Odi World Cup 2023: వరల్డ్ కప్ లో భాగంగా ప్రస్తుతం నాలుగు జట్ల మధ్య రెండు భీకర సెమీ ఫైనల్ మ్యాచ్ లు జరగనున్నాయి…ఇక అందులో భాగంగా ఇండియా, న్యూజిలాండ్ టీమ్ లా మధ్య మొదటి సెమీ ఫైనల్ మ్యాచ్ అనేది జరగనుంది. ఇక వాంఖడే వేదిక గా ఈ బుధవారం రోజున ఈ రెండు టీమ్ లా మధ్య ఒక భీకర పోరు జరగబోతుంది.ఇక దాని కోసమే ప్రపంచం మొత్తం చాలా ఆసక్తి కరంగా ఎదురు చూస్తుంది…ఎందుకంటే రెండు టీం లు కూడా గత సంవత్సరం ఇదే పొజిషన్ లో తలపడి చివరి వరకు ఒక ఉత్కంఠ ను రేకెత్తించే మ్యాచ్ అడటమే కాకుండా అభిమానులకు ఒక సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా చూసినంత ఇంపాక్ట్ ని ఆ మ్యాచ్ ఇవ్వడం జరిగింది. ఇక ఎప్పుడైతే చివర్లో ధోని రన్ అవుట్ అయ్యాడో ఇక అప్పుడే ఇండియా మ్యాచ్ ఓడిపోవడం జరిగింది.
ఇక ఇదే తరహాలో ఇప్పుడు కూడా ఈ రెండు టీమ్ లా మధ్య అలాంటి ఉత్కంఠ ని కలిగించే మ్యాచ్ రిపీట్ అవ్వబోతుందని తెలుస్తుంది. మొదటి సమీఫైనల్ మ్యాచ్ ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఆడుతుండటం వల్ల ఈ పిచ్ ఎక్కువ గా బ్యాటింగ్ కి అనుకూలిస్తుంది అనే విషయం అయితే చాలా స్పష్టం గా తెలుస్తుంది. ఇక ఈ టోర్నీ లో ఇంతకుముందు ఆడిన కొన్ని మ్యాచ్ లను మనం ఒకసారి చూసుకున్నట్లయితే…
ఈ టోర్నీ లో ఇక్కడ సౌతాఫ్రికా టీం రెండు మ్యాచ్ లను ఆడింది. మొదట ఇంగ్లాండ్ పైన ఆడిన మ్యాచ్ లో సౌతాఫ్రికా మొదట బ్యాటింగ్ చేసి నిర్ణీత 50 ఓవర్లకు 7 వికెట్లను కోల్పోయి 399 పరుగులు చేసింది…ఇక అనంతరం బ్యాటింగ్ కు వచ్చిన ఇంగ్లాండ్ టీమ్ ని తక్కువ స్కోరుకే ఔట్ చేసి సౌతాఫ్రికా ఈ మ్యాచ్ లో భారీ విజయాన్ని అందుకుంది. ఇక రెండో మ్యాచ్ బంగ్లాదేశ్ పైన సౌతాఫ్రికా ఆడిన మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా టీమ్ నిర్ణీత 50 ఓవర్లకి ఐదు వికెట్లు కోల్పోయి 382 పరుగులు చేసింది. అనంతరం బంగ్లాదేశ్ టీం బ్యాటింగ్ కి వచ్చిన కూడా సౌతాఫ్రికా బౌలర్ల ముందు చతికిల పడిపోయింది…
ఇక ఇండియన్ టీమ్ కూడా శ్రీలంక మీద ఆడిన మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసి నిర్ణీత 50 ఓవర్లకి 8 వికెట్లు కోల్పోయి 357 పరుగులు చేసింది. ఇక అనంతరం ఇండియన్ టీమ్ శ్రీలంక ని 55 పరుగులకే అలౌట్ చేసింది. ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్ లో మొదట అఫ్గాన్ టీమ్ 291 పరుగులు చేసింది… ఇక ఈ మ్యాచ్ లో 91 పరుగులకే 7 వికెట్లను కోల్పోయిన ఆస్ట్రేలియా టీమ్ మొదట ఓడిపోయేలా కనిపించినప్పటికీ మాక్స్ వెల్ మాత్రం ఒక వండర్ ని క్రియేట్ చేసి డబుల్ సెంచరీ చేసి ఆస్ట్రేలియా కి అద్భుతమైన విజయాన్ని అందించాడు.అయితే ఈ పిచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన టీమ్ లు ఎక్కువగా మ్యాచ్ గెలుస్తున్నాయి కాబట్టి సెమీస్ మ్యాచ్ లో కూడా టాస్ ఎవరు గెలిస్తే వారు మొదట బ్యాటింగ్ తీసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి…
ఇక రెండో సెమీఫైనల్ మ్యాచ్ గా ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా టీం ల మధ్య ఒక భారీ మ్యాచ్ అనేది జరగనుంది. కలకత్తా లోని ఈడెన్ గార్డెన్ వేదికగా గురువారం రోజున జరగబోయే ఈ మ్యాచ్ లో రెండు టీమ్ లా బలాబలాలు సమానంగా ఉన్నప్పటికీ కూడా ఈ మ్యాచ్ లో ఎవరు పై చేయి సాధిస్తారు అనేది కీలకంగా మారనుంది…ఇక ఒకసారి పిచ్ గురించి గనుక చూసుకున్నట్లయితే
ఈ పిచ్ బ్యాటింగ్, బౌలింగ్ రెండింటికి అనుకూలించే విధంగా కనిపిస్తుంది. అయితే ఈ పిచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన టీం కి మొదట బ్యాటింగ్ కి అనుకూలిస్తుంది. ఇక ఆ టీమ్ మళ్లీ బౌలింగ్ చేసినప్పుడు వాళ్ళ బౌలింగ్ కి అనుకూలిస్తున్నట్టుగా తెలుస్తుంది.
ఇక ఈ టోర్నీలో ఈ పిచ్ లో ఆడిన మ్యాచ్ ల గురించి కనక ఒకసారి చూసుకున్నట్లయితే నెదర్లాండ్, బంగ్లాదేశ్ మధ్య జరిగిన మ్యాచ్ లో నెదర్లాండ్ మొదట భ్యాటింగ్ చేసి 229 పరుగులు చేసింది. ఇక 230 పరుగుల లక్ష్యం తో చేజింగ్ కి వచ్చిన బంగ్లాదేశ్ టీమ్ 142 పరుగులకు ఆల్ అవుట్ అయింది… ఇక ఇండియా, సౌతాఫ్రికా టీంల మధ్య జరిగిన మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఇండియన్ టీమ్ నిర్ణీత 50 ఓవర్లకి 5 వికెట్లు కోల్పోయి 326 పరుగులు చేసింది. అనంతరం 327 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా టీమ్ 83 పరుగులకే ఆల్ అవుట్ అయింది. దాంతో భారీ పరుగుల తేడాతో ఇండియన్ టీమ్ ఈ మ్యాచ్ గెలిచి ఒక అరుదైన రికార్డుని క్రియేట్ చేసింది…ఇక అలాగే పాకిస్తాన్ టీం పైన ఆస్ట్రేలియా టీం మొదట బ్యాటింగ్ చేసి 9 వికెట్ల నష్టానికి 337 పరుగులు చేసింది. ఇక అనంతరం ఆస్ట్రేలియా తన బౌలింగ్ తో పాకిస్థాన్ ని చిత్తు చేసి 93 పరుగుల తేడా తో పాకిస్తాన్ పైన విజయం సాధించింది…
ఇక ఏ రకంగా చూసుకున్న ఈడెన్ గార్డెన్ పిచ్ కూడా మొదట బ్యాటింగ్ కి అనుకూలిస్తుంది ఆ తర్వాత మళ్లీ బౌలింగ్ కి అనుకూలిస్తుంది. ఇక దాని వల్లనే మొదట బ్యాటింగ్ చేసిన టీమ్ లే ఇక్కడ ఎక్కువగా విజయం సాధిస్తున్నాయి…