Car Care in Monsoon : దేశంలోని చాలా ప్రాంతాల్లో మొన్నటి వరకు ఎండలు దంచి కొట్టాయి. ఈ సంవత్సరం అసలు వర్షాలు ఉంటాయా? లేదా? అని కొందరు ఆందోళన చెందారు. కానీ ఆ భయం అక్కర్లేదని ఇప్పుడు అర్థం అవుతోంది. అక్కడా, ఇక్కడా అని తేడా లేకుండా దాదాపు దేశంలోని చాలా ప్రాంతాలు వరద నీటితో నిండిపోతున్నాయి. ఈ తరుణంలో వర్షానికి పాడయ్యే కొన్ని వస్తువులను జాగ్రత్తగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా కారు విషయంలో మరీ జాగ్రత్తలు తీసుకోవాలని ఆటోమొబైల్ రంగానికి చెందిన వారు చెబుతున్నారు. వర్షం కురిసినప్పుడు కారు విషయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో తెలుసుకుందాం..
చెట్టు కింద పార్క్ చేయొద్దు..
వర్షం కురిసినప్పుడు కారు పార్కింగ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా చెట్టు కింద కారును అస్సలు పార్క్ చేయకూడదు. గాలి, వాన బీభత్సంతో చెట్లు విరిగిపోయే అవకాశం ఉంది. దీంతో వాటి కొమ్మలు విరిగి కారుపై పడ్డా అవి డ్యామేజ్ అవుతాయి. అలాగే పాత గోడలు ఉన్న వాటి చోట కాకుండా దూరంగా పార్క్ చేయడం మరీ మంచిది.
స్మెల్ పోగొట్టండి..
వర్షం కురిసిన సమయంలో కారు తడుస్తుంది. దీంతో కారు లోపన బ్యాడ్ స్మెల్ వచ్చే అవకాశం ఉంది. అందువల్ల వర్షం వెలిసిన తరువాత వెంటనే కారు డోర్లు కాసేపు ఓపెన్ చేసి పెట్టండి. లేదా పర్ఫ్యూమ్ కొట్టండి. లేదంటే ప్రయాణం చేయాలనుకున్నప్పుడు ఇలా ఇలా చేయడం సాధ్యం కాదు. ఒకవేళ అలాగే ప్రయాణం చేస్తే కూర్చునేవారికి ఇబ్బంది కలుగుతుంది.
ఇండికేటర్లు జాగ్రత్త..
కారు ఇండికేటర్లకు కవర్లు కప్పి ఉంచడం మంచిది. లేదంటే ఇక్కడ ఏ కొంచెం గ్యాప్ ఉన్నా అందులోకి నీరు చేరే అవకాశం ఉంది. దీంతో అత్యవసర సమయంలో ఇండికేటర్లు పనిచేయకపోతే ఇబ్బందులు ఏర్పడుతాయి.
బ్రేక్ విషయంతో కేర్..
కారు బ్రేకులు పనిచేస్తున్నాయో.. లేదో.. ముందే చెక్ చేసుకోండి.. వర్షానికి బ్రేక్ లెన్స్ పాడైపోతాయి. అవి చూసుకోకుండా ప్రయాణం చేస్తే ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉంది.
విండ్ షీల్డ్ వైఫర్:
వర్షాకాలంలో విండ్ షీల్డ్ వైపర్ల అసవరం చాలా ఉంటుంది. వైపర్లు సరిగా పనిచేయనప్పటికీ బ్లేడ్లు దెబ్బతినకుండా చూసుకోవాలి. ఇందులో దుమ్ము చేరడం వల్ల సాఫీగా ప్రయాణం ఉండదు.
బ్యాటరీ:
వాన నీరు కారులో వెళ్లే అస్కారం ఉండొచ్చు. దీంతో బ్యాటరీ వ్యవస్థ డౌన్ అవుతుంది. అందువల్ల ప్రతిరోజూ ఉదయం ఒకసారి స్టార్ట్ చేసిన తరువాత బ్యాటరీ కండిషన్ తెలుసుకోండి. లేకపోతే అత్యవసర సమయంలో కారు స్టార్ట్ కాక సమస్యలు వస్తాయి.