Capitals vs Royal challengers : స్మృతి మందానని కొనుక్కుంది. పేరున్న ఆటగాళ్లను జట్టులోకి తీసుకుంది. అయినా ఏం మారలేదు.. ఒకటి కాదు రెండు కాదు వరుసగా ఐదు మ్యాచ్ల్లో ఓటమిపాలైంది.. ఐపీఎల్ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో బెంగళూరు జట్టు గురించి ప్రస్తావన వచ్చినప్పుడు ఇలానే చెప్పాలేమో. సోమవారం ఢిల్లీ క్యాపిటల్స్ లో జరిగిన మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆరు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఇది ఆ జట్టుకు వరుసగా ఐదవ పరాజయం. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది.
కెప్టెన్ స్మృతి మందాన (8) విఫలమైనప్పటికీ.. ఎల్లిస్ ఫెర్రీ ( 52 బంతుల్లో నాలుగు ఫోర్లు, 5 సిక్స్ లతో 67 నాట్ అవుట్) హాఫ్ సెంచరీ తో రాణించింది. రిచా ఘోష్ (16 బంతుల్లో మూడు ఫోర్లు, మూడు సిక్స్ లతో37) తో కలిసి చెర్రీ నాలుగో వికెట్ కు 74 పరుగుల భాగస్వామ్యాన్ని అందించింది. ఢిల్లీ బౌలర్లలో షికా పాండే 3 వికెట్లు తీసింది. సారా నొర్రీస్ ఒక వికెట్ తీసింది.
అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ 19.4 ఓవర్లలో 4 వికెట్లకు 154 పరుగులు చేసి విజయం సాధించింది. కేప్(32 బంతుల్లో మూడు ఫోర్లు, ఒక సిక్సర్ సహాయంతో 32) జెస్ జోనస్సన్ (15 బంతుల్లో నాలుగు ఫోర్లు, ఒక శిక్ష సహాయంతో 29) చివరి వరకు క్రీజులో నిలబడి విజయాన్ని అందించారు. అల్ ఇస్ కాప్సి (38), జమీమా రోడ్రిగ్స్ (32) రాణించారు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బౌలర్లలో మేఘన్ స్కట్, ప్రీతిబోస్ చెరొక వికెట్ తీశారు. శోభన ఆశ రెండు వికెట్లు తీసింది.
150 పరుగుల లక్ష్యంతో బండ్లకు దిగిన ఢిల్లీకి తోలి ఓవర్ లోనే షాక్ తగిలింది. మేఘన్ బౌలింగ్ లో సఫాలీ వర్మ క్లీన్ బౌల్డ్ అయింది. అనంతరం క్రీజులోకి వచ్చిన అలీస్ క్యాప్సి బౌండరీలతో విరుచుకుపడింది. ధాటిగా ఆడిన అలిస్ ను ప్రతి బోస్ క్యాచ్ అవుట్ గా ఫెవిలియన్ చేర్చింది. దీంతో ఢిల్లీ పవర్ ప్లే లోనే రెండు వికెట్లకు 52 పరుగులు చేసింది. అనంతరం కెప్టెన్ మెగ్ లానింగ్(15)ను శోభన క్యాచ్ అవుట్ చేసింది. ఆ వెంటనే క్రీజులో సెట్ అయిన జమీమా రోడ్రిగ్స్ (32) కూడా కావడంతో మ్యాచ్ ఉత్కంఠ గా మారింది. చివరి 18 బంతుల్లో ఢిల్లీ విజయానికి 24 పరుగులు అవసరం కాగా..కాప్ భారీ సిక్సర్ కొట్టి ఒత్తిడి తగ్గించింది.19 ఓవర్ లో కేప్ ఒక్క బౌండరీ మాత్రమే కొట్టడంతో చివరి ఓవర్లో ఢిల్లీ గెలుపునకు 9 పరుగులు అవసరమయ్యాయి. రేణుక సింగ్ వేసిన చివరి ఓవర్లో జొనాసెన్ 6,4 కొట్టి జట్టుకు విజయాన్ని అందించింది. దీంతో బెంగళూరు వరుసగా ఐదో ఓటమిని మూటగట్టుకుంది.
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Wpl 2023 match today capitals vs royal challengers live score dc vs rcb women ipl
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com