https://oktelugu.com/

ChatGPT In Trouble: చాట్ జీపీటీ తెచ్చి ఏఐ గప్పాలు కొడుతోంది గాని.. ఇలానే ఉంటే దివాళా తప్పదు

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాకతో చాలామంది ఉద్యోగాలు పోగొట్టుకున్నారనే వాదనతో ఐటీ నిపుణులు ఏకీభవించడం లేదు. పైగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పనిచేసే చాట్ జిపిటి వల్ల లక్షల ఉద్యోగాలు వస్తాయని వారు చెబుతున్నారు.

Written By:
  • Velishala Suresh
  • , Updated On : March 14, 2024 / 08:19 AM IST

    ChatGPT In Trouble

    Follow us on

    ChatGPT In Trouble: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాక వల్ల ఉద్యోగాలు పోతున్నాయి. టెక్ సపోర్ట్ నుంచి మార్కెటింగ్ వరకు ప్రతి విభాగంలో ఐటీ కంపెనీలు అడ్డగోలుగా ఉద్యోగులను పింక్ స్లిప్ ఇచ్చి బయటికి పంపిస్తున్నాయి. దేశంలో దిగ్గజ ఐటీ సంస్థ అయిన టిసిఎస్ నుంచి హెచ్ సీఎల్ వరకు ఇదే పరిస్థితి. ఇలా చాలామంది ఐటీ ఉద్యోగులు తమ కొలువులు కోల్పోవడానికి ప్రధాన కారణం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చాలామంది అంటున్నారు. ఇందులో నిజం కూడా ఉంది. కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఆధారంగా చేసుకుని రూపొందించిన చాట్ జీపీటీకి ఆశించినంత సానుకూల వాతావరణం ఉండదా? ఓపెన్ ఏఐ సంస్థ చెప్పినంత పెద్ద మార్కెట్ ఏర్పడదా? అంటే దీనికి అవును అనే సమాధానం చెబుతున్నారు ఐటీ నిపుణులు.

    ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాకతో చాలామంది ఉద్యోగాలు పోగొట్టుకున్నారనే వాదనతో ఐటీ నిపుణులు ఏకీభవించడం లేదు. పైగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పనిచేసే చాట్ జిపిటి వల్ల లక్షల ఉద్యోగాలు వస్తాయని వారు చెబుతున్నారు. ఇప్పటివరకు చాట్ జిపిటి వల్ల నేరుగా ఉద్యోగాలు కోల్పోయిన సంఘటనలు వెలుగు చూడలేదని ఐటీ నిపుణులు గుర్తు చేస్తున్నారు. ఇదే సమయంలో ఓపెన్ ఏఐ చెబుతున్నట్టుగా చాట్ జిపిటి నిర్వహణ, సాగించే ఆపరేషన్లు అంత తేలిగ్గా ఉండవని తెలుస్తోంది. కేవలం ఈ వెబ్ సైట్ నిర్వహణకు రోజుకు ఓపెన్ ఏఐ సంస్థ 7 లక్షల డాలర్లు ఖర్చు చేస్తోంది. ఇదే తీరుగా ఖర్చు ఉంటే కచ్చితంగా ఓపెన్ ఏఐ దివాలా తీయడం ఖాయమనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైతే భారీగానే పెట్టుబడులు ఉన్నప్పటికీ.. ఈ ఏడాది చివరి నాటికి మరో బిలియన్ డాలర్ల మేరకు పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతానికి మైక్రోసాఫ్ట్ పెట్టిన పది బిలియన్ డాలర్లతోనే ఓపెన్ ఏఐ నెట్టు కొస్తోంది. అయితే చాట్ జిపిటికి పెయిడ్ వెర్షన్ రూపంలో కొంత సొమ్ము వచ్చే అవకాశం ఉంది.

    చాట్ జిపిటి అధునాతన నమూనాలో సబ్ స్క్రిప్షన్ ద్వారా డబ్బులు వచ్చే అవకాశం ఉందని ఐటి నిపుణులు అంటున్నారు. అయితే ఇదేదో ఎంటర్టైన్మెంట్ కి సంబంధించింది కాదు కాబట్టి.. ప్రొఫెషనల్స్ మాత్రమే సబ్ స్క్రిప్షన్ తీసుకుంటారు. అప్పుడు చాట్ జిపిటి ఆశించినంత ఆదాయం రాకపోవచ్చు. స్థూలంగా చెప్పాలంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిస్థితి కేక్ వాక్ కాదు. దాని ఆధారంగా నడిచే చాట్ జిపిటికి ఎప్పటికీ ఆదరణ ఉంటుందని నమ్మకం లేదు. ఓపెన్ ఏఐ దివాళా తీయదని గ్యారంటీ లేదు. ఇప్పటికే పలు కార్పొరేట్ సంస్థలు ఆర్టిఫిషల్ ఇంటిలిజెన్స్ మీద భారీగా పెట్టుబడులు పెట్టాయి. ఒకవేళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కుప్పకూలిపోతే వాటి పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది.. అప్పుడిక మరో ఐటీ సంక్షోభం తలెత్తుతుంది.