Apps : యాప్స్ ను కొత్తగా డౌన్ లోడ్ చేస్తున్నారా… అయితే ఈ వివరాలు మీకోసమే..

అంతేకాదు ఒక్కోసారి ఫోన్ పనితీరు కూడా ప్రభావితం అవుతుంది. అందువల్ల యాప్స్ డౌన్ లోడ్ చేసేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలి.

Written By: Anabothula Bhaskar, Updated On : May 21, 2024 8:15 am

Smart Phone Apps

Follow us on

Apps : స్మార్ట్ ఫోన్ ల వినియోగం పెరుగుతోంది. కొత్త కొత్త యాప్స్ విస్తృతి అధికమవుతోంది. ఇలాంటి సమయంలో ఫేక్ యాప్స్ కూడా పుట్టుకొస్తున్నాయి. వాటిని అసలువి అనుకొని డౌన్ లోడ్ చేస్తే.. జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. అందుకనే యాప్స్ డౌన్ లోడ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు టెక్ నిపుణులు.

స్మార్ట్ ఫోన్ వాడేవారు యాప్స్ ను గూగుల్ ప్లే స్టోర్ లేదా ఆపిల్ స్టోర్ నుంచి మాత్రమే డౌన్ లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల యాప్స్ కు సెక్యూరిటీ పరంగా భద్రత ఉంటుంది. ఈ రెండు చోట్ల కాకుండా, ఇతర ప్రాంతాల నుంచి యాప్స్ డౌన్ లోడ్ చేస్తే సమస్యలు ఎదురవుతాయి. ముఖ్యంగా సమాచార భద్రత, వ్యక్తిగత గోప్యత అనేవి ఉండవు. ఇలాంటి సమయాల్లో సైబర్ నేరగాళ్లు ప్రవేశించే ప్రమాదం లేకపోలేదు.. ఫేక్ యాప్స్ వల్ల వైరస్ మన ఫోన్లోకి ప్రవేశించే అవకాశం ఉంది. అంతేకాదు వాటిని తయారు చేసిన వారు మన సమాచారాన్ని సులభంగా పొందే ప్రమాదం ఉంది.. ఇలాంటప్పుడు సెక్యూరిటీ పరంగా భద్రంగా ఉండే యాప్స్ ను మాత్రమే డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.

యాప్ డౌన్ లోడ్ చేసే ముందు ప్రైవసీ పాలసీ చదవాలి. పూర్తి వివరాలను ఒకటికి రెండుసార్లు పరిశీలించాలి. యాప్ డౌన్ లోడ్ చేసిన తర్వాత అది ఇన్ఫర్మేషన్ అడుగుతుంది.. అది ఎలాంటి ఇన్ఫర్మేషన్ అడుగుతుందో జాగ్రత్తగా తెలుసుకోవాలి..యాప్ డేటా ను ఎప్పటికప్పుడు గమనించాలి.

యాప్ డౌన్ లోడ్ చేసేముందు రివ్యూ, రేటింగ్ ను కచ్చితంగా పరిశీలించాలి. డేట్, టైం ను జాగ్రత్తగా పరిశీలించాలి. టు స్టార్ కంటే తక్కువగా ఉండే యాప్స్ ను డౌన్ లోడ్ చేయకపోవడం మంచిది.. కొన్ని యాప్స్ మైక్రోఫోన్, లొకేషన్ వంటి వివరాలు అడుగుతాయి. అలాంటి వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలి. సాధ్యమైనంతవరకు అవసరం ఉన్న యాప్స్ మాత్రమే డౌన్ లోడ్ చేసుకోవాలి. లేకుంటే వాటి వల్ల ఫోన్ పై అదనపు భారం పడుతుంది. అంతేకాదు ఒక్కోసారి ఫోన్ పనితీరు కూడా ప్రభావితం అవుతుంది. అందువల్ల యాప్స్ డౌన్ లోడ్ చేసేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలి.