Central Government New Portal: సామాన్య ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోంది. ప్రజల కోసం వివిధ రకాల పథకాలను ప్రవేశపెడుతోన్న ప్రభుత్వం.. ఈ స్కీమ్‌లను వారికి మరింత దగ్గర చేస్తోంది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన పలు రకాల మంత్రిత్వ శాఖలు, విభాగాలు అందించే స్కీమ్‌లన్ని ఒకే వేదికపైకి తీసుకొస్తోంది. దీని కోసం మోదీ ప్రభుత్వం జన్ సమర్థ్ పోర్టల్‌ను లాంచ్ చేయబోతుంది. ఈ పోర్టల్ కేంద్ర ప్రభుత్వానికి చెందిన మంత్రిత్వ శాఖలు, వివిధ విభాగాలు అందిస్తోన్న పథకాలన్నింటికి కామన్ పోర్టల్‌గా ఉండనుంది. కనిష్ట ప్రభుత్వం, గరిష్ట పాలన అనే నరేంద్ర మోదీ ప్రభుత్వ విజ¯Œ లో భాగంగా ఈ కొత్త పోర్టల్ రాబోతుంది. తొలుత 15 రకాల క్రెడిట్ లింక్డ్ ప్రభుత్వ స్కీమ్‌ను అందిస్తూ ఈ పోర్టల్‌ను లాంచ్ చేయనున్నట్టు ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. ఆ తర్వాత స్కీమ్‌ల ఆఫర్‌ను మరింత పెంచనున్నట్టు తెలిపారు. ఉదాహరణకు ప్రధాన మంత్రి ఆవాస యోజన, క్రెడిట్ లింక్డ్ క్యాపిటల్ సబ్సిడీ స్కీమ్ వంటి స్కీమ్‌లను ఈ పోర్టల్‌పై అందించనుంది.
అన్ని స్కీమ్‌లు ఒకే ప్లాట్‌ఫామ్‌పై…
అన్ని స్కీమ్‌లను ఒకే ప్లాట్‌పామ్‌పై అందించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ పోర్టల్‌ను తీసుకొస్తోంది. దీంతో స్కీమ్‌ల ప్రయోజనాలను ప్రజలకు తేలిగ్గా అందించవచ్చని భావిస్తోంది. ఈ పోర్టల్ పైలట్ ట్రయల్ ఇప్పటికే ప్రారంభమైనట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ పోర్టల్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన తర్వాత.. దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు ఎస్‌బీఐ, ఇతర లెండార్లు కూడా ఈ పోర్టల్‌ను పరీక్షించనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు, ఇతర సంస్థలు కూడా తమ స్కీమ్‌లను ఈ పోర్టల్‌పై ఉంచే అవకాశాలున్నాయి.
Also Read: Muslims Protest: 25 కోట్ల మంది కోసమే ఇంత బాధా.. 125 కోట్ల మందిని అవమానిస్తే స్పందించరా!?
కేంద్ర ప్రభుత్వం రుణ పథకాల కోసం 2018లో ఒక పోర్టల్‌ను ప్రారంభించింది. ఈ పోర్టల్‌లో ఎంఎస్‌ఎంఈ, హోమ్, వెహికిల్, పర్సనల్ లోన్ సేవలను అందించింది.
– ఈ పోర్టల్ ద్వారా పలు ప్రభుత్వ రంగ బ్యాంకులు కేవలం 59 నిమిషాల్లోనే లోన్లు జారీ చేశాయి. అంతకుముందు లోన్ల జారీకి 20 నుంచి 25 రోజుల సమయం పట్టేది.
– సూత్రప్రాయంగా ఆమోదం తెలిపిన తర్వాత 7 నుంచి 8 పని దినాల్లో ఎంఎస్‌ఎంఈలకు లోన్లు అందేవి.
– ఈ లోన్ల సూత్రప్రాయ ఆమోదం కోసం ఎంఎస్‌ఎంఈలు ఎలాంటి డాక్యుమెంట్లు సమర్పించకపోయినా ఏమీ కాకపోయేది.
– ఈ పోర్టల్ లాంచైనా రెండు నెల్లోనే ప్రభుత్వ రంగ బ్యాంకులు 1.12 లక్షల అప్లికేషన్లకు చెందిన రూ.37,412 కోట్ల రుణాలను ఎంఎస్‌ఎంఈలకు ప్రభుత్వ రంగ బ్యాంకులు జారీ చేశాయి.
– కేంద్ర ప్రభుత్వం కొత్తగా తెచ్చిన జన్ సమర్థ్ పోర్టల్ ద్వారా 13 పథకాలకు ఒకేచోట దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. జన్ సమర్థ్ అనేది ఒక డిజిటల్ పోర్టల్ ద్వరా ఇక్కడ 13 క్రెడిట్ లింక్డ్ ప్రభుత్వ పథకాలు ఒకే ప్లాట్‌ఫాం లింక్ చేశారు. లబ్ధిదారులు సులువైన దశల్లో వారి అవసరం అర్హతలను బట్టి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
– దీంతో ప్రభుల పథకం కింద రుణం తీసుకోవడం మరింత సులభతరం కానుంది. ప్రస్తుతం నాలుగు కేటగిరీల రుణాలకు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించారు. వీటిలో విద్య, వ్యవసాయ మౌలిక సదుపాయాలు, వ్యాపార, జీవన రుణాలు లాంటివి ఉన్నాయి. దరఖాస్తు నుంచి దాని ఆమోదం వరకు, అన్నీ
జన్ సమర్థ్ పోర్టల్ ద్వారా ఆనలైన్‌లో జరగనున్నాయి. దరఖాస్తుదారులు పోర్టల్లో తమ రుణ స్థితిని కూడా తనిఖీ చేయగలుగుతారు. దరఖాస్తుదారులు రుణం పొందకపోతే ఆన్‌లైన్‌లో కూడా ఫిర్యాదు చేయవచ్చు.