SIM Cards: ప్రస్తుత కాలంలో చాలామంది వద్ద మొబైల్స్ ఉన్నాయి. వీటిలో అవసరానికి కొద్ది సిమ్ కార్డులు కొత్తవి కొనుగోలు చేసుకుంటున్నారు. కుటుంబ సభ్యులు పెరిగిన కొద్దీ వారికి సిమ్ కార్డులు కూడా పెరిగిపోతున్నాయి. అయితే ఒకప్పుడు సిమ్ కార్డ్ కా వాలంటే మాన్యువల్ గా దరఖాస్తు చేసుకుంటే కొన్ని రోజుల తర్వాత ఆక్టివేట్ చేసి ఇచ్చేవారు. కానీ ఇప్పుడు అతి తక్కువ ధరలో సిమ్ కార్డును అందిస్తున్నారు. కొందరు రోడ్డు పక్కన ఫ్రీ సిమ్ ఇస్తున్నారు. ఎలాంటి కాస్ట్ లేకుండా ఆధార్ కార్డు, ఇతర ధ్రువీకరణ పత్రాలు తీసుకొని ఈ సిమ్ కార్డును జారీ చేస్తున్నారు. మరి ఈ సిమ్ కార్డు తీసుకోవడం వల్ల ఎలాంటి నష్టాలు ఉంటాయో తెలుసా?
చాలామంది ఉచితం అనగానే వెంటనే వాటిని తీసుకోవడానికి ఎగబడుతూ ఉంటారు. కానీ ఆ ఉచితం వెనుక ఎన్ని అనర్ధాలు ఉన్నాయో గమనించరు. వాస్తవానికి ఉచితం అన్నప్పుడు వారు ఎందుకు ఫ్రీగా ఇస్తారు? అన్నది ఆలోచించుకోవాలి. అలాగే సిమ్ కార్డు కూడా ఎలాంటి ప్రయోజనం లేకుండా ఇవ్వరు. మరి ఉచితంగా ఇచ్చే వారికి ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి అంటే?
సాధారణంగా ఒక సిమ్ కార్డ్ తయారు కావడానికి కనీసం రూ. 30 అవుతుంది. వాటిని విక్రయించడానికి అన్ని కలిపి రూ. 100 వరకు తీసుకోవాలి. కానీ వారు ఎలాంటి రూపాయి తీసుకోకుండా సిమ్ కార్డు ఇవ్వడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఉచితం అనగానే చాలామంది ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఇతర ధ్రువపత్రాలను అందిస్తారు. వీటిని ఆధారంగా చేసుకొని వాళ్లు ఇతరులకు విక్రయించే అవకాశం ఉంటుంది. దీనినే డేటా చోరీ అంటారు. ఒక వ్యక్తికి సంబంధించిన ఆధారాలు అన్ని ఇతరులకు విక్రయించడమే వీరి పని అని తెలుస్తోంది. ఇలా మీరు వినియోగదారుల నుంచి అనేక సమాచారాన్ని సేకరించి దుర్వినియోగానికి ఉపయోగిస్తారు. అంటే సైబర్ మోసాలు.. ఇతర అక్రమాలకు పాల్పడే వారికి వ్యక్తులకు సంబంధించిన వీటిని విక్రయిస్తారు. అలా ఒక్కో సిమ్ ఉచితంగా ఇచ్చిన వారి వివరాలతో.. ఒక్కో వ్యక్తి వివరాలపై రూ. 1000 వరకు విక్రయించే అవకాశం ఉంది.
అందువల్ల ఫ్రీ సిమ్ లేదా ఉచితంగా ఇచ్చే ఏ పథకాలకు ఎక్కువగా ఆకర్షణ కావద్దని ఇప్పటికే పోలీసులు హెచ్చరిస్తున్నారు. అయితే ఇప్పటికే అలా ఉచితంగా సిమ్ తీసుకున్నట్లయితే వెంటనే వారి ఆధార్ కార్డుపై ఎన్ని అనవసరపు సిమ్ లు ఉన్నాయో తెలుసుకోవాలి. అందుకోసం ప్రభుత్వానికి చెందిన www.tocop.com అనే వెబ్సైట్లోకి వెళ్లి వివరాలు అందిస్తే ఆధార్ కార్డు పై ఎన్ని సిమ్ లు ఉన్నాయో చూపిస్తుంది. అందులో ఏదైనా మీ నెంబర్ లేకుంటే దానిని వెంటనే డిఆక్టివేట్ చేసుకోవచ్చు. లేకుంటే మీ పేరు మీద కొందరు ఇతరులు సిమ్ తీసుకొని అక్రమాలకు పాల్పడే అవకాశాలు ఉన్నాయి.