WPL 2023 UP Vs Gujarat: ఉమెన్స్‌ ప్రీమియర్‌ లీగ్‌: గుజరాత్‌పై అఖరి బంతికి గట్టెక్కిన యూపీ

WPL 2023 UP Vs Gujarat: నరాలు తెగే ఉత్కంఠ.. మైదానంలో ఆట ఆడుతున్న ఆటగాళ్లకు, టీవీలకు కళ్లప్పగించి చూస్తున్న అభిమానులకు అసలైన టీ-20 మజా లభించింది. ఉమెన్స్‌ ప్రీమియర్‌ లీగ్‌లో ఇప్పటి వరకూ జరిగిన రెండు మ్యాచ్‌లూ ఏకపక్షంగా సాగాయి. టాస్‌ ఓడిన జట్టు భారీ స్కోరు సాధించడం, ఛేజింగ్‌ దిగిన జట్టు తేలపోవడం జరిగాయి. ఆరంభ మ్యాచ్‌లో ముంబాయి, రెండో మ్యాచ్‌లో ఢిల్లీ ఇదే తీరును విజయాలు సాధించాయి. కానీ ఆదివారం ముంబైలో జరిగిన […]

Written By: Bhaskar, Updated On : March 6, 2023 9:16 am
Follow us on

WPL 2023 UP Vs Gujarat

WPL 2023 UP Vs Gujarat: నరాలు తెగే ఉత్కంఠ.. మైదానంలో ఆట ఆడుతున్న ఆటగాళ్లకు, టీవీలకు కళ్లప్పగించి చూస్తున్న అభిమానులకు అసలైన టీ-20 మజా లభించింది. ఉమెన్స్‌ ప్రీమియర్‌ లీగ్‌లో ఇప్పటి వరకూ జరిగిన రెండు మ్యాచ్‌లూ ఏకపక్షంగా సాగాయి. టాస్‌ ఓడిన జట్టు భారీ స్కోరు సాధించడం, ఛేజింగ్‌ దిగిన జట్టు తేలపోవడం జరిగాయి. ఆరంభ మ్యాచ్‌లో ముంబాయి, రెండో మ్యాచ్‌లో ఢిల్లీ ఇదే తీరును విజయాలు సాధించాయి. కానీ ఆదివారం ముంబైలో జరిగిన మ్యాచ్‌ వేరే లెవల్‌.

ఆ సంప్రదాయాన్ని చెరిపివేసింది

ఇప్పటి వరకూ జరిగిన రెండు మ్యాచ్‌ల్లో తొలుత బ్యాటింగ్‌ చేసిన జట్టు గెలుపొందింది. కానీ యూపీ వారియర్స్‌ ఆ సంప్రదాయాన్ని చెరిపివేసింది. గుజరాత్‌ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో చివర వరకూ పోరాడి ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది. తొలి మ్యాచ్‌లో ఓడిపోయిన గుజరాత్‌.. రెండో మ్యాచ్‌లో తుదికంటా పోరాడినప్పటికీ ఉత్తరప్రదేశ్‌ విజయాన్ని అడ్డుకోలేక పోయింది. గుజరాత్‌ విధించిన 170 రన్స్‌ ఛేజింగ్‌లో యూపీకి 18 బంతుల్లో కావాల్సినవి 53 పరుగులు.. చేతిలో ఉన్నవి మూడు వికెట్లే.. ఈ దశలో యూపీ వారియర్స్‌ బ్యాటర్లు సూపర్‌ ఇన్నింగ్స్‌ ఆడారు. గ్రేస్‌ హ్యారిస్‌ (26 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 59 నాటౌట్‌) నెవర్‌ బీఫోర్‌ అన్న రీతిలో ఆడింది. మరో ఎండ్‌లో సోఫీ ఎకెల్‌స్టోన్‌ (22 నాటౌట్‌) అండగా నిలవడంతో గుజరాత్‌కు మూడు వికెట్ల తేడాతో వరుసగా రెండో ఓటమి ఎదురైంది. కిమ్‌ గార్త్‌ ఐదు వికెట్లు తీసినా ఫలితం లేకపోయింది.

169 పరుగులు చేసింది

తొలి మ్యాచ్‌లో ముంబై చేతిలో దారుణమైన పరాజయాన్ని మూటగ ట్టుకున్న గుజరాత్‌.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసింది. 20 ఓవర్లలో 6 వికెట్లకు 169 పరుగులు చేసింది. ఓపెనర్లు మేఘన, డంక్లే (13) తొలి వికెట్‌కు 34 పరుగులు అందించి వెనువెంటనే అవుటైనా… ఆ తర్వాత హర్లీన్‌ దూకుడుగా ఆడింది. మరోవైపు స్పిన్నర్లు దీప్తి, ఎకెల్‌స్టోన్‌ మధ్య ఓవర్లలో మిడిల్డార్‌ను కట్టడి చేశారు. అయితే హర్లీన్‌కు చివర్లో గార్డ్‌నర్‌, హేమలత (21 నాటౌట్‌) సహకరించారు. దీంతో భారీ స్కోరు సాధ్యమైంది. యూపీ బౌలరుఉ్ల ఎకెల్‌ స్టోన్‌, దీప్తి శర్మలకు రెండేసి వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదనలో యూపీ జట్టు 19.5 ఓవర్లలో 7 వికెట్లకు 175 పరుగులు చేసి గెలి చింది. కిరణ్‌ నవ్‌గెరె (53) ధాటిగా ఆడి యూపీ విజయంలో కీలక పాత్ర పోషించింది. ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా గ్రేస్‌ హ్యారిస్‌ నిలిచింది.

WPL 2023 UP Vs Gujarat

మూడు వికెట్లు కోల్పోయినప్పటికీ

170 పరుగుల ఛేదనకు దిగిన యూపీకి ఆదిరిపోయే ఆరంభమేమీ లభిం చలేదు. గుజరాత్‌ పేసర్‌ కిమ్‌ గార్త్‌ ధాటికి యూపీ 20 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఈ దశలో కిరణ్‌ దూకుడు ప్రదర్శించింది. గుజరాత్‌ బౌలర్లు అంటే బెదురు లేకుండా బౌండ రీలు బాదింది. జట్టుపై ఒత్తిడిని తగ్గించింది. ఈక్రమంలో 40 బంతుల్లో 50 పరుగులు సాధించింది. నాలుగో వికెట్‌కు దీప్తి (11)తో కలిసి 66 పరుగు లు జోడించింది. అంతా బాగుంది అనుకుంటున్న సమయంలో కిమ్‌ గార్త్‌ 13వ ఓవర్‌ లో కిరణ్‌తో పాటు సిమ్రన్‌ (0) వికెట్లను తీసింది. అంతకుముందు ఓవర్‌ లోనే దీప్తిని మాన్సి అవుట్‌ చేయడంతో ఇక ఓటమి ఖాయం అనిపించింది. కానీ గ్రేస్‌ హ్యారిస్‌ మాత్రం మొండి పట్టుదలతో వరుస ఫోర్లు బాదింది. 17వ ఓవర్‌లో స్కోరు 117/7 మాత్రమే. ఈ క్రమంలో తర్వాత ఓవర్‌ లో గ్రేస్‌ మూడు ఫోర్ల సహాయంతో ఏకంగా 20 పరుగులు సాధిం చింది. దీంతో ఆఖరి ఓవర్‌లో లక్ష్యం 19 రన్స్‌కు చేరగా 6,4,4,6 తో అద్భుత విజయాన్నందించింది.