WTC Final 12.38 crore penalty : బుధవారం నుంచి డబ్ల్యూటీసీ చివరి అంచె పోటీ మొదలవుతుంది. కమిన్స్, బవుమా జట్ల మధ్య టెస్ట్ గదకోసం పోటీ జరుగుతుంది. ఎలాగైనా సరే విజయం సాధించాలని బవుమా జట్టు.. రెండోసారి కూడా టెస్ట్ గద అందుకోవాలని కమిన్స్ జట్టు కృత నిశ్చయంతో ఉన్నాయి. ఇప్పటికే రెండు జట్లు తమ ప్లేయర్ల వివరాలను ప్రకటించాయి. గత కొద్దిరోజులుగా ముమ్మరంగా సాధన కూడా చేస్తున్నాయి. అటు కంగారు, ఇటు సఫారీ జట్లు నువ్వా నేనా అన్నట్టుగా పోటీపడేందుకు సిద్ధంగా ఉన్నాయి. అయితే మరికొద్ది గంటలో మ్యాచ్ మొదలవుతుంది అనుకుంటున్న తరుణంలో.. రెండు జట్లను ఒక కామన్ పాయింట్ ఇబ్బందికి గురిచేస్తోంది. అదే జరిమానా వ్యవహారం..
మామూలుగా అయితే క్రికెట్ మ్యాచ్ లు జరుగుతున్నప్పుడు స్లో ఓవర్ రేటు వల్ల నిర్వాహకులు ఆటగాళ్లకు జరిమానా విధిస్తారు.. కానీ డబ్ల్యూటీసీలో జరిమానా అనే పదం లేదు. అయితే ఇందులో విధించే జరిమానాకు ప్రత్యేకమైన పరిస్థితి ఉంటుంది. ప్రత్యేకమైన పరిస్థితి ఎదురైనప్పుడు మాత్రమే జరిమానా విధిస్తుంటారు. డబ్ల్యూటీసీ విన్నర్ కు ఇచ్చే క్యాష్ ఫ్రైజ్ ను 3.6 మిలియన్ డాలర్లకు ఐసీసీ పెంచింది. సెకండ్ టీం కు 2.16 మిలియన్ల శ్వేత దేశం కరెన్సీ అందిస్తుంది.. అయితే ప్రైజ్ మనీ భారీగా పెంచిన నేపథ్యంలో జరిమానా అనే అంశం సరికొత్తగా కనిపిస్తోంది. ఇక చాంపియన్ తో పోల్చి చూస్తే ద్వితీయ స్థానంలో నిలిచిన జట్టు 1.44 మిలియన్ల శ్వేత దేశం కరెన్సీ దక్కుతుంది. అంటే భారతీయ కరెన్సీతో పోల్చి చూస్తే అది 12.38 కోట్లు మాత్రమే. అంటే ఈ లెక్కన 12.38 కోట్లను ఓడిపోయిన జట్టు.. గెలిచిన జట్టుకు చెల్లించాల్సిన జరిమానా అని పేర్కొంటున్నారు. అయితే అధికారికంగా నిర్మాణ కాదు. ఛాంపియన్ టీం కు దక్కే భారీ ప్రైజ్ మనీ మొత్తంతో పరిశీలిస్తే.. ద్వితీయ స్థానంలో లభించే జట్టుకు తక్కువ మొత్తంలో లభిస్తుంది. దీని ప్రకారం అది ఒక రకంగా నష్టమే అని చెప్పవచ్చు.
Also Read : వాళ్లకు చోటు.. WTC ఫైనల్ లో దక్షిణాఫ్రికా తో తలపడే ఆస్ట్రేలియా జట్టు ఇదే..
ఐసీసీ భారీగా నగదు బహుమతిని పెంచిన నేపథ్యంలో.. ఎలాగైనా సరే ఆ మొత్తాన్ని దక్కించుకోవడానికి అటు సఫారీ, ఇటు కంగారు జట్లు పోటీ పడుతున్నాయి. ఏ జట్టు కూడా ద్వితీయ స్థానంలో ఉండడానికి ఇష్టపడటం లేదు. మొత్తంగా చూస్తే డబ్ల్యూటీసీ లో రెండు జట్లూ అద్భుతమైన ప్రదర్శన ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇక ప్రస్తుత డబ్ల్యూటీసీ ఫైనల్ లో ప్రవేశించిన సఫారి జట్టుకు.. ఇదే తొలి ఫైనల్ కావడం విశేషం. అంతేకాదు సఫారి జట్టు గడచిన 25 సంవత్సరాలుగా ఐసీసీ నిర్వహించిన ఏ ట్రోఫీని కూడా అందుకోలేకపోయింది. మొత్తంగా చూస్తే సఫారి చెట్టుకు ఇది అత్యంత కీలకమైన మ్యాచ్. కంగారుల మీద గెలిచి తొలిసారిగా ఐసీసీ ట్రోఫీ అందుకోవాలని సఫారీ జట్టు భావిస్తుంది. అంతేకాదు ఇందులో గెలిస్తే ఒక తరానికి ఆదర్శంగా ఉంటామని సఫారీ జట్టు ప్లేయర్లు భావిస్తున్నారు.. ఇక సఫారీ, కంగారు జట్ల ప్రస్తావన కాస్త పక్కన పెడితే.. ఇక ప్రస్తుత సీజన్లో మూడో స్థానంలో ఉన్న భారత జట్టుకు 1.44 డాలర్లు.. మన కరెన్సీలో 12.32 కోట్లు లభిస్తాయి. ఇక నాలుగో స్థానంలో ఉన్న కివీస్ జట్టుకు 1.20 మిలియన్ డాలర్లు, ఐదో స్థానంలో ఉన్న ఇంగ్లాండ్ 960,000 డాలర్లు, శ్రీలంకకు 840,000 డాలర్లు, బంగ్లాదేశ్ కు 720,000 డాలర్లు, వెస్టిండీస్ కు 6000,000 డాలర్లు, పాకిస్తాన్ కు 480,000 డాలర్లు లభిస్తాయి.