Ind vs Pak: ప్రపంచకప్ టీ20 సమరం మొదలైంది. తొట్టతొలి మ్యాచ్ ఆస్ట్రేలియా వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య మొదలైంది. ఇక రేపు ఈ దశాబ్ధపు అత్యుత్తమ మ్యాచ్ లలో ఒకటైన భారత్, పాకిస్తాన్ హై ఓల్టేజ్ సమరానికి రంగం సిద్ధమైంది.

దాదాపు 5 ఏళ్ల తర్వాత ఈ టీ20 వరల్డ్ కప్ జరుగుతోంది. పొట్టి క్రికెట్ మజాను పంచుతూ ఈసారి కరోనా కారణంగా వాయిదా పడిన ఈ టోర్నీ భారత్ లో జరగాల్సింది.. కానీ వైరస్ తీవ్రతతో యూఏఈకి షిఫ్ట్ అయ్యింది. యూఏఈలో నేటి నుంచి ప్రారంభమైంది. టీ20 ప్రపంచకప్ లో అసలు సమరానికి రంగం సిద్ధమైంది. నేటి నుంచి సూపర్ 12 మ్యాచ్ లు ప్రారంభం కానున్నాయి. శనివారం గ్రూప్ 1లో తొలి మ్యాచ్ లో ఆస్ట్రేలియాతో దక్షిణాఫ్రికా.. రెండో మ్యాచ్ లో డిఫెడింగ్ ఛాంపియన్ వెస్టిండీస్ తో ఇంగ్లండ్ తలపడనుంది.
ఇక చిరకాల ప్రత్యర్థులు భారత్-పాక్ మధ్య మ్యాచ్ ఆదివారం రాత్రి జరుగనుంది. ఈ మ్యాచ్ కోసం ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇక భారత్ తో సమరానికి పాకిస్తాన్ జట్టు 12 మందితో తుదిజట్టును ప్రకటించి సంచలనం సృష్టించింది. ఇక భారత్ కూడా దాదాపుగా ప్లేయింగ్ 11ను సిద్ధం చేసింది.
– పాకిస్తాన్ జట్టు ఇదే:
బాబర్ అజమ్ (కెప్టెన్) , ఆసిఫ్ అలీ, ఫకార్ జమాన్, హైదర్ అలీ, రిజ్వాన్,వసీమ్, హఫీజ్, షాదాబ్ ఖాన్, షోయాబ్ మాలిక్, హరిస్, హసన్ అలీ, షాహెన్ షా ఆఫ్రిది,
-భారత జట్టు ఇదే
కోహ్లీ (కెప్టెన్) , రోహిత్, కేఎల్ రాహల్ , సూర్యకుమార్, పంత్ (కీపర్), హార్దిక్, అశ్విన్/వరుణ్ చక్రవర్తి, బుమ్రా, షమీ, జడేజా, శార్దుల్ ఠాకూర్