https://oktelugu.com/

WPL Final Match: ఢిల్లీ వర్సెస్ బెంగళూరు.. ఎవరిదో ట్రోఫీ

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (women's premier league) రెండవ సీజన్ ఫైనల్ పోరు దాకా వచ్చేసింది. ఆదివారం ఢిల్లీ వేదికగా జరిగే ఫైనల్ మ్యాచ్ లో ఢిల్లీ, బెంగళూరు జట్లు తలపడనున్నాయి.

Written By: , Updated On : March 17, 2024 / 08:22 AM IST
WPL Final Match

WPL Final Match

Follow us on

WPL Final Match: అందరి అంచనాలను తారు మారు చేస్తూ ఫైనల్ చేరుకున్న జట్టు ఒకవైపు.. మొదటి సీజన్ లో వెంట్రుకవాసిలో ట్రోఫీని కోల్పోయి.. రెండవ సీజన్లో ఫైనల్ చేరిన జట్టు ఒకవైపు.. ఈ రెండు జట్లలో ఎవరు గెలిచినా చరిత్రే. ఆ చరిత్రకు ఆదివారం ఢిల్లీ వేదిక కానుంది.

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (women’s premier league) రెండవ సీజన్ ఫైనల్ పోరు దాకా వచ్చేసింది. ఆదివారం ఢిల్లీ వేదికగా జరిగే ఫైనల్ మ్యాచ్ లో ఢిల్లీ, బెంగళూరు జట్లు తలపడనున్నాయి. గత సీజన్లో ఢిల్లీ జట్టు ఫైనల్ దాకా వచ్చినప్పటికీ.. ముంబై చేతిలో ఓడిపోయింది. ఆ మ్యాచ్ లో ఢిల్లీ జట్టు 131 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని ముంబై జట్టు 19.5 ఓవర్లలో సాధించి తొలి సీజన్ లో విజేతగా నిలిచింది. గత ఫైనల్ లో చేసిన తప్పును పునరావృతం చేయకుండా ఉండేందుకు ఢిల్లీ జట్టు తీవ్రంగా కసరత్తు చేస్తోంది. మెక్ లానింగ్ సారధ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఈ సీజన్లో అత్యంత నిలకడైన ప్రదర్శన చేసింది. లీగ్ మ్యాచ్ లలో ఆరు మ్యాచ్ లలో విజయం సాధించింది. మొత్తం 12 పాయింట్లతో టేబుల్ టాపర్ గా నేరుగా ఫైనల్ వెళ్ళింది. లానింగ్ జట్టును ముందుండి నడిపిస్తోంది. ఆల్ రౌండర్లు మరి జానె కాప్, జొనాసెన్, క్యాప్సీ కీలక సమయాల్లో ఆదుకుంటున్నారు. ఓపెనర్ షఫాలీ వర్మ దూకుడుగా ఆడుతోంది. జెమీమా రోడ్రిగ్స్ జట్టుకు ఆపద్బాంధవురాలిగా మారింది. ఈ మైదానం స్పిన్నర్లకు సహకరించే అవకాశం ఉందని క్యూరేటర్ చెప్తున్నారు. ఒకవేళ అదే నిజమైతే రాధా యాదవ్, క్యాప్సి, జొనాసెన్ పై ఎక్కువ భారం పడే అవకాశం ఉంది.

మరోవైపు బెంగళూరు జట్టు ఈ సీజన్ లో అభిమానులు ఆశించినట్టుగానే ఫైనల్ చేరింది. ఆ జట్టు ఎలిమినేటర్ మ్యాచ్లో ముంబై పై పోరాడిన తీరు అద్భుతం. ఒకానొక దశలో ఆ స్వల్ప స్కోర్ బెంగళూరు కాపాడుకుంటుందా అనే అనుమానాలు అభిమానుల్లో వ్యక్తం అయ్యాయి. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ బెంగళూరు జట్టు ఫైనల్ చేరింది. దీంతో “ఈసాలా కప్ నమదే” అని బెంగళూరు అభిమానులు సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు. బెంగళూరు జట్టులో ఫెర్రీ అద్భుతమైన ఫామ్ లో ఉంది. అయితే ఇప్పటివరకు బెంగళూరు జట్టు కెప్టెన్ స్మృతి ఆమె స్థాయికి తగ్గట్టుగా ఇన్నింగ్స్ ఆడలేదు. ఫైనల్ లో ఆమె నుంచి బెంగళూరు జట్టు భారీ ఇన్నింగ్స్ ఆశిస్తోంది. సోఫీ డివైన్, రిచా, మోలి నెక్స్ ఫామ్ ను దొరకబుచ్చుకోవాల్సి ఉంది. రేణుక, శ్రేయాంక, వేర్ హమ్ పై బెంగళూరు జట్టు భారీ ఆశలు పెట్టుకుంది..

స్థూలంగా చూస్తే అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ లో ఢిల్లీ జట్టు మెరుగ్గా కనిపిస్తున్నప్పటికీ.. ముంబై తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ లో ఢిల్లీ ఆడిన తీరు చూస్తే ఫైనల్ పోరు రసవత్తరంగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రెండు ఫ్రాంచైజీలకు సంబంధించిన పురుష జట్లు ఒక్కసారి కూడా ఐపీఎల్ ట్రోఫీ దక్కించుకోలేదు.. కానీ, రెండింటిలో ఏదో ఒక ఫ్రాంచైజీ కప్ సాధిస్తే ఒక జట్టు కలయితే నెరవేరుతుంది. ఈ ఫైనల్ మ్యాచ్ కోసం ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ నిర్వాహకులు కనివిని ఎరుగని స్థాయిలో ఏర్పాటు చేశారు.