TRAI: భారత దేశంలో అతిపెద్ద సమస్యలుగా మారాయి స్పామ్ కాల్స్, మెస్సేజ్‌లు. వీటిపై టెలికం రెగ్యులేటర్ అథారిటీ(ట్రాయ్)కి నిత్యం వేలాది ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అనేక ఆలోచనల తర్వాత స్పామ్ కాల్స్, మెస్సేజ్‌లకు చెక్ పెట్టాలని ట్రాయ్ టెలికం సంస్థలను ఆదేశించింది. అక్టోబర్ 1, 2024 నుంచి స్పామ్ కాల్స్, మెస్సేజ్‌లు రాకుండా చూడాలని ఆదేశించింది. దీంతో కొత్త నిబంధన అక్టోబర్ 1 నుంచి అమలులోకి వచ్చింది. దీంతో ఇకపై స్పామ్ కాల్స్, మెస్సేస్‌లు ఇబ్బంది పెట్టవు. అయితే స్పామ్ మెస్సేజ్‌తోపాటు బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థలు, ఈకామర్స్ కంపెనీల నుంచి వచ్చే మొబైల్ ఓటీపీలు ఇంతకుముందులా వచ్చే అవకాశం లేదు. దీనివలన చాలా పనులు ఆగిపోయే అవకాశం ఉంది. కొత్త నిబంధనను మొదట సెప్టెంబర్ 1 నుంచే అమలు చేయాలని భావించారు. కానీ, కంపెనీలు ఈ మార్పుకు సిద్ధం కాకపోవడంతో అక్టోబర్ 1కి వాయిదా వేసింది. దీంతో సైబర్ మోసాలకు చాలా వరకు చెక్ పడుతుంది. అయితే ఓటీపీ రాకపోవడంతో చాలా పనులకు ఆటంకం కలుగుతుంది. బ్యాంకు పనులకు ఓటీపీ మస్ట్, అది రాకపోతే పనులు ఆగిపోతాయి. ఆన్‌లైన్‌లో ఏదైనా కొన్నప్పుడు కూడా ఓటీపీ అవసరం. అది రాకపోతే డెలివరీలు పూర్తికావు, ఇలా చాలా సర్వీస్‌లకు ఇబ్బందులు తప్పవు.
సమస్యలకు బ్రేక్..
వైట్ లిస్ట్ కాని కంపెనీలు ఎస్‌ఎంఎస్‌లు, వెబ్‌సైట్ లింక్స్, ఓటీటీ లింక్స్, ఏపీకేఎస్ ఉంటే వాటిని బ్లాక్ చేయాలని టెలికం అధిరారిటీ టెలికాం సంస్థలను ఆదేశించింది. ఈ కొత్త రూల్ అక్టోబర్ 1 నుంచి అమలు చేయాలని ఆదేశించింది. ఐడెంటిటీని వెరిఫై చేసుకోని కంపెనీలు పంపించే వెబ్‌సైట్ లింక్, ఓటీటీ లింక్స్‌తో కూడిన మెసేజ్‌లు ఇక రావు. తెలియని లింక్ప్ క్లిక్ చేస్తే సెల్‌ఫోన్‌లోకి వైరస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ కొత్త నియమంతో ఆ ముప్పు తప్పుతుంది. మొబైల్ యూజర్లకు ఓటీపీలు, ఇతర సమాచారం పంపే కంపెనీలు తమ వివరాలను టెలికాం కంపెనీలతో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. కొత్త నిబంధన ప్రకారం.. వైట్‌లిస్ట్ కాని మెసేజ్‌ల రూపంలో వచ్చే వెబ్‌సైట్ లింక్స్, యాప్ లింక్స్ వంటివి బ్లాక్ అవుతాయి. ఇప్పటికే చాలా మంది ఈ లింక్స్‌పై క్లిక్ చేసి హ్యాకర్లబారిన పడ్డారు. కోట్ల రూపాయలు పోగొట్టుకున్నారు.
మొబైల్ యూజర్లపై ప్రభావం..
ఇదిలా ఉంటే.. కొత్త నిబంధనతో మొబైల్ యూజర్లకు వచ్చే ప్రతీ మెస్సేజ్ నిర్ధిష్టమైన ఫార్మాట్‌లో ఉండాలి. అంటే బ్యాంకు మెస్సేజ్ ఎలా ఉండాలి, ఫుడ్ డెలివరీ యాప్ మెస్సేజ్ ఎలా ఉండాలి అన్నది నిర్ణయించడం జరుగుతుంది. ఈ నిర్ణయించిన ఫార్మాట్‌లో లేని మెస్సేజ్‌లు యూజర్ల ఫోన్‌కు చేరవు. అంటే తెలియని సంస్థల నుంచి వచ్చే అనుమానాస్పద మెస్సేజ్‌లు మొబైల్ యూజర్లకు అందవు. దీంతో ప్రమాదం ఉండదు. కానీ, బ్యాంకులు, ఈకామర్స్, ఫుడ్ డెలివరీతోపాటు అవసరమైన మెస్సేజ్‌లు కూడా రావడం ఇబ్బందిగా ఉంటుంది. వెబ్‌సైట్ లింకులు,ఫోన్ నంబర్లు కూడా నిర్ణీత ఫార్మాట్లో అనుమతి పొందిన విధంగా ఉంటేనే ఫోన్‌కు డెలివరీ అవుతాయి. లేదంటే బ్లాక్ అవుతాయి. ప్రతీ మెసేజ్‌ను ఒక స్మార్ట్ సిస్టమ్ చెక్ చేస్తుంది. మంచిదా, చెడుదా అని తెలుసుకుంటుంది. చెడు మెస్సేజ్‌లను బ్లాక్ చేస్తుంది.
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read More