర్‌ కోడ్స్‌ తీసుకొచ్చింది. ఈ ఫీచర్స్‌ చాలా ప్లస్ కానున్నాయి.

Also Read:  ఈ టైంలో ప్రభుత్వ ఉద్యోగుల సమ్మె సమంజసమేనా?

 

WhatsApp, Telegram:

ఇక వాట్సాప్‌ కూడా అదిరిపోయే కొత్త ఫీచర్స్‌ ను తీసుకొచ్చింది. ముఖ్యంగా ఫొటో ఎడిటింగ్‌ ప్రియులకు వాట్సాప్‌ కొత్త ఫీచర్‌ని తీసుకురాబోతోంది. డెస్క్‌ టాప్‌ వరకే పరిమితమైన డ్రాయింగ్ / ఫొటో ఎడిట్‌ టూల్‌ ను ఇక మొబైల్ వెర్షన్‌లో కూడా తీసుకొస్తున్నట్లు వాట్సాప్ తెలిపింది. రెండు వెర్షన్లలో ఈ టూల్‌ను తీసుకొస్తారట. ఒకటి ఫొటోల కోసం కాగా, రెండోది వీడియోలను ఎడిట్‌ చేసేందుకని వెల్లడించింది. ఇకపై యూజర్లు ఫొటోలను క్రాప్‌ చేయడంతో పాటు, ఎమోజీలు, జిఫ్‌, టెక్ట్స్‌ను కూడా యాడ్‌ చేయొచ్చట. మొత్తానికి ఫొటో ఎడిట్‌ కోసం వాట్సాప్‌ అదిరిపోయే ఫీచర్‌ ను యాడ్ చేసింది అన్నమాట.

Also Read:  అఖండ క్లోజింగ్ కలెక్షన్స్.. బాక్సాఫీస్ ను షేక్ చేసిన బాలయ్య !

Tags