Homeక్రీడలుIndia Vs Australia World Cup Final: వరల్డ్ కప్ : ఇండియా vs ఆస్ట్రేలియా...

India Vs Australia World Cup Final: వరల్డ్ కప్ : ఇండియా vs ఆస్ట్రేలియా ఫైనల్.. ఎవరి బలమెంత? గెలుపు ఎవరిది..?

India Vs Australia World Cup Final: ఈ టోర్నీ లో వరుసగా 10 విజయాలను సాధించి ఇండియన్ టీం తనదైన రీతిలో ముందుకు దూసుకెళ్తూ, వరల్డ్ కప్ సాధించడానికి ఒక్క అడుగు దూరంలో వేచి చూస్తుంది. ఇక ఈ నెల 19వ తేదీన ఆస్ట్రేలియాతో జరగబోయే వరల్డ్ కప్ ఫైనల్ కి సర్వం సిద్ధం చేసుకున్న ఇండియన్ టీం ఈ మ్యాచ్ లో రక్తం చిందించైనా సరే ఎలాగైనా ఇండియాకి మూడోసారి వరల్డ్ కప్ ని అందించాలనే దిశగా ముందుకు దూసుకెళుతుంది. పోరాటమే ధ్యేయంగా, ప్రతి ఒక్క భారతీయుడి గుండె చప్పుడు ని బాసట గా చేసుకొని ముందుకు సాగుతున్న మన ప్లేయర్ల ధైర్యానికి మన దేశంలోని యావత్తు 140 కోట్ల మంది భారతీయుల మద్దతు లభిస్తుంది. ఈ ఒక్క మ్యాచ్ మీదనే 140 కోట్ల మంది భారతీయుల ఆశలు దాగి ఉన్నాయి అంటే మనం అర్థం చేసుకోవచ్చు ఈ మ్యాచ్ మనకు ఎంత ప్రస్టేజియస్ మ్యాచ్ అనేది…ఇక అందులో భాగంగానే ఈ మ్యాచ్ వల్ల మన ప్లేయర్ల మీద ఎంత ప్రెజర్ ఉంది అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి…ఇక ఈ మ్యాచ్ లో ఏ టీమ్ కి మ్యాచ్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

ముందుగా ఫైనల్ మ్యాచ్ ఆడబోయే నరేంద్ర మోడీ స్టేడియం గురించి తెలుసుకున్నట్లయితే ప్రస్తుతానికి అందరిలో ఉన్న డౌట్ ఒక్కటే ఇండియా ఆడే ఎక్కువ మ్యాచ్ లను అలాగే ప్రెస్టేజియస్ గా ఆడే మ్యాచ్ లను ఈ స్టేడియంలోనే ఎక్కువగా నిర్వహిస్తున్నారు దానికి కారణం ఏంటి అంటూ చాలా మంది వాళ్ల అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అయితే దానికి కారణం ఏమి లేదు ఈ స్టేడియం చాలా పెద్దగా ఉంటుంది. ఒక లక్ష 50 వేల మంది ప్రేక్షకులు కూడా మ్యాచ్ వీక్షించే అంత పెద్ద గ్రౌండ్ కావడం తో ప్రెస్టేజియస్ గా జరిగే ఈ మ్యాచ్ ను కూడా ఈ పిచ్ లోనే ఆడటం జరుగుతుంది. అలాగే ఈ పిచ్ లో ఇంతకుముందు ఏ పిచ్ లో లేని విధంగా రెడ్ సోయిల్, బ్లాక్ సోయిల్ అంటూ ఇలా డిఫరెంట్ పిచ్ లు ఇక్కడ అందుబాటులో ఉండడం వల్ల కూడా ఇక్కడ మ్యాచులు నిర్వహించడానికి ఒక ముఖ్య కారణం అనే చెప్పాలి…

ఇక ఇప్పటివరకు ఈ టోర్నీలో ఈ పిచ్ పైన నాలుగు మ్యాచ్ లు ఆడితే అందులో మొదట బ్యాటింగ్ చేసిన టీములు రెండుసార్లు, సెకండ్ బ్యాటింగ్ చేసిన టీమ్ లు రెండుసార్లు గెలిచాయి. అంటే పిచ్ ఫస్ట్ బ్యాటింగ్ కి అయిన, సెకండ్ బ్యాటింగ్ కి అయిన ఒకే విధంగా అనుకూలిస్తుంది… అలాగే ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్ లో బ్లాక్ సోయిల్ మీద ఆడారు. ఆ మ్యాచ్ లో పిచ్ కొంచెం స్లోగా ఉండటం వల్ల మొదటి బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ టీమ్ చాలా తక్కువ స్కోరుకే అలవాటయింది.ఇక దాంతో ఇండియా ఈజీగా స్కోర్ చేజ్ చేసి మ్యాచ్ అయితే గెలిచింది…

ఇక ఇది ఇలా ఉంటే ముందుగా ఇండియా టీమ్ గురించి చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఇండియన్ టీమ్ మంచి ఫామ్ లో ఉంది.వరుసగా విజయాలు అందుకుంటుంది.కానీ మొన్న న్యూజిలాండ్ జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ లో బౌలర్లు కొంతవరకు తడపడ్డారు అయినప్పటికీ శమీ మాత్రం అద్భుతమైన స్పెల్ వేసి ఇండియన్ టీమ్ కి మంచి విజయాన్ని అందించాడు.అలాగే ఇండియన్ టీమ్ ని ఫైనల్ లో నిలిపాడు. ఇక ఈ క్రమంలోనే ఇండియన్ టీం లోకి ఒక అదనపు స్పిన్నర్ ని తీసుకుంద్దామనే ఆలోచనలో టీం మేనేజ్ మెంట్ ఉన్నట్టుగా తెలుస్తుంది. కానీ అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందనే విషయం మీదనే ఇప్పుడు క్లారిటీ లేదు. ఎందుకంటే అశ్విన్ ని ఇప్పుడు టీంలోకి తీసుకువచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇంక ఆయన టీమ్ లోకి వస్తే సూర్య కుమార్ యాదవ్ బయటికి వెళ్లి పోవాల్సి ఉంటుంది. నిజానికి సూర్య కుమార్ యాదవ్ ఈ టోర్నీ లో పెద్దగా ప్రభావం అయితే ఏమీ చూపించలేదు. ఆయనకి బ్యాటింగ్ కూడా రావట్లేదు వచ్చినా కూడా ఆయన అంత ప్రభావంతమైన ఇన్నింగ్స్ అయితే ఒకటి కూడా ఆడట్లేదు.

అందుకే ఆయనని పక్కన పెట్టాలని చూస్తున్నప్పటికీ అతన్ని ఎక్స్ ట్రా ఫ్యాక్టర్ కింద తీసుకొచ్చారు కాబట్టి ఆయన్ని పక్కన పెట్టకుండా ఆడిస్తేనే బెటర్ ఎందుకంటే గత మ్యాచ్ లను వదిలేస్తే మనం ఆడుతున్నది ఫైనల్ మ్యాచ్ కాబట్టి బ్యాట్స్ మెన్స్ అందరూ రాణిస్తారనే గ్యారెంటీ లేదు. ఎందుకంటే ఫైనల్ మ్యాచ్ అంటే అందరికీ ఒత్తిడి అనేది కామన్ గా ఉంటుంది కాబట్టి మన ప్లేయర్లు తొందరగా అవుట్ అయిపోయే ప్రమాదం కూడా ఉంది. ఇలాంటి టైంలో టీమ్ లో బ్యాటింగ్ చేసే వాళ్ల సంఖ్య ఎక్కువగా ఉండాలి. లేకపోతే మాత్రం స్కోర్ అనేది ఎక్కువగా రాదు.కాబట్టి సూర్య కుమార్ యాదవ్ టీమ్ లో ఉంటేనే మంచిదని కొంతమంది అభిప్రాయాలు వ్యక్తం చేస్తుంటే, అశ్విన్ ని తీసుకోవాలని మరి కొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఇక వీళ్లలో ఎవరిని తీసుకుంటారు అనేది తెలియాల్సి ఉంది…

ఇక ఆస్ట్రేలియన్ టీం గురించి కనక చూసుకున్నట్లయితే ఆస్ట్రేలియా టీం కూడా ఈ మ్యాచ్ లో ఒక భారీ మార్పు అయితే చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. ఏంటి అంటే వీళ్ళ టీమ్ కి చివర్లో భారీ హిట్టర్స్ ఎవరూ లేరు మ్యాక్స్ వెల్ ఉన్నప్పటికీ మొన్న ఆఫ్ఘనిస్తాన్ మీద జరిగిన మ్యాచ్ లో ఆయనకు సపోర్ట్ చేయడానికి ఒక్క ప్లేయర్ కూడా లేకపోవడంతో ఆయన ఒక్కడే మొత్తం మ్యాచ్ ఆడాల్సి వచ్చింది. కాబట్టి చివర్లో హిట్టింగ్ చేయడానికి ఒక భారీ హిట్టర్ అవసరం అయితే ఉంది. ఇక ఈ కారణం చేతనే లబుషన్ ని పక్కన పెట్టి మార్క్ స్టోయినిస్ ని టీంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే చివర్లో మ్యాక్స్ వెల్ కి తోడుగా స్టోయినిన్స్ అయితే హిట్టింగ్ పర్ఫామెన్స్ ఇస్తూ ఇద్దరు కలిసి స్కోర్ ని ముందుకు తీసుకెళ్తారు కాబట్టి ఆయన టీంలో ఉండడం మంచిదని వాళ్ళు భావిస్తున్నారు…

ఇక ఈ పిచ్ లో ఇండియన్ టీం ఇప్పటివరకు మొత్తం 19 మ్యాచ్ లు ఆడితే అందులో 11 మ్యాచ్ ల్లో గెలిస్తే 8 మ్యాచ్ ల్లో ఓడిపోయింది. ఆస్ట్రేలియా టీమ్ కూడా ఈ పిచ్ లో 6 మ్యాచులు ఆడితే అందులో నాలుగు మ్యాచుల్లో గెలిచి, రెండు మ్యాచుల్లో ఓడిపోయింది ….

ఇక ఈ మ్యాచ్ లో టాస్ పెద్దగా ప్రభావం చూపించనప్పటికీ టాస్ గెలిచిన టీమ్ మాత్రం మొదటి బ్యాటింగ్ తీసుకుంటే బెటర్ ఎందుకంటే ఈ పిచ్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన, సెకండ్ బ్యాటింగ్ చేసిన పెద్దగా ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. కానీ ఆడేది ఫైనల్ మ్యాచ్ కాబట్టి మొదటి బ్యాటింగ్ తీసుకుంటే ఏ టెన్షన్ లేకుండా బ్యాట్స్ మెన్స్ పరుగులు చేయొచ్చు. అదే సెకండ్ బ్యాటింగ్ అయితే చేజింగ్ లో ఎంత తక్కువ స్కోరు ఉన్నా కూడా బ్యాట్స్ మెన్స్ టెన్షన్ పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మొదట బ్యాటింగ్ తీసుకొని ఎక్కువ స్కోర్ చేసి చేసింగ్ లో వికెట్లు తొందరగా తీసేస్తే సరిపోతుందని రెండు టీములు భావిస్తున్నట్టుగా తెలుస్తుంది…

ఇక ఇండియన్ టీమ్ ప్లేయింగ్ 11 కనక ఒక సారి చూసుకున్నటైతే
శుభ్ మన్ గిల్ , రోహిత్ శర్మ , విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, సూర్య కుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, మహమ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, జస్ప్రిత్ బుమ్రా, ఇక ఇండియన్ టీమ్ ఇదే ప్లేయింగ్ 11 తో బరిలోకి దిగే అవకాశాలు అయితే ఉన్నాయి…

ఒకసారి ఆస్ట్రేలియా టీమ్ ప్లేయింగ్ 11 కనక చూసుకున్నట్లయితే ట్రనిస్ హెడ్, డేవిడ్ వార్నర్ , మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్, లబుషన్ / స్టోయినిన్, గ్లెన్ మాక్స్ వెల్, జోష్ ఇంగ్లీస్, పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్ అడం జంపా, జోష్ హజిల్ వుడ్ ఇలాంటి ప్లేయర్లతో ఆస్ట్రేలియన్ టీమ్ బరిలోకి దిగే అవకాశాలు అయితే ఉన్నాయి…

ఇక ఈ రెండు టీములు కూడా చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి.కానీ ఈ టోర్నీ లో పర్ఫామెన్స్ ని బట్టి చూస్తే ఇండియన్ టీమ్ కే గెలిచే అవకాశాలు ఎక్కువ గా ఉన్నాయి…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
RELATED ARTICLES

Most Popular