Meta : ట్విట్టర్ బాటలోనే మెటా.. ఫేస్ బుక్, ఇన్ స్టా, వాట్సాప్ లో ఉద్యోగుల తొలగింపునకు రంగం సిద్ధం?

Meta : ట్విటర్ బాటలోనే మెటా నడుస్తోంది. మెటా సీఈవో మార్క్ జుకర్ బర్గ్ తన సోషల్ మీడియా సంస్థల్లోని ఉద్యోగుల తొలగింపునకు రంగం సిద్ధం చేశారు. ఉద్యోగుల్లో భారీగా కోత విదించాలని నిర్ణయించాడు. ఈ సంఖ్య వేలల్లో ఉంటుందని సమాచారం. ట్విటర్ తొలగింపుల తర్వాత మెటా తీసుకున్న ఈ నిర్ణయం అతిపెద్ద సంచలనంగా మారింది. సెప్టెంబర్ లోనే మెటా సంస్థ పరిధిలోని ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, వాట్సాప్ లలో ఉద్యోగుల తొలగింపు ప్రణాళికను జుకర్ బర్గ్ […]

Written By: NARESH, Updated On : November 7, 2022 7:54 pm
Follow us on

Meta : ట్విటర్ బాటలోనే మెటా నడుస్తోంది. మెటా సీఈవో మార్క్ జుకర్ బర్గ్ తన సోషల్ మీడియా సంస్థల్లోని ఉద్యోగుల తొలగింపునకు రంగం సిద్ధం చేశారు. ఉద్యోగుల్లో భారీగా కోత విదించాలని నిర్ణయించాడు. ఈ సంఖ్య వేలల్లో ఉంటుందని సమాచారం. ట్విటర్ తొలగింపుల తర్వాత మెటా తీసుకున్న ఈ నిర్ణయం అతిపెద్ద సంచలనంగా మారింది.

సెప్టెంబర్ లోనే మెటా సంస్థ పరిధిలోని ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, వాట్సాప్ లలో ఉద్యోగుల తొలగింపు ప్రణాళికను జుకర్ బర్గ్ సిద్ధం చేశారు. అయితే ఈ బుధవారం నుంచి ఉద్యోగుల కోతను మొదలుపెట్టారు. కంపెనీ పెట్టిన 18 ఏళ్లలో ఈ స్థాయిలో తొలగింపులు ఇదే ప్రథమం.

ప్రస్తుతం మెటా సంస్థకు ప్రపంచవ్యాప్తంగా 87వేల మంది పనిచేస్తున్నారు. ఆర్థిక మందగమనంతోపాటు కంపెనీ ఆదాయం భారీగా తగ్గడంతో ఖర్చులను తగ్గించాలని కంపెనీ నిర్ణయించింది. ఈ క్రమంలోనే దాదాపు 20వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపించేందుకు రంగం సిద్ధమైంది. దాదాపు 50శాతం ఉద్యోగులపై వేటు పడొచ్చని కూడా అంటున్నారు.

మెటా త్రైమాసిక ఫలితాలు షాకిచ్చాయి. మాంద్యం భయాలతో కంపెనీ షేర్ల విలువ దాదాపు 73 శాతం పడిపోయింది. స్టేక్ హోల్డర్లు ఆందోళన చెందుతున్నారు. ఈ ఏడాది మెటా ఆదాయం 4శాతం క్షీణించి 27.7 బిలియన్ డాలర్లకు పడిపోయింది. ఈ క్రమంలోనే మెటావర్స్ లో పెట్టుబడులు పెట్టడం మానేయాలని కంపెనీ కోరింది. ఇక ప్రపంచవ్యాప్తంగా ఉన్న 20శాతం ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించింది. దీంతో కంపెనీని బతికించేందుకు సీఈవో జుకర్ బర్గ్ ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు.

మెటాలోని ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ ల ఆదాయం ప్రధానంగా పడిపోయింది. 2023లోకంపెనీ పెట్టుబడులను తక్కువ సంఖ్యలోనే ప్రాధాన్యత రంగాలపై పెట్టాలని నిర్ణయించింది. ఇక కంపెనీ ‘మెటావర్స్ టెక్నాలజీపై భారీగా పెట్టుబడులు పెట్టింది.దీన్నుంచి ఇప్పటికీ ఎలాంటి ఆదాయం రాలేదు. కంపెనీ ఆర్థికంగా మెరుగైన స్థితికి ఉద్యోగుల తొలగింపే సరైన నిర్ణయం అని మెటా సీఈవో జుకర్ బర్గ్ ఈమేరకు నిర్ణయించాడు.