Homeక్రీడలుUmran Malik: టీమిండియా స్పీడ్ గన్.. ఐపీఎల్ లో తేలిపోయింది..! టీమిండియాలో చోటు కష్టమే..!

Umran Malik: టీమిండియా స్పీడ్ గన్.. ఐపీఎల్ లో తేలిపోయింది..! టీమిండియాలో చోటు కష్టమే..!

Umran Malik: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ ఎడిషన్ లో టీమిండియా జట్టులో సూపర్ స్టార్లుగా ఎదిగిన ఎంతో మంది తేలిపోయారు. 2021 ఐపిఎల్ లో పేస్ సంచలనంతో పరిచయమైన ఉమ్రాన్ మాలిక్ ఈ ఏడాది మాత్రం అట్టర్ ప్లాప్ అయ్యాడు. హైదరాబాద్ జట్టు తరఫున ఆడిన ఈ ఆటగాడు ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయాడు.

క్రికెట్ లో బౌలర్ గా రాణించడం అంత ఆషామాషీ వ్యవహారం కాదు. బౌలింగ్ లో వేరియేషన్స్ చూపిస్తేనే ప్రస్తుత క్రికెట్ లో బౌలర్లు నిలదొక్కుకుంటారు. వేరియేషన్స్ లేకపోతే బ్యాటర్లకు ఇట్టే అర్థం అయిపోయి ధారాళంగా పరుగులు సమర్పించుకుంటారు. ప్రస్తుతం క్రికెట్ లో ఉన్న నిబంధనలు బ్యాటర్స్ కు అనుకూలించేలా ఉన్నాయి. ఇక టి20 ఫార్మాట్ లో బౌలింగ్ చేయాలంటే ఏ బౌలర్ కైనా దడ పుడుతుంది. అయితే, కొందరు బౌలర్లు వైవిధ్యమైన బంతులతో ప్రత్యర్థులను కట్టడి చేస్తుంటారు. అయితే, ఉమ్రాన్ మాలిక్ ఆ స్థాయిలో వైవిద్యం లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు.

టాక్ ఆఫ్ ద లీగ్ గా మారిన బౌలర్..

ఉమ్రాన్ మాలిక్ గంటకు 150 కిలో మీటర్ల వేగంతో బౌలింగ్ చేయడంతో అతడి టాక్ ఆఫ్ ద టౌన్ గా మారిపోయాడు. 2021లో తక్కువ మ్యాచ్ లే ఆడినా అందరిని తన వైపునకు తిప్పుకున్నాడు. ఇక 2022లో మరోసారి ఐపీఎల్ లో టాక్ ఆఫ్ ద లీగ్ గా మారిపోయాడు. భారత బౌలర్లలో 150 లేదా అంతకంటే ఎక్కువ వేగంతో బౌలింగ్ చేసే పేసర్లు చాలా తక్కువగా కనిపిస్తారు. అయితే, ఉమ్రాన్ మాత్రం క్రమం తప్పకుండా గంటకు 150 కిలో మీటర్లు వేగంతో బౌలింగ్ చేయడంతో అతడిని వెంటనే టీమిండియాకు ఎంపిక చేశారు. అప్పట్లో అతడిపై ప్రశంసల వర్షం కురిసింది.

ఇండియా తరఫున తేలిపోయిన మాలిక్..

అయితే, ఇమ్రాన్ మాలిక్ మాత్రం టీమ్ ఇండియా తరఫున తేలిపోయాడు. ఇక ఈ తాజా సీజన్లోనూ పేలవ ప్రదర్శన చేశాడు. ఈ ఏడాది ఐపీఎల్ లో 8 మ్యాచులు ఆడిన అతడు కేవలం 5 వికెట్లు మాత్రమే తీశాడు. 10.85 ఎకానమీతో పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో హైదరాబాద్ జట్టు అతడిని పక్కన పెట్టేసింది. ఉమ్రాన్ బౌలింగ్ లో ఏమాత్రం వేరియేషన్స్ లేకపోవడం అతడికి అతిపెద్ద ప్రతికూలతగా మారింది. ప్రతి బంతిని కూడా 150 కిలో మీటర్ల వేగంతో వేస్తున్నాడే తప్పా వేరియేషన్స్ చూపించడం లేదు. బ్యాటర్లు అతడు పేస్ ను ఉపయోగిస్తూ పరుగులు రాబడుతున్నారు. ఫలితంగా వేగం ఉన్న అతడి బౌలింగ్ వల్ల జట్టుకు ఉపయోగం కంటే నష్టమే ఎక్కువగా జరుగుతోంది.

ఇక టీమిండియా కు ఎంపిక అయ్యేది కష్టమే..

ఉమ్రాన్ మాలిక్ ఇదే రీతిలో బౌలింగ్ చేస్తే అతడి టీమిండియా కు ఎంపిక అయ్యేది కష్టమే. వేగంతోపాటు స్వింగ్, స్లో బాల్స్ వేయడంపై ఇమ్రాన్ మరింత శ్రద్ధ పెట్టాల్సి ఉంది. లేదంటే మరో షాన్ టైట్ మాదిరి మిగిలిపోయే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వేగాన్ని నమ్ముకుని ఎక్కువకాలం బౌలర్ గా కొనసాగే అవకాశం ఉండదని నిపుణులు చెబుతున్నారు. స్వింగ్, స్లో బంతులు వేయడంతోపాటు బ్యాటర్ ఉన్న పరిస్థితికి అనుగుణంగా బౌలింగ్ చేసి పరుగులు కట్టడి చేయాలి. అప్పుడే బౌలర్లకు భవిష్యత్ ఉంటుంది. ఆ దిశగా ఉమ్రాన్ మాలిక్ కృషి చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular