https://oktelugu.com/

IPhone: అలెర్ట్ : ఐఫోన్‌ అభిమానులకు శుభవార్త !

IPhone: ఐఫోన్‌ అనగానే గొప్ప బ్రాండ్ అని ఫీల్ అవుతుంటారు. అసలు ఐఫోన్‌ వాడుతున్నారు అంటే.. అదొక గొప్ప స్టేటస్. అయితే, ఐఫోన్‌ ప్రియులకి శుభవార్త. అమెజాన్‌ గ్రేట్‌ రిపబ్లిక్‌ డే సేల్‌లో భాగంగా, ఐఫోన్‌ 12 రేటుని బాగా తగ్గించి అమ్ముతోంది. నలుపు రంగులోని 64 జీబీ ఐఫోన్‌ 12 రూ. 11,901 తగ్గించి రూ. 53,999 కే అమ్ముతుంది. దీని ఒరిజినల్‌ రేట్‌ రూ. 65,900 /-,. ఇది మంచి డీల్. ఇక ఐఫోన్ […]

Written By: , Updated On : January 22, 2022 / 12:26 PM IST
Follow us on

IPhone: ఐఫోన్‌ అనగానే గొప్ప బ్రాండ్ అని ఫీల్ అవుతుంటారు. అసలు ఐఫోన్‌ వాడుతున్నారు అంటే.. అదొక గొప్ప స్టేటస్. అయితే, ఐఫోన్‌ ప్రియులకి శుభవార్త. అమెజాన్‌ గ్రేట్‌ రిపబ్లిక్‌ డే సేల్‌లో భాగంగా, ఐఫోన్‌ 12 రేటుని బాగా తగ్గించి అమ్ముతోంది. నలుపు రంగులోని 64 జీబీ ఐఫోన్‌ 12 రూ. 11,901 తగ్గించి రూ. 53,999 కే అమ్ముతుంది. దీని ఒరిజినల్‌ రేట్‌ రూ. 65,900 /-,. ఇది మంచి డీల్.

IPhone

IPhone

ఇక ఐఫోన్ 11, ఐఫోన్ 13 సిరీస్‌ల మీద యాపిల్‌ సూపర్‌ ఆఫర్ ప్రకటించింది. ఐఫోన్ 7 ఎక్స్‌చేంజ్‌ చేస్తే ఐఫోన్ 11పై రూ.15 వేలు తగ్గింపు, ఐఫోన్ 10ఆర్ సిరీస్ ఎక్స్‌చేంజ్‌ చేసుకుంటే ఐఫోన్ 13పై రూ. 23 వేల ఎక్స్‌చేంజ్‌ బోనస్ ఆఫర్ ప్రకటించింది. అయితే, ఈ రెండు ఆఫర్స్ కూడా కేవలం ఇండియాస్టోర్‌లో మాత్రమే లభిస్తున్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డుతో క్యాష్‌బ్యాక్‌ ఆఫర్స్‌ కూడా ఉంటాయి. వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి.

Also Read:  ఎన్ని కోట్లిచ్చిన ఆ పని చేయబోమంటున్న ఈ సినీ తారలు మీకు తెలుసా?

IPhone

IPhone

ఐఫోన్‌ ప్రియులకి మరో శుభవార్త కూడా వచ్చింది. ఐఫోన్‌ వినియోగదారులకు వీలైనంత ఈజ్‌ను తీసుకొచ్చేందుకు యత్నిస్తుంటుంది యాపిల్‌. ఈక్రమంలోనే తదుపరి రానున్న ఐఫోన్‌ 14లో అసలు సిమ్‌కార్డు స్లాటే లేకుండ, పూర్తిగా ఈ-సిమ్‌ స్లాట్స్‌నే పెడుతుందని తెలుస్తోంది. ఇప్పటివరకు ఐఫోన్ ఎక్స్ఆర్‌ మోడల్‌ నుండి ఒక ఫిజికల్‌ సిమ్‌, ఒక ఎలక్ట్రానిక్‌ సిమ్‌గా ఐఫోన్‌ విడుదలవుతూ వచ్చింది. సైబర్‌ నేరాల అడ్డుకట్టకు, యూజర్స్‌కు ఎక్కువ ఫీచర్స్‌ను అందించేందుకు ఇలా చేస్తోందట.

Also Read: మీ మెదడు పనితీరు అద్భుతంగా పని చేయాలా ?.. ఐతే.. !

Tags