odi world cup 2023: క్రికెట్ ప్రపంచ కప్ సమరం మొదలైంది. భారత్ తమ తొలి మ్యాచ్ ఆసీస్ తో తల పడేందుకు సిద్దమైంది. ఇప్పటికే టీమిండియా చెన్నై చేరుకుంది. అయితే, తొలి మ్యాచ్ కు ముందు భారీ షాక్ తగిలింది. పూర్తి ఫాం లో ఉన్న ఓపెనర్ శుభమన్ గిల్ డెంగ్యూ బారిన పడ్డారు. పాజిటివ్ గా నిర్దారణ అయింది. దీంతో, ఆసీస్ తో జరిగే తొలి మ్యాచ్ ఆడటం కష్టంగానే కనిపిస్తోంది.
తొలి మ్యాచ్ కు గిల్ డౌట్..
ప్రపంచ కప్ సమయంలో భారత్ తమ తొలి మ్యాచ్ ఆసీస్ తో తలపడనుంది. ఈ మ్యాచ్ లో గెలుపు ద్వారా ప్రపంచ కప్ కు శుభారంభం ఇవ్వాలని టీమిండియా భావిస్తోంది. ఇక, టీం సభ్యులు గాయాల నుంచి కోలుకొని బయట పడ్డారని భావిస్తున్న సమయంలో షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. డాషింగ్ ఓపెనర్ శుభమన్ గిల్ డెంగ్యూ బారిన పడ్డారు. పరీక్షల్లో పాజిటివ్ గా నిర్దారణ అయింది. దీంతో, ఆసీస్ మ్యాచ్ కు గిల్ కోలుకొనే అవకాశం లేదని సమాచారం.
గిల్ స్థానంలో ఇషాన్ కిషన్..
తొలి మ్యాచ్ కోసం టీమిండియా బుధవారం చెన్నైకు చేరింది. అప్పటి నుంచి గిల్ జ్వరంతో బాధపడుతున్నాడు. వైద్య పరీక్షలు నిర్వహించగా డెంగ్యూ ఉన్నట్లు తేలింది. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా నిర్దారించాల్సి ఉంది. జ్వరంతో ఉన్నాడని చెబుతున్నా..డెంగ్యూ పైన అధికారికంగా వెల్లడించలేదు. డెంగ్యూ అయితే కోలుకోవటానికి వారం నుంచి పది రోజుల సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు. తొలి మ్యాచ్ లోనే సత్తా చాటాలని భావిస్తున్న టీమిండియాకు ఇప్పుడు గిల్ అందుబాటులో ఉండదరనేది ఇబ్బందిగా మారుతోంది.
ఫేవరెట్ గా బరిలో..
ఇక..టీమిండియా టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది. కోట్లాది అభిమానుల సమక్షంలో స్వదేశంలో ఆడుతున్న రోహిత్ సేన ఆదివారం ఆసీస్ తో తొలి మ్యాచ్ కు సిద్దం అవుతోంది. ముమ్మరంగా ప్రాక్టీసు చేస్తోంది. ఇక, గిల్ ఈ మ్యాచ్ కు అందుబాటులో ఉంటాడా లేదా అనేది క్లారిటీ రావాల్సి ఉంది.