Homeసైన్స్‌ అండ్‌ టెక్నాలజీSecret Websites: పిచ్చెక్కించే మూడు వెబ్‌సైట్లు ఇవే..

Secret Websites: పిచ్చెక్కించే మూడు వెబ్‌సైట్లు ఇవే..

Secret Websites: ఈ రోజుల్లో ఇంటర్నెట్‌ విజ్ఞానం, వినోదం, సృజనాత్మకతను అందించే అద్భుతమైన వేదికగా మారింది. ప్రపంచం మొత్తం అరచేతిలోనే ఉంది. ఇంటర్నెటర్‌ ఆండ్రాయిడ్‌ పోన్‌తో ప్రతీ సమాచారం క్షణాల్లో దొరుకుతుంది. అయితే చాలా మంది సోషల్‌ మీడియాలో టైంపాస్‌ చేస్తున్నారు. సమయం వృథా చేస్తున్నారు. యాప్స్‌ డౌన్‌లోడ్‌తో ఫోన్‌ మెమెరీ ఫుల్‌ అవుతోంది. ఈ నేపథ్యంలో పిచ్చెక్కించే మూడు వెబ్‌సైట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో విజ్ఞానం, గేమ్స్‌తోపాటు వినోదం కూడా పొందవచ్చు.

1. ఓల్డ్‌ మ్యాప్స్‌ ఆన్‌లైన్‌.ఆర్గ్‌(oldmapsonline.org)..
ఓల్డ్‌ మ్యాప్స్‌ ఆన్‌లైన్‌.ఆర్గ్‌.. అనేది చరిత్ర, భౌగోళిక శాస్త్రం, సంస్కృతిపై ఆసక్తి ఉన్నవారికి ఒక అద్భుతమైన వనరు. ఈ వెబ్‌సైట్‌లో ప్రపంచ దేశాల చారిత్రక మ్యాప్‌లు, యుద్ధాలు, సామాజిక–రాజకీయ మార్పులు, సరిహద్దు వివరాలు వంటి సమాచారం అందుబాటులో ఉంటుంది. ఈ సైట్‌ చరిత్ర విద్యార్థులు, గురువులు, మరియు ఔత్సాహికులకు అనువైనది.
– పురాతన నాగరికతల నుంచి ఆధునిక కాలం వరకు మ్యాప్‌ల సేకరణ.
– యుద్ధాలు, సామ్రాజ్యాల విస్తరణ, సరిహద్దు మార్పుల వివరణాత్మక సమాచారం.
– ఉచితంగా అందుబాటులో ఉండే విస్తృతమైన డిజిటల్‌ ఆర్కైవ్‌.

Also Read: సీఎం సార్.. మన డిప్యూటీ సీఎం సార్ టెస్ట్ చేసిన సైకిల్ ఆంధ్రాలో ఉన్న అందరి పేద విద్యార్థులకు ఇస్తే సూపర్ కదా!

2. డెడ్‌షాట్‌.ఐవో(dedshot.oi)
డెడ్‌షాట్‌.ఐవో అనేది ఆన్‌లైన్‌ గేమింగ్‌ ప్రియులకు ఒక అద్భుతమైన వేదిక. ఈ సైట్‌లో డౌన్‌లోడ్‌ చేయకుండానే బ్రౌజర్‌లో ఆడగలిగే ఫస్ట్‌–పర్సన్‌ షూటర్‌ గేమ్‌ అందుబాటులో ఉంటుంది. ఇది ఆటగాళ్లకు తక్షణ వినోదాన్ని అందిస్తూ, సరళమైన ఇంటర్‌ఫేస్‌తో ఆకర్షిస్తుంది.

ప్రత్యేకతలు..
– డౌన్‌లోడ్‌ అవసరం లేకుండా బ్రౌజర్‌లో ఆడగలిగే సౌలభ్యం.
– ఉత్తేజకరమైన మల్టీప్లేయర్‌ ఊ్క గేమ్‌ అనుభవం.
– సరళమైన గ్రాఫిక్స్, తక్కువ సిస్టమ్‌ అవసరాలు.

Also Read: ఈ ఒక్క టెస్ట్ తో క్యాన్సర్ ఉందో? లేదో? తెలుసుకోవచ్చు.. అదేంటంటే?

3. రేడియో.గార్డెన్‌(radio.garden)..

రేడియో.గార్డెన్‌ అనేది సంగీత ప్రియులకు ఒక అద్భుతమైన వెబ్‌సైట్‌. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న వేలాది రేడియో స్టేషన్‌లను ఒకే చోట అందిస్తుంది. ఒక ఇంటరాక్టివ్‌ గ్లోబ్‌ ఇంటర్‌ఫేస్‌ ద్వారా వినియోగదారులు ఏ దేశంలోనైనా రేడియో స్టేషన్‌లను ఎంచుకొని, వివిధ సంస్కృతుల సంగీతాన్ని ఆస్వాదించవచ్చు.

ప్రత్యేకతలు:
– ప్రపంచ దేశాల నుంచి వేలాది రేడియో స్టేషన్‌లకు యాక్సెస్‌.
– ఇంటరాక్టివ్‌ 3ఈ గ్లోబ్‌ ఇంటర్‌ఫేస్, ఇది సంగీత ప్రయాణాన్ని ఆసక్తికరంగా చేస్తుంది.
– స్థానిక సంగీతం, టాక్‌ షోలు, మరియు సాంస్కృతిక కార్యక్రమాలు.

ఈ సైట్‌లు ఉచితంగా అందుబాటులో ఉండటం వల్ల అందరికీ సులభంగా యాక్సెస్‌ చేయడానికి వీలవుతుంది. అయితే, వీటి ఇంటర్‌ఫేస్, కంటెంట్‌ నాణ్యతను మరింత మెరుగుపరిస్తే, వినియోగదారుల అనుభవం మరింత పెరుగుతుంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version