Yuvaraj singh: నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అంటారు. ఇప్పుడు ఆ నోరు అజాగ్రత్తగా వాడి టీమిండియా మాజీ దిగ్గజ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ చిక్కుల్లో పడ్డాడు. ఏకంగా అరెస్ట్ అయ్యాడు. కోర్టు బెయిల్ ఇవ్వడం బట్టి సరిపోయింది. లేదంటే ఊచలు లెక్కబెట్టేవాడే.. అసలు యువరాజ్ సింగ్ చేసిన తప్పు ఏంటంటే టీమిండియా క్రికెటర్ ను కించపరిచేలా అతడి తక్కువ కులంపై వ్యాఖ్యలు చేయడమే? అసలు ఎవరా క్రికెటర్.. యువరాజ్ సింగ్ ఎందుకు తిట్టాడు? ఎందుకు ఈ కేసులో అరెస్ట్ అయ్యాడన్నది ఆసక్తి రేపుతోంది.
గత ఏడాది ఓ మ్యాచ్ సందర్భంగా యువరాజ్ సింగ్ చేసిన ఈ పని అతడిని అరెస్ట్ అయ్యేలా చేసింది. టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మతో సరదాగా నిర్వహించిన ఇంటర్వ్యూలో యువరాజ్ సింగ్ నోరుజారాడు. టీమిండియా స్పిన్నర్ యజువేంద్రచాహల్ పై కామెంట్స్ చేశాడు. చాహల్ షెడ్యూల్ కులాన్ని కించపరిచేలా యువరాజ్ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో పెను దుమారం రేపాయి.
దళితలు కులాన్ని యువరాజ్ కించపరిచాడంటూ ఓ న్యాయవాది హన్సీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో యువరాజ్ పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఈ కేసులోనే తాజాగా యువరాజ్ సింగ్ అరెస్ట్ అయ్యాడు. కోర్టులో ప్రవేశపెట్టగా.. అతడికి వెంటనే బెయిల్ మంజూరైంది. లేకుంటే జైలు పాలయ్యేవాడే.
అనంతరం సోషల్ మీడియాలో తన వ్యాఖ్యలపై యువరాజ్ సింగ్ స్పందించాడు. తన స్నేహితులతో సరదాగా ఆ వ్యాఖ్యలు చేశానని.. అయినా వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేస్తున్నానని తెలిపాడు. చాహల్ ను కించపరచాలనేది తన ఉద్దేశం కాదని యువరాజ్ పేర్కొన్నాడు. దీంతో ఈ పెద్ద వివాదం కాస్త సమసిపోయింది.
ఇలా సరదాగాకు చాహల్ పై కామెంట్ చేసినా కూడా అతడు దళితుడు కావడంతో వారి మనోభావాలు దెబ్బతిని యువరాజ్ సింగ్ అరెస్ట్ వరకూ వెళ్లింది. చాహల్ దీన్ని పట్టించుకోకున్నా అతడి సామాజికవర్గం వారు మాత్రం భగ్గుమన్నారు. ఫిర్యాదులు చేశారు. అందుకే ఆ వర్గం వారిపై కామెంట్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని యువరాజ్ ఉదంతంతో అందరికీ అర్థమవుతోంది.