Tamannaah- Vijay Varma: తమన్నాకు పెళ్ళీడు వచ్చి చాలా కాలం అవుతుంది. చిత్ర పరిశ్రమలో ఆమె లాంగ్ కెరీర్ అనుభవిస్తున్నారు. ఆమెతో పాటు వచ్చిన హీరోయిన్స్ ఎప్పుడో కనుమరుగై పోయారు. తమన్నా మాత్రం ఇంకా క్రేజీ ఆఫర్స్ పట్టేస్తూ జోరు చూపిస్తున్నారు. ఈ 33 ఏళ్ల బ్యూటీని పెళ్లి ఎప్పుడని అడిగితే దానికి ఇంకా సమయం ఉంది అంటుంది. తమన్నా తోటి హీరోయిన్ కాజల్ చక్కగా పెళ్లి చేసుకొని ఒక అబ్బాయికి తల్లి కూడా అయ్యింది. తమన్నా మాత్రం అప్పుడే పెళ్లేంటి అంటుంది. ఇటీవల ఆమె పెళ్లిపై పలు రూమర్స్ వచ్చాయి. ముంబైకి చెందిన ఒక వ్యాపారవేత్తను తమన్నా వివాహం చేసుకోబోతున్నారంటూ కథనాలు వెలువడ్డాయి.
ఈ వార్తలకు తమన్నా తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. అవును పెళ్లి కుదిరింది. నేను పెళ్లాడే అబ్బాయి ఇతడే అంటూ… ఎఫ్ 3 మూవీలో తాను అబ్బాయి గెటప్ వేసిన ఫోటో షేర్ చేసింది. తమన్నాకు ఆఫర్స్ వస్తున్నప్పటికీ స్టార్ హీరోయిన్ హోదా పోయింది. ఆమె ఫేడ్ అవుట్ దశకు చేరుకుంటున్నారు. తమన్నా వివాహ బంధంలో అడుగుపెట్టేందుకు ఇదే రైట్ టైం అని పలువురు సలహా ఇస్తున్నారు. ఫార్మ్ లో ఉన్న హీరోయిన్స్ కి మంచి సంబంధాలు వస్తాయి. బడా బడా వ్యాపారవేత్తలు క్యూ కడతారు. ఫేడ్ అవుట్ హీరోయిన్ అంటే పెద్దగా డిమాండ్ ఉండదు.
అయితే తమన్నా ఆల్రెడీ రిలేషన్ లో ఉన్నారు. ఆమె ఒకరిని ప్రేమిస్తున్నారంటూ న్యూ ఇయర్ వేళ సరికొత్త న్యూస్ తెరపైకి వచ్చింది. నూతన సంవత్సర వేడుకల్లో తమన్నా నటుడు విజయ్ వర్మతో కనిపించి షాక్ ఇచ్చారు. అసలు తమన్నా పక్కన విజయ్ వర్మ ఎందుకు ఉన్నాడని చిత్ర వర్గాలు షాక్ కి గురవుతున్నారు. అదే సమయంలో తమన్నా-విజయ్ వర్మ రిలేషన్ లో ఉన్నారు. త్వరలో వీరి పెళ్లిపై ప్రకటన రావచ్చనే వాదన బయలు దేరింది. ప్రస్తుతం విజయ్ వర్మ-తమన్నా వ్యవహారం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా ఉంది.
హైదరాబాద్ కి చెందిన విజయ్ వర్మ బాలీవుడ్ లో సెటిల్ అయ్యాడు. ఇతడు మార్వాడి ఫ్యామిలీకి చెందిన వ్యక్తిగా సమాచారం. తెలుగులో విజయ్ వర్మ ఎంసిఏ మూవీలో విలన్ గా నటించారు. నాని-సాయి పల్లవి కాంబోలో విడుదలైన ఎంసిఏ మంచి విజయం సాధించింది. విజయ్ వర్మతో ఎఫైర్ రూమర్స్ నేపథ్యంలో తమన్నా ఎలా స్పందిస్తారో చూడాలి. ప్రస్తుతం తమన్నా తెలుగులో భోళా శంకర్ చేస్తున్నారు. చిరంజీవి హీరోగా దర్శకుడు మెహర్ రమేష్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.
Read More