
ప్రపంచ టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్ కు రంగం సిద్ధమైంది. టాప్ 1, 2 టీంలుగా నిలిచి ప్రపంచ టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్ కు భారత్, న్యూజిలాండ్ జట్లు చేరుకున్నారు. ఇంగ్లండ్ లోని సౌథాంప్టన్ లో ఈ రెండు జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ ఈనెల 18 (రేపు) మధ్యాహ్నం 3.30 గంటల నుంచి ప్రారంభం కానుంది.
ఈ ప్రతిష్టాత్మక ఫైనల్ మ్యాచ్ లో బరిలోకి దిగే 11 మంది సభ్యుల టీమిండియా జట్టును బీసీసీఐ ప్రకటించింది. విరాట్ కోహ్లీ కెప్టెన్ కాగా.. అజింక్యా రహానే వైస్ కెప్టెన్ గా వ్యవహరించనున్నారు.
ఈ టీంలో ఏకంగా ఆరుగురు బ్యాట్స్ మెన్, ముగ్గురు ఫాస్ట్ బౌలర్లు, ఇద్దరు స్పిన్నర్లతో భారత్ బరిలోకి దిగుతోంది. స్పిన్నర్లు సీనియర్లు అయిన అశ్విన్, రవీంద్ర జడేజా ఇద్దరినీ టీంలోకి తీసుకోవడం విశేషం. వీరిద్దరూ బ్యాటింగ్ కూడా చేస్తారు కాబట్టి టీం మేనేజ్ మెంట్ ఫాస్ట్ బౌలర్ కు బదులుగా స్పిన్నర్లను ఎంపిక చేసింది.
కివీస్ తో ఫైనల్ కు టీమిండియా జట్టు ఇదే..
విరాట్ (కెప్టెన్)
అజింక్యా రహానే (వైఎస్ కెప్టెన్)
రోహిత్ శర్మ
శుభ్ మన్ గిల్
పూజారా
రిషబ్ పంత్ (వికెట్ కిపర్)
రవీంద్ర జడేజా,
అశ్విన్,
బుమ్రా,
ఇషాంత్ శర్మ
మహ్మద్ షమీ
🚨 NEWS 🚨
Here's #TeamIndia's Playing XI for the #WTC21 Final 💪 👇 pic.twitter.com/DiOBAzf88h
— BCCI (@BCCI) June 17, 2021