Moon: దశాబ్దాలుగా మనం రోజుకు 24 గంటలుగానే చెప్పుకుంటున్నాం.. లెక్కిస్తున్నాం. అయితే కాలం మారుతోంది.. సూర్య, చంద్ర గమనాలు మారుతున్నాయి. దీంతో మనం నాలుగేళ్ల కోసారి లీప్ ఇయర్‌గా పాటిస్తూ.. ఫిబ్రవరి 29వ రోజులు లెక్కిస్తున్నాం. అయితే.. ఏటా పెరుగుతున్న ఈ 6 గంటల సమయాన్ని త్వరలోనే మరో గంటగా పరిగణనలోకి తీసుకోబోతున్నారు. అటే ఇకపై ఏడాదికి 25 గంటలుగా పరిగణించనున్నారు. వినడానికి వింతగా ఉనా‍్న.. రాబోయే రోజుల్లో జరగబోయేది ఇదే. వాతావరణంలో మార్పుల కారణంగా భూమి వేగంలోనూ మార్పులు జరుగుతున్నాయని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఒక రోజుకు ఎన్ని గంటలు అంటే.. టక్కున 24 గంటలు అని చెబుతాం. ఎన్ని నిమిషాలు అంటే 1,440 అని, గంటకు ఎన్ని సెకన్లు అంటే 3,600 అని, రోజుకు ఎన్ని సెకన్లు అంటే.. 86,400 అని చెబుతాం. అయితే ఈ లెక్కలు కొన్ని రోజుల్లో మారబోతున్నాయి. భారత దేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడైనా ఇదే చెబుతారు. కానీ ఇకపై 25 గంటలు ఉంటాయి. ఇది నమ్మడానికి ఆశ్చర్యంగా ఉన్న వినడానికి ఎంతో వింతగా అనిపిస్తున్న.. మరి కొన్ని సంవత్సరాల్లో ఇది నిజం కాబోతుంది అని శాస్త్రవేత్తలు చెబుతున్న మాట. వాతావరణంలో మార్పులు.. భూమి వేగంలో మందగమనం కారణంగా భూ పరిభ్రమణానికి మరింత సమయం పడుతుందని గుర్తించారు. ఈ కారణంగా ఇప్పుడు రోజుకి 24 గంటలుగా ఉన్న సమయం కాస్త 25 గంటలుగా మారబోతుంది.
అప్పుడు రోజుకు 18.4 గంటలే..
ఇదిలా ఉంటే.. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే.. 14 లక్షల సంవత్సరాల క్రితం భూమిపై రోజుకి 18.4 ఒకటి గంటలే ఉన్నాయట. ఆ తర్వాత కాలంలో అటు వాతావరణంలో మార్పులు భూమి వేగంలో మందగమనం కారణంగా క్రమక్రమంగా ఒక రోజులో ఉండే గంటల సంఖ్య పెరిగిపోతుందట. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా రోజుకి 24 గంటలుగా సమయం ఉంది. ఇక రానున్న కాలంలో 25 గంటలుగా మారుతుందట.
భూభ్రమణం మందగమనం..
వాతావరణ మార్పుల కారణంగానే భూమి తిరిగే వేగంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయ్ అని శాస్త్రవేత్తలు గుర్తించారట. భూమి వేగం మందగించడం కారణంగానే సూర్యుడి చుట్టూ భూమి తిరిగే సమయానికి అదనంగా మరో గంట పట్టే అవకాశం ఉంది. ఇలా రోజుకి 24 గంటలు కాకుండా.. 25 గంటలు అయ్యే సమయం దగ్గర్లోనే ఉందని మ్యూనిచ్‌లోని టెక్నికల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అంచనా వేశారు. అయితే ఇది ఒకటో రెండో సంవత్సరంలో జరిగే పని కాదు. గతంలో 14 లక్షల సంవత్సరాల క్రితం 18.41 గంటలు ఉండేవి. ఈ లెక్కన చూసుకుంటే 20 కోట్ల సంవత్సరాలలో ఈ భూమిపై రోజుకి 25 గంటలు ఉండే అవకాశం ఉంటుందని శాస్త్రవేత్తల అంచనా.
గురుత్వాకర్షణ ప్రభావం..
విస్కాన్సిన్-మాడిసన్ విశ్వవిద్యాలయంలోని జియోసైన్స్ విభాగం ప్రొఫెసర్ స్టీఫెన్ మేయర్స్ తెలిపిన వివరాల ప్రకారం.. భూమి, చంద్రుడికి మధ్య గురుత్వాకర్షణలో మార్పులే సమయం మారడానికి ప్రధాన కారణమని తెలిపారు. భవిష్యత్తులో కాలంలో కలిగే మార్పుల తెలుసుకోవడానికి ఖగోళ శాస్త్రం ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొంది. ఆధునిక భౌగోళిక ప్రక్రియల అధ్యయనానికి కీలకంగా మారుతుంది. అలాగే బిలియన్ల సంవత్సరాల పురాతన శిలలను అధ్యయనం చేయడం ద్వారా కూడా ప్రయోజనం ఉంటుందని తెలిపింది.
దూరంతోపాటు సమయం..
భూమికి చంద్రుడికి మధ్య దూరం పెరుగుతోంది. దీంతో రోజుకు సమయం పెరుగుతుంది. ఇప్పుడున్నకాలానికి దాదాపు మరో గంట అదనంగా కలుస్తుంది. దీని ద్వారా క్యాలెండర్లలో లెక్కలన్నీ మారిపోతాయి. ఈ నేపథ్యంలో భూమి, చంద్రుడిలో జరుగుతున్న మార్పులను అధ్యయనం చేయగా ఈ విషయం వెల్లడైంది. పురాతన భౌగోళిక నిర్మాణాలు, అవక్షేప పొరలను పరిశీలించడం ద్వారా శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని తెలియజేశారు.