Yuzvendra Chahalకొన్ని సంవత్సరాలుగా చాహల్, ధన శ్రీ వర్మ ప్రేమలో ఉన్నారు. కరోనా సమయంలో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి జరిగిన కొన్ని సంవత్సరాల వరకు చాహల్ – ధనశ్రీ అన్యోన్యంగా ఉన్నారు. పలు పార్టీలలో కనిపించారు. హిందీలో కొన్ని రియాల్టీ షోలలో ధనశ్రీ వర్మ కనిపించారు. కొన్నింటికి జడ్జిగా కూడా వ్యవహరించారు. ఆమధ్య చాహల్ తో కలిసి కొన్ని షో లలో కూడా పాల్గొన్నారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ వారిద్దరి మధ్య విభేదాలు పెరిగిపోయాయి. ఈ క్రమంలో ఇద్దరు విడిపోయారు. ఇద్దరి మధ్య బేదాభిప్రాయాలు చోటు చేసుకున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో ఒకరిని ఒకరు అన్ ఫాలో చేసుకున్నారు. అప్పుడే తమ విభేదాలపై వారిద్దరు ఒక హింట్ ఇచ్చారు. (హార్దిక్ పాండ్యా – నటాషా కూడా విడిపోయే సమయంలో ఒకరిని ఒకరు సోషల్ మీడియాలో అన్ ఫాలో చేసుకున్నారు) ఆ తర్వాత వారిద్దరూ విడివిడిగా ఉండడం మొదలుపెట్టారు. విడాకుల కోసం బాంద్రా కోర్టును ఆశ్రయించారు. అయితే విడాకుల సమయంలో చాహల్ ధనశ్రీకి భరణంగా 60 కోట్లు ఇచ్చినట్టు వార్తలు వచ్చాయి.

మరో అమ్మాయితో..
ఇక నిన్న దుబాయ్ వేదికగా భారత్ – న్యూజిలాండ్ ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ ఆడాయి. ఈ మ్యాచ్ కోసం చాహల్ దుబాయ్ వెళ్ళాడు .. అతడితోపాటు మహ్వేష్ అనే అమ్మాయి కూడా కనిపించింది. ఆమె ఆర్జేగా పని చేస్తోంది. సోషల్ మీడియాలో ఆమెకు విపరీతమైన పాపులారిటీ ఉంది. ఫ్రాంక్ వీడియోలు చేయడంలో ఆమె దిట్ట. అయితే. మహ్వేష్ తో చాహల్ కనిపించిన నేపథ్యంలో.. ధన శ్రీ వర్మ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది .. ఇన్ స్టా గ్రామ్ లో “మహిళలను కించపరచడం ప్రతి ఒక్కరికి అలవాటుగా మారింది” అని అర్థం వచ్చేలా ఆమె పోస్ట్ చేసింది. అయితే చాహల్ తో విడాకులకు కారణం తనే అని కొన్ని మీడియా సంస్థలు, వెబ్ సైట్లు రాయడంతోనే ధనశ్రీ వర్మ ఇలా పోస్ట్ చేసిందని తెలుస్తోంది.. చాహల్, ధనశ్రీ విడాకులు తీసుకున్న తర్వాత కొన్ని మీడియా సంస్థలు.. ధన శ్రీ వ్యవహార శైలి వల్లే చాహల్ అలాంటి నిర్ణయం తీసుకున్నాడని వార్తలు ప్రసారం చేశాయి. దీనిపై ధనశ్రీ వర్మ నొచ్చుకుంది. వివరణ లేకుండా అలాంటి వార్తలు ఎలా ప్రసారం చేస్తారని మనబడింది. చివరికి చాహల్ వేరే అమ్మాయితో దుబాయ్ లో కనిపించడంతో.. మరుసటి రోజు ధనశ్రీ తన సోషల్ మీడియా ఖాతాలో ఈ పోస్ట్ చేయడం సంచలనంగా మారింది. మొత్తంగా విడాకుల వ్యవహారంలో తన ప్రమేయం ఏమిలేదని.. మొత్తం చాహల్ చేశాడని తన పోస్ట్ ద్వారా చెప్పే ప్రయత్నం ధనశ్రీ చేసింది.