Elon Musk: ఒక వస్తువు మార్కెట్లో విపరీతమైన ఆదరణ సంపాదించుకోవాలంటే కచ్చితంగా దాని అవసరతను చెప్పగలగాలి. లేదా ప్రజలతో దానిని కచ్చితంగా కొనుగోలు చేసే విధంగా మార్కెటింగ్ వ్యూహాన్ని అనుసరించాలి. ఇదంతా జరగాలంటే కచ్చితంగా మార్కెట్ లో సంచలనం సృష్టించాలి. హడావిడి చేయాలి.. ఇప్పుడు ఎక్స్ అధినేత మస్క్ కూడా అదే చేస్తున్నాడు.
కంటెంట్ క్రియేటర్లకు అద్భుతమైన వేదిక యూట్యూబ్. కొంతకాలంగా ప్రపంచం మొత్తాన్ని యూట్యూబ్ శాసిస్తోంది. కంటెంట్ క్రియేటర్లకు మొదట్లో యూట్యూబ్ ఉదారంగా డబ్బులు ఇచ్చేది. ఆ తర్వాత యూట్యూబ్ కు ఆదరణ పెరిగిన తర్వాత అనేక నిబంధనలను తెరపైకి తీసుకువచ్చింది. ముఖ్యంగా మానిటైజేషన్ ప్రక్రియలో చిత్ర విచిత్రమైన నిబంధనలను పెడుతోంది. దీనికి తోడు ఆల్గారిథామ్ విషయంలో కూడా యూట్యూబ్ కఠినమైన నిబంధనలు తెరపైకి తెచ్చింది. దీంతో చాలామంది కంటెంట్ క్రియేటర్లు ఇబ్బంది పడుతున్నారు.
ఈ పరిస్థితిని గమనించిన అకస్మాత్తుగా స్పందించాడు. కంటెంట్ క్రియేటర్లకు డబ్బు చెల్లించే విషయంలో కఠినంగా ఉండాల్సిన అవసరం లేదని మస్క్ పేర్కొన్నాడు. ఇటీవల ఇద్దరు ఎక్స్ ఖాతాదారులు మస్క్ మాట్లాడిన మాటలు సంబంధించి కీలకమైన విషయాలను హైలెట్ చేశారు. ఇవి యూట్యూబ్ కు కఠినమైన సవాల్ విసిరే విధంగా ఉన్నాయని పేర్కొన్నారు. అయితే మస్క్ మాట్లాడిన మాటలకు సంబంధించి సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఒకవేళ యూట్యూబ్ కు పోటీగా బలమైన వ్యవస్థను మస్క్ తీసుకురావాలని అనుకుంటున్నారా… అందువల్లే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారా.. అనే చర్చ నడుస్తోంది.
యూట్యూబ్ తో పోటీపడేందుకు మాస్క్ వీడియోలు, దీర్ఘకాలిక కంటెంట్ ను ప్రదర్శించే ఒక వేదికను సృష్టించడానికి అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. అధిక చెల్లింపులు ఆఫర్ కూడా ఇస్తే యూట్యూబ్ మీద అది ప్రభావం చూపిస్తుందని.. తద్వారా కంటెంట్ క్రియేటర్లు మస్క్ సృష్టించే వేదిక వైపు వచ్చే అవకాశం ఉంటుంది. దానికంటే ముందు ఎక్స్ స్థిరమైన మానిటైజేషన్ అందించాల్సి ఉంటుంది. క్రియేటర్లకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించాల్సి ఉంటుంది. అయితే ఇప్పటికిప్పుడు యూట్యూబ్ ప్రభావం తగ్గుతుంది అనుకోవడానికి లేదు. అయితే చెల్లింపుల వ్యవస్థలో ఇదే ధోరణి గనుక కొనసాగిస్తే దీర్ఘకాలంలో యూట్యూబ్ ఒత్తిడి ఎదురుకొక తప్పదని టెక్నాలజీ నిపుణులు పేర్కొంటున్నారు.