https://oktelugu.com/

Artificial General Intelligence : AI ని మించిన సాంకేతికత దూసుకొస్తుంది.. ఇంతకీ దీని పేరేంటి? చోటు చేసుకునే మార్పులు ఏంటంటే?

ఏజీఐ కనుక అందుబాటులోకి వస్తే.. మన మూడ్ కు తగ్గట్టుగా అలెక్సా పాట పెడుతుంది. ఇవాళ నా ప్రోగ్రామ్స్ ఏంటి అని అడిగితే.. ఇవాళ నీ ఆరోగ్యం బాగోలేదు. రక్తపోటు పెరిగింది. గుండె వేగంగా కొట్టుకుంటున్నది. జ్వరం కూడా ఉంది. ఇంట్లో విశ్రాంతి తీసుకో. డాక్టర్ ను ఇప్పుడే పిలిచా వస్తున్నారు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : August 18, 2024 / 12:43 PM IST

    Artificial General Intelligence,

    Follow us on

    Artificial General Intelligence : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రస్తుతం ఊపేస్తోంది. ఊహకందని మార్పులతో టెక్నాలజీని సరికొత్త పరుగులు పెట్టిస్తోంది. దీనివల్ల అనేక రకాల సౌలభ్యాలు మనిషికి అందుబాటులోకి వచ్చాయి. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అనేక క్లిష్టతరమైన ఆపరేషన్లు కూడా సాధ్యమవుతున్నాయి. మునుముందు ఈ టెక్నాలజీలో ఎన్ని మార్పులు చోటు చేసుకుంటాయో.. ఇంకా ఎన్ని సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయో.. అనుకుంటున్న తరుణంలో.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను తలదన్నేలా మరో కొత్త సాంకేతిక పరిజ్ఞానం కళ్ళ ముందుకు వచ్చేయనుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు మించిన సౌలభ్యాలు, సౌకర్యాలు ఇందులో ఉంటాయట. స్థూలంగా చెప్పాలంటే మనిషిలా ఆలోచిస్తుంది. మనిషిలాగా మసలుకుంటుందట. ఈ సాంకేతిక పరిజ్ఞానం పై వేగంగా పరిశోధనలు జరుగుతున్నాయి. త్వరలోనే ఏజీఐ ఆవిష్కరణ జరుగుతుందని సాంకేతిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే అలెక్సా మనకు నచ్చిన పాట పెడుతోంది. వాతావరణం ఎలా ఉందో సిరి చెబుతోంది. సాంకేతికతను ఎలా ఉపయోగించుకోవాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కళ్ళ ముందు చూపిస్తోంది.

    ఇక ఏజీఐ కనుక అందుబాటులోకి వస్తే.. మన మూడ్ కు తగ్గట్టుగా అలెక్సా పాట పెడుతుంది. ఇవాళ నా ప్రోగ్రామ్స్ ఏంటి అని అడిగితే.. ఇవాళ నీ ఆరోగ్యం బాగోలేదు. రక్తపోటు పెరిగింది. గుండె వేగంగా కొట్టుకుంటున్నది. జ్వరం కూడా ఉంది. ఇంట్లో విశ్రాంతి తీసుకో. డాక్టర్ ను ఇప్పుడే పిలిచా వస్తున్నారు. నీ కార్యక్రమాలు మొత్తం రద్దు చేసుకోవాల్సిందే.. దగ్గర్లో ఉన్న రెస్టారెంట్ గురించి అడిగితే సిరి.. ఇక్కడ నువ్వు తినే ఆహారం దొరికేది లేదని, వేరే ప్రాంతం వెళ్దామని చెబుతుంది. అయితే ఈ సాంకేతికతలు ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ ద్వారా అందుబాటులోకి వస్తాయని టెక్ నిపుణులు చెబుతున్నారు.

    వేగంగా సాగుతున్న పరిశోధనల వల్ల ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ వచ్చే నెలలోనే అందుబాటులోకి వస్తుందని సాంకేతిక రంగ నిపుణులు అంటున్నారు. మరికొందరేమో జనవరి లోగా వస్తుందని చెబుతున్నారు. ఇంకా కొందరేమో 2030 దాకా సమయం పడుతుందని అంటున్నారు. ఇలాంటి మాటలు ఎలా ఉన్నప్పటికీ ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ రావడం మాత్రం తథ్యం అని తెలుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన నెట్వర్క్, అత్యంత శక్తివంతమైన సూపర్ కంప్యూటర్లతో కూడిన టిఫిన్ జనరల్ ఇంటెలిజెన్స్ అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది.. దీనికి తగ్గట్టుగానే ప్రయోగాలు అత్యంత వేగవంతం అయ్యాయని సమాచారం. సింగ్యూలారిటీ నెట్ అనే సంస్థ ఈ సూపర్ కంప్యూటర్ల నెట్వర్క్ మొత్తాన్ని అనుసంధానిస్తున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు వీటికి అత్యంత ఆధునికమైన, అత్యంత శక్తివంతమైన హార్డ్ వేర్ వినియోగిస్తున్నట్టు తెలుస్తోంది..” ఏజీఐ దిశగా మేము కీలక అడుగులు వేస్తున్నాం. వీటికోసం సూపర్ కంప్యూటర్లను ఉపయోగిస్తున్నాం . ఈ సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వస్తే కళ్ళముందే అద్భుతం ఆవిష్కారమవుతుంది. అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వస్తుంది. ఆ తర్వాత మనిషి జీవితం మరింత సుఖవంతం అవుతుందని” సింగ్యూలారిటి సంస్థ చెబుతోంది. అయితే కృత్రిమ మేధకు సంబంధించి జరుగుతున్న పరిశోధనలు, దాని అభివృద్ధి కోసం ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ ఆలయన్స్ అనే కూటమిన్ ఏర్పాటు చేశారు. ఇందులో సింగ్యూలారిటీ నెట్ కూడా కీలక భాగస్వామిగా ఉంది.