Facebook:ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ మళ్లీ ఆగింది.. ఈసారి ఏమైంది?

Facebook Shotdown: ప్రపంచంలోనే నంబర్ 1 సోషల్ మీడియా దిగ్గజ సంస్థ ఫేస్ బుక్ కష్టాలు వీడడం లేదు. దాని అనుబంధ సంస్థలైన ఇన్ స్టాగ్రామ్, వాట్సాప్ లు కూడా ఆగిపోతూ వినియోగదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. రెండు రోజుల క్రితమే ఈ మూడు ఫ్లాట్ ఫామ్ లు రాత్రి 9 గంటలకు హఠాత్తుగా బంద్ అయిపోయాయి. వాటిని రికవరీ చేసి సేవలు పునరుద్ధరించేందుకు ఏకంగా 7 గంటలు పట్టింది. ఇప్పుడా ఉపద్రవం మరిచిపోకముందే మరోసారి ఫేస్ బుక్, […]

Written By: NARESH, Updated On : October 9, 2021 12:09 pm
Follow us on

Facebook Shotdown: ప్రపంచంలోనే నంబర్ 1 సోషల్ మీడియా దిగ్గజ సంస్థ ఫేస్ బుక్ కష్టాలు వీడడం లేదు. దాని అనుబంధ సంస్థలైన ఇన్ స్టాగ్రామ్, వాట్సాప్ లు కూడా ఆగిపోతూ వినియోగదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. రెండు రోజుల క్రితమే ఈ మూడు ఫ్లాట్ ఫామ్ లు రాత్రి 9 గంటలకు హఠాత్తుగా బంద్ అయిపోయాయి. వాటిని రికవరీ చేసి సేవలు పునరుద్ధరించేందుకు ఏకంగా 7 గంటలు పట్టింది. ఇప్పుడా ఉపద్రవం మరిచిపోకముందే మరోసారి ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ లో సాంకేతిక సమస్య వచ్చి ఆగిపోయింది.

శుక్రవారం కొద్ది గంటల పాటు ఇన్ స్టాగ్రామ్ మెసెంజర్ సేవలు నిలిచిపోయాయి. అయితే సమస్యను పరిష్కరించామని.. ప్రస్తుతం యథావిధిగా సేవలు కొనసాగిస్తున్నామని సంస్థ వెల్లడించింది. వినియోగదారులను అసౌకర్యానికి గురిచేసినందుకు క్షమాపణలు తెలిపింది.

ప్రపంచ వ్యాప్తంగా వినియోగదారులు ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ ఆగిపోవడంతో కంగారుపడ్డారు. కాన్ఫిగరేషన్ మార్పుల్లో జరిగిన పొరపాటు కారణంగా శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా పలు యూజర్లకు చెందిన కొన్ని యాప్ ల సేవలు నిలిచిపోయాయి. ఇన్ స్టాగ్రామ్ లో కొత్త ఫీడ్ రాలేదు. మెసేంజర్ సందేశాలు సెండ్ కాలేదు. దీంతో ట్విట్టర్ లో వారంతా గోలపెట్టారు. ఫేస్ బుక్ పై విమర్శలు చేశారు.

ఈ క్రమంలోనే రెండు గంటల పాటు మా యాప్ సేవల్లో అంతరాయం కలిగినందుకు యూజర్లకు ఫేస్ బుక్ సారీ చెప్పింది. సమస్యను పరిష్కరించామని తెలిపింది. సాంకేతిక సమస్య కారణంగా ఫేస్ బుక్ కు చెందిన యాప్ ల సేవలు నిలిచిపోవడం వారంలో ఇది రెండోసారి కావడం గమనార్హం.

గత సోమవారం కూడా ఇదే కాన్ఫిగరేషన్ మార్పుల సమస్య కారణంగా దాదాపు 7 గంటల పాటు ఫేస్ బుక్, వాట్సాప్, ఇన్ స్టాగ్రామ్ సేవలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి సేవలు నిలిచిపోవడంతో ఫేస్ బుక్ పై యూజర్లు విమర్శలు గుప్పిస్తున్నారు.