టీ 20 ప్రపంచ కప్ లో టీమిండియా ఫేవరేట్ గా దిగినా కప్ అందుకోవడంలో విఫలమైంది. విమర్శల పాలైంది. భారీ అంచనాలున్నా కనీవినీ ఎరగని రీతిలో వెనకబడిపోయింది. పాక్, కివీస్ చేతిలో ఓటమి చెంది అభిమానుల ఆశలపై నీళ్లు చల్లింది. దీంతో కోట్లాది అభిమానుల ఆశలు ఆవిరయ్యాయి. పరాభవాల్ని మూటగట్టుకుంది. క్రికెట్ లో భారత్ కు ప్రత్యేకమైన స్థానం ఉంది. మన ఆటగాళ్లపై కూడా అంచనాలు పెద్దగానే ఉంటాయి. కానీ ఈ సారి మాత్రం మన ఆటగాళ్లు నిరాశపరచారు.

ప్రపంచ కప్ చరిత్రలోనే అత్యంత పేలవ ప్రదర్శన చేయడం తెలిసిందే. టైటిల్ పోరులో వెనుకంజ వేసింది. కెప్టెన్ గా కోహ్లికిదే ఆఖరి టోర్నీ కావడంతో అందరు కప్ గెలుస్తారని భావించారు. కానీ ఈ సారి జట్టు ప్రదర్శన బాగాలేకపోవడం విచారకరమే. తొలి రెండు మ్యాచుల్లో ఆటగాళ్ల అంచనాలు తలకిందులయ్యాయి. టైటిల్ పోరులో అంచనాలు అందుకోలేకపోయింది. 2007లో విజేతగా నిలిచిన భారత్ 2014లో రన్నరప్ గా నిలిచింది. 2016లో సెమీస్ లోనే ఇంటిదారి పట్టింది. 2009, 2010, 2012 సంవత్సరాల్లో సూపర్ దశ దాటలేకపోయింది.
2022లో నిర్వహించే టీ20 ప్రపంచ కప్ కోసం భారత్ సిద్ధమవ్వాలి. ఈ సారి జరిగిన పరాజయాన్ని పక్కనపెట్టి కప్ గెలవడం మీదే దృష్టి సారించాల్సిన అవసరం ఏర్పడింది. పాక్, కివీస్ మ్యాచుల్లో భారత ఆటగాళ్ల ప్రదర్శన పేలవంగా ఉందని తెలుస్తోంది. ఇకపై ఇలాంటి తప్పులు చేయకుండా చూసుకోవాల్సిన ప్రాధాన్యతను గుర్తించాలి. జట్టులో ఆల్ రౌండర్ లేని లోటు కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఓపెనర్ గా రాహుల్ తో పాటు ఇషాన్ ను పంపించగా ఆ ప్రయోగం బెడిసికొట్టింది.
Also Read: PV Sindhu: మరో ‘పద్మం’ అందుకున్న పీవీ సింధు..!
షమి రాణించకపోవడం కూడా ఓ మైనసే. బౌలింగ్ లో వైవిధ్యం ఉన్న బౌలర్ అవసరం ఏర్పడుతోంది. జట్టులోకి పేసర్ ను తీసుకోవాల్సిన అవసరాన్ని మేనేజ్ మెంట్ గుర్తించుకోవాల్సి ఉంటుంది. చేసిన తప్పులను మళ్లీ చేయకుండా చూసుకోవాల్సిన అవసరం మేనేజ్ మెంట్ పైనే ఉంది. దీనికి టీమిండియా సన్నద్ధం కావాల్సి ఉంది. టీ 20 ప్రపంచ కప్ లో చాంపియన్ షిప్ గా నిలవాలన్నది అభిమానుల కోరిక.
Also Read: T20 World Cup: పసికూనపై ప్రతాపం చూపించేందుకు టీమిండియా రెడీ