Google Street In India: ఇండియాలో గూగుల్ స్ట్రీట్ సేవలు త్వరలో అందుబాటులోకి రాబోతున్నాయి. గూగుల్ ఎర్త్, గూగూల మ్యాప్ టెక్నాలజీని మిళితం చేసి దేశంలో మొదట పది నగరాల్లో దీనిని అదుబాటులోకి తెచ్చేందకు గూగుల్ సంస్థ. ఈ పది నగరాల్లో మన హైదరాబాద్ కూడా ఉంది. ఈ ఏడాది చివరి నాటికి 50 నగరాలు గూగుల్ స్ట్రీట్ అందుబాటులోకి రానుంది.

గూగుల్ స్ట్రీట్ అంటే..
గూగుల్ మ్యాప్ మనం ఇప్పటి వరకు చూశాం. ఆన్‌డ్రాయిడ్ ఫోన్ వ్యవస్థ వచ్చాక దీని వినియోగం పెరిగింది. ఈ క్రమంలోనే పట్టణాల్లోని వీధులన్నీ స్పష్టంగా కనిపించేలా.. అంటే మనం వీధిలో నిలబడితే కాలనీ ఎలా కనిపిస్తుందో.. అదేవిధంగా కనిపించేలా గూగుల్ స్ట్రీట్ అందుబాటులోకి రాబోతోంది. ఇందులో వీధులకు సంబంధించిన త్రీడీ వ్యూ కనిపిస్తుంది. మనం కాలనీలో ఉండి చూస్తున్న అనుభూతి కలుగుతుంది. ఇంతకుముందు మ్యాప్‌తో కేవలం రోడ్లు మాత్రమే కనిపించేవి. ఇప్పుడు ప్రతీ ఇళ్లు, వాకిలి అన్నీ ప్రత్యక్షమవుతాయి.
భద్రత ఎంత?
గూగుల్ స్ట్రీల్ సేవలపై గతంలో ఇండియాలో ఆంక్షలు ఉండేవి. గత ప్రభుత్వాలు గూగుల్ స్ట్రీట్‌కు అనుమతి ఇవ్వలేదు. రక్షణ పరంగా ఇబ్బందులు తలెత్తుతాయని, దేశంలోని విలువైన ప్రాంతాల లొకేషన్లు ఉగ్రవాదుల చేతుల్లోకి వెళ్తాయని భావించాయి. ముంబయ్‌పై ఉగ్రవాదుల దాడులకు ఇలాంటి ఫొటోలే కారణమని రక్షణ వ్యవస్థలు గుర్తించాయి. దీంతో గూగుల్ స్ట్రీట్ సేవలకు అనుమతి ఇవ్వలేదు. తాజాగా కేంద్ర ప్రభుత్వం జియో స్పేషియల్ పాలసీని తీసుకురావడంతో గూగుల్ స్ట్రీట్‌కు మార్గం సుగమమైంది.
జియో స్పేషియల్ పాలసీ విధానం..
కేంద్రం తీసుకొచ్చిన జియో స్పేషియల్ విధానంతో దేశానికి సబంధించిన ఇమేజ్, వీడియోలు తీయడం, వాటిని కలిగి ఉండడం కేవలం భారతీయులకే హక్కు ఉంటుంది. ఈవిధానంతో గూగుల్ స్ట్రీట్‌కు అవకాశాలను పరిశీలించిన గూగుల్ సంస్థ రెండు భారతీయ సంస్థలు టెక్ మహీంద్ర, జనోసిస్ ఇంటర్నేషనల్ అనే సంస్థలతో టైఅప్ అయింది. టెక్ మహీంద్ర ఐటీ సేవలు అందిస్తుంది. జనోసిస్ ఇంటర్నేషనల్ త్రీడీ ఇమేజ్ అందిస్తుంది. ఇండియాలో తీసే ఫొటోలు, వీడియోలను ఈ సంస్థల వద్దనే ఉంటాయి. డేటా కూడా వీరిదగ్గరే ఉంటుంది. అయితే ఇతరుకు వెళ్లే అవకాశం కూడా ఉంది. వేదేశీ సంస్థలు కూడా యాక్సెజ్ అయ్యే అవకాశం ఉంది. కానీ, దీనికి కేంద్రం కూడా దేశ భద్రత విషయంలో అన్ని చర్యలు తీసుకున్నాకే అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది.
పౌరులకు మెరుగైన సేవలు..
గూగుల్ స్ట్రీట్ అందుబాటులోకి వస్తే పౌరులకు మెరుగైన సేవలు అందుబాటులోకి రానున్నాయి. ప్రపంచమే చిన్న కుగ్రామం అవుతున్న ప్రస్తుత పరిస్థితిలో నగరాల్లో చిరునామా వెతకడం సవాల్‌గా ఉండేది. ఈ క్రమంలో వచ్చిన గూగుల్ మ్యాప్, గూగుల్ లొకేషన్, లైవ్ లొకేషన్ వచ్చాక ఈ సమస్యకు పరిష్కారం దొరికింది. ఈ కామర్స్ వ్యాపారం ఊపందుకుంది. తాజాగా అందుబాటులోకి వచ్చే గూగుల్ స్ట్రీట్‌తో లొకేషన్ వ్యూ మొత్తం స్పష్టంగా కనిపించే అవకాశం ఉంటుంది. దీంతో వాణిజ్య, వ్యాపార సేవలు మరింత మెరుగుపడే అవకాశం ఉంటుంది. అయితే టెక్నాలజీని మంచికి ఉపయోగించుకుంటే ఎంతో మేలు చేస్తుంది. దానిని వినాశనానికి వినియోగిస్తే మాత్రం తీవ్ర నష్టం జరుగుతుంది. త్వరలో అందుబాటులోకి రాబోతున్న గూగుల్ స్ట్రీట్ సేవలను మాత్రం మంచికే వినియోగించుకుందాం.