WTC Prize Money 2025: టెస్ట్ క్రికెట్ అంటే చాలామందికి బోరింగ్ లాగా ఉంటుంది. సుదీర్ఘంగా సాగే ఫార్మాట్ వారిని ఇబ్బంది పెడుతుంది. వన్డే లాగా.. టి20 లాగా ఇందులో దూకుడుకు అవకాశం ఉండదు. మెరుపులకు ఆస్కారం ఉండదు. మ్యాజిక్ చేయడానికి అరుదుగా మాత్రమే చోటు లభిస్తుంది. అందువల్లే చాలామంది టెస్ట్ క్రికెట్ చూసేందుకు అంతగా ఆసక్తి చూపించరు. అయితే టెస్ట్ క్రికెట్ ప్రభ మసకబారుతున్న నేపథ్యంలో దానికి సరికొత్త రంగు తగ్గడానికి ఐసీసీ తెరపైకి డబ్ల్యూటీసీ ని తీసుకువచ్చింది. ఇందులో భాగంగానే గత రెండు సీజన్లుగా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ నిర్వహించింది. దురదృష్టవశాత్తు ఈ ఫైనల్ లోకి రెండు సార్లు కూడా టీమ్ ఇండియా వెళ్లినప్పటికీ.. విజేతగా మాత్రం ఆవిర్భవించలేకపోయింది. దీంతో ముచ్చటగా మూడోసారి ఫైనల్ వెళ్లాలని అనుకున్నప్పటికీ.. న్యూజిలాండ్ రూపంలో మొదటి ప్రతిఘటన.. ఆస్ట్రేలియా రూపంలో రెండవ ప్రతిఘటన ఎదురు కావడంతో.. టీమిండియా ఇంటి దారి పట్టక తప్పలేదు. అయితే ఈసారి అనూహ్యంగా సఫారి జట్టు డబ్ల్యూటీసీ ఫైనల్స్ వెళ్ళింది. కంగారుల వల్ల.. రోహిత్ సేన వల్ల కాని రికార్డులను సాధించి .. ముందుగానే తన బెర్త్ కన్ఫామ్ చేసుకుంది. ఇక అంతటి బలమైన ఆస్ట్రేలియా రెండవ స్థానంలో డబ్ల్యూటీసీలోకి వెళ్ళింది. ఈ రెండు జట్లు ఇంగ్లాండ్ వేదికగా నిర్వహించే ఫైనల్ మ్యాచ్లో తలపడతాయి. ఈ ఫైనల్ మ్యాచ్ వచ్చే నెలలో జరుగుతుంది.
Also Read: ‘ఆపరేషన్ సిందూర్’.. రాఖైన్‌లో అమెరికా వ్యూహం, భారత్‌పై ప్రభావం
ప్రైజ్ మనీ పెంచేసింది
ముందుగానే మనం చెప్పినట్టు టెస్ట్ క్రికెట్ కు సరికొత్త కలరింగ్ ఇవ్వడానికి ఐసీసీ అనేక ప్రయత్నాలు చేసింది. ఇందులో భాగంగానే డబ్ల్యూటీసీ తెరపైకి తీసుకువచ్చింది. అంతేకాదు ఆటగాళ్లలో క్రీడా స్ఫూర్తిని పెంచడానికి..టెస్ట్ క్రికెట్ మీద ఇష్టాన్ని పెంచుకోవడానికి అనేక కసరత్తులు చేసింది. ఐసీసీ చైర్మన్ గా జై షా వచ్చిన తర్వాత.. టెస్ట్ క్రికెట్ సరికొత్త పుంతలు తొక్కుతోంది. అంతేకాదు జై షా నిర్ణయం మేరకు ఐసీసీ టెస్ట్ ఛాంపియన్ షిప్ ప్రైజ్ మనీ భారీగా పెరిగింది. ఫైనల్స్ లో విజేతకు ఏకంగా 30.81 కోట్ల ప్రైజ్ మనీ ఇవ్వనున్నారు. రన్న రప్ జట్టుకు 17.97 కోట్లు అందిస్తారు. గతంలో విజేతకు 13.23 కోట్ల ప్రైజ్ మనీ ఉండేది. రన్నరప్ కు 6.61 కోట్ల బహుమానం లభించే.. ఇక జూన్ 11 నుంచి లండన్ లోని లార్డ్స్ మైదానంలో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ నిర్వహిస్తారు. ఈ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా హోరాహోరీగా పోరాడే అవకాశం ఉంది. గత సీజన్లో ఆస్ట్రేలియా విజేతగా నిలిచింది. ఈ సీజన్ లో కూడా విజేతగా నిలవాలని భావిస్తోంది. మరోవైపు తొలిసారిగా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ లోకి అడుగుపెట్టిన దక్షిణాఫ్రికా.. విజేతగా ఆవిర్భవించాలని భావిస్తోంది. మొత్తంగా ఈ రెండు జట్లు ట్రోఫీ కోసం వీరోచితంగా పోరాడుతాయనడంలో ఎటువంటి సందేహం లేదు.