Gemini: గూగుల్ ఏఐ మోడల్.. జెమినీ పేరు వెనుక.. ఇంత చరిత్ర దాగుందా?

తాను ఆవిష్కరించిన ఏఐ మోడల్ కు జెమినీ అనే పేరు పెట్టడం వెనుక ఉన్న చరిత్ర గురించి గూగుల్ స్పష్టంగా వివరించింది. శని గ్రహం చుట్టూ టైటన్ అనే ఉపగ్రహం తిరుగుతుంది.

Written By: Anabothula Bhaskar, Updated On : May 22, 2024 5:18 pm

Gemini

Follow us on

Gemini: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లోనూ గూగుల్ తన హవా కొనసాగిస్తోంది. చాట్ జీపీటీ, మైక్రోసాఫ్ట్ కంపెనీలకు సవాల్ విసురుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తెరపైకి రావడానికి ప్రధాన కారణం ఓపెన్ ఏఐ కంపెనీ అయినప్పటికీ.. అందులో రకరకాల పరిశోధనలు చేసి.. తెరపైకి కృత్రిమ మేథతో తయారైన మోడళ్లను ఆవిష్కరిస్తోంది గూగుల్. ఇలా గూగుల్ ఆవిష్కరించిన ఏఐ మోడల్ పేరే జెమిని. దీనిని ఇటీవల మరింత ఆధునికీకరించింది. ఇటీవల సరికొత్త ఫీచర్లను యాడ్ చేసింది. ఇంతకీ గూగుల్ తన ఏఐ మోడల్ కు జెమిని అనే పేరు ఎందుకు పెట్టిందంటే..

తాను ఆవిష్కరించిన ఏఐ మోడల్ కు జెమినీ అనే పేరు పెట్టడం వెనుక ఉన్న చరిత్ర గురించి గూగుల్ స్పష్టంగా వివరించింది. శని గ్రహం చుట్టూ టైటన్ అనే ఉపగ్రహం తిరుగుతుంది. ఈ పేరు పెట్టాలని ముందుగా కొంతమంది సూచించారట. అయితే ఆ పేరు గూగుల్ యాజమాన్యానికి నచ్చలేదట. కానీ, అంతరిక్షానికి సంబంధించిన ఇతివృత్తంతో ముడిపడి ఉన్న పేరునే ఎంచుకోవాలని గూగుల్ యాజమాన్యం భావించిందట. అందువల్లే తన ఏఐ మోడల్ కు జెమిని అనే పేరు పెట్టిందట.. ఇందుకు సంబంధించిన వివరాలను గూగుల్ జెమినీ కోడ్ టెక్నికల్ లీడ్ జెఫ్ డీన్ వెల్లడించారు.. తాము ఏఐ మోడల్ కు అనేక పేర్లను పరిశీలిస్తుండగా.. జెమిని అనే పేరు తెరపైకి వచ్చిందని డీన్ ప్రకటించారు.. జెమిని అనే పదానికి కవలలు అని అర్థమట. అది అందరికీ నచ్చడంతో ఆ పేరు పెట్టారట..” జెమినీ పేరు పెట్టేందుకు చాలా కారణాలు ఉన్నాయి. అత్యంత శక్తివంతమైన ఏఐ మోడల్ ను సృష్టించేందుకు గూగుల్లో డీప్ మైండ్, బ్రెయిన్ పరిశోధన బృందాలను కంబైన్డ్ చేశాం. ఆ రెండు బృందాలు సమష్టిగా పనిచేసి, గ్రీకు పురాణ గాధలలోని క్యాస్టర్, పోలక్స్ తో కూడిన నక్షత్ర రాశి జెమిని వృత్తాంతాన్ని ప్రతిబింబించేలా చేశాయి. దీనివల్ల జెమిని అనే పేరు పెట్టాల్సి వచ్చింది. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం కొన్ని కోణాల నుంచి అనేక విషయాలను విశ్లేషించారు. వాటి సామర్థ్యానికి జెమిని ప్రసిద్ధి చెందింది. తాము తీరపైకి తీసుకువచ్చిన ఏఐ మోడల్ కూడా జెమినీ పనితీరుకు అత్యంత దగ్గరగా ఉంటుందని” గూగుల్ ప్రకటించింది.

గూగుల్ తయారుచేసిన ఏఐ మోడల్ కు జెమినీ అనే పేరు పెట్టడం వెనుక మరో కారణం కూడా ఉంది. 1960లో నాసా చంద్రుడిపై ప్రయోగం చేపట్టింది. నాసా తాను చేపట్టిన ఈ ప్రయోగానికి కావలసిన సాంకేతిక పరికరాలు, ఇతర వాటిని జెమిని పేరిట నిర్వహించింది. నాసా చేపట్టిన ఆ ప్రయోగం అంతరిక్షంలో సరికొత్త విప్లవానికి నాంది పలికింది. దాని ప్రకారమే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లోనూ తమ జెమినీ మోడల్.. సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టాలని ఆకాంక్షించామని గూగుల్ భావిస్తోందట