Speed of Light: ప్రపంచంలో మనం ఏ వస్తువు అయినా చూడగలగాలి అంటే కాంతి తప్పనిసరిగా అవసరం. కాంతిని సాధారణంగా దృగ్గోచర కాంతి అని అంటారు. విద్యుత్ క్షేత్రం, అయస్కాంత క్షేత్రం రెండింటిలోనూ కంపనం చెందుతూ ఒకదానికొకటి లంబంగా ప్రయాణించే తరంగం. ఇది ప్రయాణించడానికి ఎలాంటి యానకం అవసరం లేదు. కాంతి ఎక్కడైనా ప్రయాణించగలదు. కాంతికి ఒక చోట నుంచి విశ్వమంతా వెళ్లగలిగే శక్తి ఉంది. అందుకే ప్రపంచంలో అత్యంత వేగంగా ప్రయాణించగలిగేది లేదంటే కాంతి గురించి మాత్రమే చెప్పుకోవాలి. కాంతి తర్వాత ఏది ప్రయాణించలేదు. అయితే కాంతి ఒక సెకనుకు ఎన్ని కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంది? ఈ లెక్కన చంద్రుడు దగ్గరికి, సూర్యుడి దగ్గరికి వెళ్లడానికి ఎంత సమయం పడుతుంది?
కాంతి దూరం తెలుసుకోవాలంటే కాంతితో సమానంగా ఒక పరికరాన్ని తయారు చేయాలి. అంటే ఒక స్పేస్ షిప్ ను కాంతితో సమానంగా ప్రయాణించగలిగే విధంగా తయారు చేస్తే.. కాంతి ఎంత దూరం? ఎక్కడికి వెళ్తుందో తెలుసుకోవచ్చు అని కొందరు శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు. కళ్ళు మూసుకొని తెరిచే లోగా కాంతి 3 లక్షల కిలోమీటర్ల ప్రయాణం చేస్తుంది. అంటే ఒక సెకనుకు ఈ దూరం అన్నమాట. కాంతితో సమానంగా అంటే సెకండ్ కు మూడు లక్షల కిలోమీటర్ల దూరం వెళ్లే స్పేస్ షిప్ తయారుచేస్తే.. గ్రహాలను చుట్టి రావడానికి ఎంత సమయం పడుతుందో చూద్దాం.
ఒక సెకనుకు కాంతి మూడు లక్షల కిలోమీటర్ల ప్రయాణం చేస్తే.. కాంతి వేగంతో సమానమైన స్పేస్ షిప్ ను ఉపయోగిస్తే భూమి చుట్టూ ఒక సెకనుకు 8 రౌండ్లు తిరుగుతుంది అన్నమాట. భూమి నుంచి చంద్రుడిని చేరుకోవడానికి 1.3 సెకండ్స్ సరిపోతుంది. భూమి నుంచి ఐదున్నర కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న మార్స్ గ్రహాన్ని చేరుకోవడానికి మూడు నిమిషాలు పడుతుంది. సూర్యుడిని చేరుకోవడానికి ఎనిమిది నిమిషాలు పడుతుంది. జూపిటర్ గ్రహాన్ని చేరుకోవడానికి 33 నిమిషాలు పడుతుంది. పాలపుంత నుంచి బయటపడడానికి రెండు లక్షల సంవత్సరాలు పడుతుంది.
ఇలా ఒక స్పేస్ జెట్ ను గనుక తయారు చేస్తే విశ్వమంతా ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది. కానీ అంతటి వేగమైన స్పేస్ జెట్ తయారు అవుతుందా అంటే? చెప్పలేం.కానీ శాస్త్రవేత్తలు ఒకప్పటి కంటే ఇప్పటికీ గ్రహాల మీదకు వెళ్తున్నారు. భూమికి ప్రత్యామ్నాయంగా మరో గ్రహాన్ని సృష్టించబోతున్నారు. ఇలాంటి సమయంలో స్పేస్ జెడ్ పై విశ్వంలో తిరిగే అవకాశం వస్తుందా? చూడాలి మరి.