Vyom Mitra : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) వినూత్నమైన ప్రయోగాలతో ఇప్పటికే సరికొత్త గుర్తింపును సాధించింది. త్వరలో చేపట్టబోయే గగన్ యాన్ కోసం మనిషిని పోలి ఉన్న వ్యోమ్ మిత్ర రోబో (హాఫ్ హ్యూమనాయిడ్) పుర్రెకు ఇటీవల తుది రూపు ఇచ్చింది. హాఫ్ హ్యూమనాయిడ్స్ అనేవి రోబో కు వ్యవస్థల లాగా పనిచేస్తాయి. ఇవి పూర్తిగా మనుషుల పోలికల లాగే ఉంటాయి. వ్యోమ్ మిత్ర కూడా అలాంటి హాఫ్ హ్యూమనాయిడ్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. దీనికి కదిలే చేతులు ఉంటాయి. మొండెం, మెడ, దానిపై తలతో ఇది ఒక మనిషిలాగా కనిపిస్తుంది. అంతరిక్షంలో తనంతట తానుగానే పని చేసుకుంటూ వెళ్తుంది. అంతరిక్షంలో ఆస్ట్రోనాట్స్ కు సహాయం చేసే విధంగా రోబో వ్యవస్థలను రూపొందిస్తుంటారు. పదేపదే చేపట్టే, ప్రమాదకరమైన పనుల కోసం వీటిని ఉపయోగిస్తుంటారు.
ఎందుకు ఈ ప్రయోగం..
ఎందుకు ఈ ప్రయోగం అంటే
2025లో అంతరిక్షంలోకి ఆస్ట్రోనాట్స్ ను పంపించాలని ఇస్రో గగన్ యాన్ ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. దీనికంటే ముందు ఆ ప్రయోగం సురక్షితమా? కాదా? అనే విషయాన్ని పరీక్షించేందుకు స్పేస్ లోకి వ్యోమ్ మిత్రను పంపిస్తుంది. దానిద్వారా సాంకేతికతను ప్రదర్శించాలని అనుకుంటున్నది. ఆస్ట్రోనాట్స్ కన్సోల్ తో చేసే వివిధ రకాల పనుల కోసం ఈ రోబో చేతులను ఎలా ఉపయోగిస్తుంది? స్పేస్ వెహికల్ లో వివిధ వ్యవస్థలను ఎలా మానిటరింగ్ చేస్తుంది? భూమ్మీద నియంత్రణ బృందంతో సంప్రదింపులు ఎలా జరుగుతుంది? అనే విషయాలను పరిశీలిస్తారు. దీని నైపుణ్యాలను ఇస్రో పరిశీలించి, మానవ అంతరిక్ష ప్రయాణం మీద భవిష్యత్తు కాలంలో పడే ప్రభావాలను ఒక అంచనా వేస్తుంది. మనదేశంలో తొలి మానవ సహిత అంతరిక్ష ప్రయాణానికి ఇది ఎంతగానో ఉపకరిస్తుంది.
ఎలా తయారు చేశారంటే
వ్యోమ్ మిత్ర లో దాని పుర్రె అత్యంత ముఖ్యమైనది. 200 ఎంఎం *200 ఎంఎం పరిమాణం లో ఉన్న దీని బరువు 800 గ్రాములు. దీనిని a1si 10mg అనే అల్యూమినియం మిశ్రమంతో రూపొందించారు. బరువు తక్కువగా ఉన్నప్పటికీ దృఢంగా ఉంటుంది. నింగిలోకి రాకెట్ ను ప్రయోగించే సమయంలో బయటి వాతావరణం నుంచి పడే తరంగాల ఒత్తిడిని, కంపనాల భారాన్ని ఇది అత్యంత సమర్థవంతంగా తట్టుకుంటుంది. విపరీతమైన వేడిని కూడా సమర్థవంతంగా అడ్డుకుంటుంది. ఆడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీకి అనుగుణంగా ఈ అల్యూమినియం మిశ్రమాన్ని మార్చే అవకాశం ఉంటుంది. వ్యోమ్ మిత్ర పుర్రె తయారీలో ఇది అత్యంత ముఖ్యంగా ఉపయోగపడింది. ఏంఏం టెక్నాలజీ వల్ల పుర్రె భాగంలో జాలి వంటి నిర్మాణాలను చొప్పించారు. ఈ నిర్మాణం చూసేందుకు మనిషి జుట్టును పోలి ఉంది. దీని ద్వారా అనేక ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి.. అలాంటి ఆకృతిలో రూపొందించామని ఇస్రో శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Gaganyaan mission isro to send half humanoid female robot vyommitra to space
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com