Best Gaming Mobiles  : గేమింగ్ కోసం ది బెస్ట్ ఫోన్ కావాలా? అదీ రూ. 20,000లోపే.. ఇవన్నీ మీకోసమే..

ది బెస్ట్ పిక్చర్ అండ్ సౌండ్, స్పీడ్ తో చాలా స్మార్ట్ ఫోన్లు మార్కెట్ లోకి వచ్చాయి. అవేంటి వాటిలో ఉన్న స్పెషిఫికేషన్స్ ను గురించి తెలుసుకుందాం. వాటి ధర కూడా కేవలం రూ. 20 వేల లోపే ఉన్న వాటిని పరిశీలిద్దాం. ఐక్యూ (IQOO) తన కొత్త బడ్జెట్ మోడల్ ఐక్యూ జెడ్ 9ఎస్ ను భారతదేశంలో ప్రవేశపెట్టింది.

Written By: NARESH, Updated On : August 21, 2024 9:52 pm

Best Gaming Mobiles

Follow us on

Best Gaming Mobiles  :టెక్నాలజీ మారిపోయింది. ఒకప్పుడు ఉన్న డబ్బా ఫోన్లు స్థానంలో స్మార్ట్ ఫోన్లు వచ్చాయి. అవి కూడా కేవలం ఫోన్ కోసం మాత్రమే వచ్చాయి. ఆ తర్వాత ఫోన్ల తయారీ దారులు భారీ కెమెరాలను అమర్చారు. వీటితో ఫొటోలు, వీడియోలు తీసుకుంటూ సంబురపడిపోయారు. ఇంకా ముందకు వెళ్తే.. మరింత ఫాస్ట్ పెరిగింది. దీంతో గేమ్స్ కోసం స్మార్ట్ ఫోన్లను తీసుకుంటున్నారు. ఇలా ఫోన్లు వాటి వాడకాన్ని బట్టి మారుతుంటాయి. ఇప్పుడు గేమింగ్ ప్రియులు ఎక్కువయ్యారు. ఆన్ లైన్, ఆఫ్ లైన్ గేమ్స్ యాప్స్ కూడా రాను రాను విపరీతంగా పెరిగిపోయాయి. వీటిని అనుసరించి ది బెస్ట్ గ్రాఫిక్స్, ది బెస్ట్ పిక్చర్ అండ్ సౌండ్, స్పీడ్ తో చాలా స్మార్ట్ ఫోన్లు మార్కెట్ లోకి వచ్చాయి. అవేంటి వాటిలో ఉన్న స్పెషిఫికేషన్స్ ను గురించి తెలుసుకుందాం. వాటి ధర కూడా కేవలం రూ. 20 వేల లోపే ఉన్న వాటిని పరిశీలిద్దాం. ఐక్యూ (IQOO) తన కొత్త బడ్జెట్ మోడల్ ఐక్యూ జెడ్ 9ఎస్ ను భారతదేశంలో ప్రవేశపెట్టింది. దీని ధర రూ. 20 వేల లోపే. బడ్జెట్ గేమింగ్ కోసం పరిశీలించేప్పుడు వినియోగదారులకు ఇది ది బెస్ట్ గా కనిపిస్తుంది.

2024 ఆగస్టులో రూ.20,000 లోపు బెస్ట్ ఫోన్లు..
1) ఐక్యూ జెడ్9ఎస్:
ఐక్యూ జెడ్9ఎస్ స్పెసిఫికేషన్లు చూస్తే 6.77 అంగుళాల ఫుల్ హెచ్‌డీ అన్‌మోల్ ఎల్ఈడీ డిస్ ప్లే, 1800 నిట్స్ గరిష్ట బ్రైట్నెస్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 300 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ ఉన్నాయి. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్ పై పని చేస్తుంది. ఇది 4 ఎన్ఎమ్ ప్రాసెస్ ఆధారంగా ఇది పనిచేస్తుంది. గ్రాఫిక్స్-ఇంటెన్సివ్ పనులు చేసేందుకు మాలి జీ 615 ఎంసీ 2 జీపీయూతో పని చేస్తుంది.

12 జీబీ వరకు LPDDR4X ర్యామ్, 256 జీబీ వరకు యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజ్ ఇందులో పొందుపరిచారు. ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టంపై ఆధారపడిన ఫన్ టచ్ ఓఎస్ 14 ఆపరేటింగ్ సిస్టంపై ఇది పనిచేస్తుంది. ఈ డివైజ్ కు రెండేళ్ల ఓఎస్ అప్ డేట్లు మూడేళ్ల సెక్యూరిటీ ప్యాచ్ అందించేందుకు కంపెనీ కట్టుబడి ఉంది. ఐక్యూ జెడ్9ఎస్ లో 44వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది.

2) వివో టీ 3:
వివో టీ3 5జీ స్మార్ట్ ఫోన్ లో 6.67 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అన్‌మోల్ ఎల్ఈడీ డిస్ ప్లే, 2400×1080 పిక్సెల్స్ రిజల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ సపోర్ట్, 360 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, హెచ్‌డీఆర్ 10+ సర్టిఫికేషన్, 1800 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ వంటి ప్రత్యేకతలున్నాయి.

వివో మిడ్-రేంజర్ 4 ఎన్ఎమ్ మీడియా టెక్ డైమెన్సిటీ 7200 చిప్ సెట్ తో ఇది పనిచేస్తుంది. గ్రాఫిక్స్ ఇంటెన్సివ్ కోసం మాలి జీ 610 ఎంసీ 4 జీపీయూను యాడ్ చేశారు. వివో టీ3 8 జీబీ వరకు ఎల్పీడీడీఆర్ 4ఎక్స్ ర్యామ్, 256 జీబీ వరకు యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజ్ తో లభిస్తుంది. మైక్రో ఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా 1 టీబీ వరకు విస్తరించుకోవచ్చు.

3) సీఎంఎఫ్ ఫోన్ 1:
మొట్ట మొదటి సారిగా సీఎంఎఫ్ ఫోన్ 4 ఎన్ఎమ్ ప్రాసెస్ ను ఇందులో ఉంచారు. మీడియా టెక్ డైమెన్సిటీ 7300 చిప్ సెట్ తో ఇది పని చేస్తుంది. గ్రాఫిక్స్ ఇంటెన్సివ్ పనుల కోసం మాలి జీ615 ఎంసీ 2 జీపీయూతో పని చేస్తుంది. 8 జీబీ వరకు ఎల్పీడీడీఆర్ 4ఎక్స్ ర్యామ్, 256 జీబీ వరకు యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజ్, మైక్రో ఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా 2 టీబీ వరకు పెంచుకోవచ్చు. ఆండ్రాయిడ్ 14 ఆధారిత నథింగ్ ఓఎస్ 2.6 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేస్తుంది. తాజా డివైజ్‌తో రెండేళ్ల ఓఎస్ అప్ డేట్స్, మూడేళ్ల సెక్యూరిటీ ప్యాచ్ లాంటివి హామీ ఇస్తుంది.

4) వన్ ప్లస్ నార్డ్ సీఈ 4 లైట్:
వన్ ప్లస్ నార్డ్ సీఈ 4 లైట్ 5జీలో 6.67 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అన్‌మోల్ ఎల్ఈడీ స్క్రీన్, 1,080×2,400 పిక్సెల్ రిజల్యూషన్, 120 హెర్ట్జ్ వరకు రిఫ్రెష్ రేట్, 2,100 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 20:9 యాస్పెక్ట్ రేషియో ఉన్నాయి. క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 695 చిప్ సెట్, అడ్రినో 619 జీపీయూ, 8 జీబీ LPDDR4X ర్యామ్, 256 జీబీ వరకు యూఎఫ్ఎస్ 2.2 ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నాయి. ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఆక్సిజన్ ఓఎస్ 14 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది.

కెమెరా సామర్థ్యం పరిశీలిస్తే.. ఈ ఫోన్ లో 50 మెగాపిక్సెల్ సోనీ ఎల్‌వైటీ -600 ప్రైమరీ సెన్సార్ తో పాటు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్), 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ తో డ్యూయల్ రెయర్ కెమెరా సెటప్ ఉంది. ఫ్రంట్ కెమెరా ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఈఐఎస్) సపోర్ట్ తో 16 మెగాపిక్సెల్ సెన్సార్ ను కలిగి ఉంది. నార్డ్ సీఈ 4 లైట్ 5జీ 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ 80వాట్ వైర్డ్ సూపర్ వూక్ ఫాస్ట్ ఛార్జింగ్, 5 వాట్ రివర్స్ ఛార్జింగ్ కు సపోర్ట్ చేస్తుంది.

5. రియల్ మీ నార్జో 70 ప్రో
రియల్ మీ నార్జో 70 ప్రోలో 6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అన్ మోల్ ఎల్ఈడీ డిస్ ప్లే, 2400×1800 పిక్సెల్స్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఉన్నాయి. ఈ స్మార్ట్ ఫోన్ స్ప్లాష్, డస్ట్ రెసిస్టెన్స్ కోసం ఐపీ 54 రేటింగ్ పొందింది. అంటే ఇది తేలికపాటి స్పాప్లన్ ను తట్టుకోగలదు.

నార్జో 70 ప్రో 5జీ టీఎస్ఎంసీ 6 ఎన్ఎమ్ ప్రాసెస్ ఆధారంగా మీడియాటెక్ డైమెన్సిటీ 7050 ప్రాసెసర్ తో పనిచేస్తుంది. అన్ని గ్రాఫిక్స్ ఇంటెన్సివ్ పనుల కోసం మాలి జీ68 ఎంసీ 4 జీపీయూతో జత చేసింది. ఇందులో 8 జీబీ వరకు LPDDDR4X ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్ అందించారు.