Odi World Cup 2023: వన్డే ప్రపంచకప్ ప్రారంభానికి ముందే ఈ ముగ్గురు ప్లేయర్స్ వన్డే కెరీర్ ముగిసిపోతుందా?

భువనేశ్వర్ కుమార్, రవిచంద్రన్ అశ్విన్, దీపక్ చాహర్.ధోని నేతృత్వంలో భారత జట్టు అద్భుత విజయాలలో కీలక పాత్ర పోషించిన ప్లేయర్ భువనేశ్వర్ కుమార్ .

Written By: Vadde, Updated On : July 29, 2023 1:00 pm

Odi World Cup 2023

Follow us on

Odi World Cup 2023: గత కొద్ది కాలంగా బీసీసీఐ సెలక్షన్స్ పలు రకాల వివాదాలకు దారితీస్తూనే ఉన్నాయి. టీమ్ కి ఎంతో ముఖ్యమైన ప్లేయర్స్ ని పక్కన పెట్టి పేలవమైన పర్ఫామెన్స్ ఇస్తున్న వాళ్ళని సెలెక్ట్ చేస్తున్న ఈ బీసీసీఐ విధివిధానాలపై ఇప్పటికే ఎందరో తమ అభ్యంతరాన్ని కూడా వ్యక్తం చేశారు. బీసీసీఐ మాజీ సెలక్టర్ దిలీప్ వెంగ్సర్కార్ కూడా రీసెంట్ గా బీసీసీఐను తీవ్రంగా విమర్శించారు. ఒక ఇంగ్లీష్ పేపర్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రోహిత్ శర్మ తర్వాత నెక్స్ట్ కెప్టెన్ ని తయారు చేయడంలో బీసీసీఐ విఫలమైందని ఆయన పేర్కొన్నారు.

ఎంతమంది ఎన్ని అంటున్న ప్రతి మ్యాచ్ సమయంలో తాను తీసుకున్న నిర్ణయాల విషయంలో తగ్గేదే లేదు అన్నట్టు ఏకపక్షంగా ఉంది బీసీసీఐ ప్రవర్తన. ఒకప్పుడు ఇండియన్ టీం కీలక విజయాలకు కారణమైనటువంటి ముగ్గురు ప్లేయర్స్ ను ప్రస్తుతం బీసీసీఐ విస్మరిస్తోంది. ఎటువంటి ఆలోచన లేకుండా ఆల్రెడీ ఇద్దరు ప్లేయర్లపై వేటువేసి మరొక ప్లేయర్ని రెడ్బల్ ఫార్మాట్లో మాత్రం అందుబాటులో ఉంచే విధంగా తన ప్రణాళికలను రూపొందిస్తుంది.

జరగబోయే వన్డే వరల్డ్ కప్ లో ఈ ముగ్గురు ప్లేయర్స్ ఆడే స్కోప్ అసాధ్యం అనిపిస్తుంది. ఒకరకంగా ఈ ముగ్గురి వన్డే క్రికెట్ కెరియర్ క్లోజ్ అని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. భువనేశ్వర్ కుమార్, రవిచంద్రన్ అశ్విన్, దీపక్ చాహర్.ధోని నేతృత్వంలో భారత జట్టు అద్భుత విజయాలలో కీలక పాత్ర పోషించిన ప్లేయర్ భువనేశ్వర్ కుమార్ . ఈనాడు అతని వన్డే క్రికెట్ భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారింది. వరుస గాయాల వల్ల అంతర్జాతీయ క్రికెట్ కు దూరం కావలసి వచ్చినా.. కొన్ని నెలల క్రితం తిరిగి ఫీల్డ్ లోకి ఎంటర్ అయిన భువీ చక్కటి పర్ఫామెన్స్ ను కనబరిచారు కూడా.

అయితే తాము చూడాలి అనుకుంది తప్ప మిగిలింది ఏదీ చూడకూడదు అని గట్టిగా నమ్మే బీసీసీఐ అతని పెర్ఫార్మెన్స్ ని కూడా గమనించకుండా తీసి పక్కన పెట్టేసింది. రీసెంట్గా ప్రకటించినటువంటి సెంట్రల్ కాంట్రాక్ట్ లో కూడా ఎక్కడ భువనేశ్వర్ కుమార్ పేరు కనిపించలేదు. మరోపక్క సిరాజ్ , షమీ పేస్ బలంగా ఉన్న కారణం చేత ప్రపంచ వన్డే కప్ జట్టు ఎంపికలో భువీకి ప్లేస్ అసాధ్యమేనని చెప్పాలి.

మరోపక్క అశ్విని పరిస్థితి కూడా అంతంత మాత్రమే అనే చెప్పవచ్చు.లాంగ్ ఫార్మాట్ కు మాత్రమే పరిమితమైన ఈ ఆప్స్ స్పిన్నర్ గత సంవత్సరం జనవరిలో సౌతాఫ్రికా తో జరిగిన వన్డే లో చివరిగా ఆడాడు. అప్పటినుంచి తిరిగి మరి ఇతర ఏ వన్డేలో అతను కనిపించింది లేదు. ప్రస్తుతం ఉన్న వన్డే జట్టుకు రవీంద్ర జడేజా ప్రధాన స్పిన్నర్ మరియు ఆల్ రౌండర్ గా వ్యవహరిస్తున్నారు. అతనితో పాటు కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్ చక్కటి ప్రదర్శన కనబరుస్తూ మంచిగా రాణిస్తున్నారు. దీంతో ప్రస్తుతం అశ్విన్ వన్డేల్లో ఎంట్రీ కుదిరేలా కనిపించడం లేదు.

దీపక్ చాహర్ పరిస్థితి లో కూడా పెద్ద మార్పు లేదు. చక్కటి పేస్ పెర్ఫార్మెన్స్ తో పవర్ ప్లే ఓవర్లు బౌలింగ్ చేసి తన అంతర్జాతీయ కెరియర్ ఆరంభంలో వాహ్ అనిపించుకున్న ఆ ప్లేయర్.. గాయాల కారణంగా ఫీల్డ్ లో తన క్రేజ్ పోగొట్టుకున్నాడు. మళ్లీ తిరిగి పూర్తి ఫిట్నెస్ తో ఫోకస్ పెట్టిన ఈ సంవత్సరం జరిగిన ఐపీఎల్ లో పెద్దగా పర్ఫార్మ్ చేయలేకపోయాడు. దీంతో ప్రస్తుతం అతన్ని వన్డే ఎంపిక ప్రశ్నార్థకమే!