ఏపీ, తెలంగాణ వినియోగదారులు మాత్రమే ఆధార్ తో లింక్ అయిన మొబైల్ నంబర్ల గురించి తెలుసుకోవచ్చు. ఇందుకోసం మొదట https://tafcop.dgtelecom.gov.in/ వెబ్ సైట్ లింక్ ను ఓపెన్ చేయాలి. ఆ తర్వాత వెబ్ సైట్ లో పది అంకెల మొబైల్ ఫోన్ నంబర్ ను ఎంటర్ చేయాలి. ఆ తర్వాత రిక్వెస్ట్ ఓటీపీ బటన్ పై క్లిక్ చేసి మొబైల్ ఫోన్ కు వచ్చిన వన్ టైమ్ పాస్ వర్డ్ ను ఎంటర్ చేయాలి.
ఆ తర్వాత వెబ్ సైట్ ద్వారా ఆధార్ కార్డుకు లింక్ అయిన మొబైల్ నంబర్ల జాబితాను చూడవచ్చు. ఒకే ఆధార్ కార్డుపై ఎన్ని సిమ్ కార్డులను తీసుకున్నామో తెలుసుకోవచ్చు. ఒకవేళ ఆ నంబర్లలో వినియోగించని నంబర్ ఉంటే ఆ నంబర్ ను బ్లాక్ చేసే అవకాశం ఉంటుంది. అదనపు మొబైల్ కనెక్షన్లను నియంత్రించుకునే అవకాశం ఉండటంతో వినియోగదారులకు ప్రయోజనం చేకూరనుంది.
ట్రాయ్ అందిస్తున్న ఈ సర్వీసుల ద్వారా వినియోగదారులకు ప్రయోజనం చేకూరనుంది. మీ పేరుతో పాటు మీ కుటుంబ సభ్యుల పేర్లపై ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయనే వివరాలను సైతం సులభంగా తెలుసుకోవచ్చు.