Border Gavaskar Trophy : కెప్టెన్ రోహిత్ శర్మ వ్యక్తిగత కారణాల వల్ల తొలి టెస్ట్ ఆడే పరిస్థితి లేదు. ఎందుకంటే రోహిత్ భార్య రెండవసారి ప్రసవించింది. మగ బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో తన భార్య పక్కనే రోహిత్ ఉన్నాడు. ఫలితంగా తొలి టెస్ట్ లో జట్టుకు బుమ్రా నాయకత్వం వహిస్తున్నాడు. గతంలో ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన టెస్ట్ మ్యాచ్ కు బుమ్రా నాయకత్వం వహించాడు. ఆ టెస్టులో భారత్ ఓడిపోయింది. ఇటీవల స్వదేశంలో న్యూజిలాండ్ జట్టుతో జరిగిన టెస్ట్ సిరీస్ ను భారత్ 0-3 తేడాతో కోల్పోయింది.. దీంతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ భారత జట్టుకు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. టెస్టుల ఈ సిరీస్లో భారత్ 4-0 తేడాతో ఆస్ట్రేలియాపై గెలిస్తేనే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ లోకి వెళ్లడానికి అవకాశం ఉంటుంది. అయితే ఆ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో చేజార్చుకోకూడదని టీమిండియా భావిస్తున్నది. అంతేకాదు గత రెండు సీజన్లలో టీమిండియా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని గెలుచుకుంది. అయితే ఈసారి కూడా అదే ఒరవడి కొనసాగించి హ్యాట్రిక్ సాధించాలని భావిస్తోంది.
అనేక మార్పులు
టీమిండియా హెడ్ కోచ్ గా గౌతమ్ గంభీర్ నియమితులైన నాటి నుంచి టీమిండియా రెండు దారుణమైన పరాభవాలను ఎదుర్కొంది. శ్రీలంక చేతిలో వన్డే సిరీస్ వైట్ వాష్, స్వదేశంలో న్యూజిలాండ్ పై టెస్ట్ సిరీస్ వైట్ వాష్ కు గురైంది. దీంతో గౌతమ్ గంభీర్ పై ఒత్తిడి పెరిగిపోయింది. దాని నుంచి ఉపశమనం పొందాలంటే టీమిండియా కచ్చితంగా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. అందువల్లే గౌతమ్ గంపియన్ ఆస్ట్రేలియా సిరీస్ కు ముందు టీం ఇండియాలో అనేక మార్పులు చేర్పులు చేపడుతున్నాడు. యశస్వి జైస్వాల్ కు తోడుగా కేఎల్ రాహుల్ ను ఓపెనర్ గా దించే అవకాశం ఉంది.. ఇక ఇటీవల భారత – ఏ జట్టులో విశేషంగా రాణించిన ధృవ్ జురెల్ ను ఆరవ స్థానంలో బరిలోకి దించుతానని తెలుస్తోంది. తెలుగు ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డి ని నాలుగో పేస్ బౌలర్ గా రంగంలోకి దింపుతారని తెలుస్తోంది.. అయితే ఇటీవల నితీష్ కుమార్ రెడ్డి పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. అయితే మొత్తంగా నితీష్ 23 ఫస్ట్ క్లాస్ క్రికెట్ మ్యాచ్ లు ఆడాడు. 56 వికెట్లు పడగొట్టాడు. ఇక పెర్త్ టెస్ట్ కోసం మూడవ పేస్ బౌలర్ స్థానంలో హర్షిత్ రాణా లేదా ప్రసిధ్ కృష్ణను తీసుకునే అవకాశం కనిపిస్తోంది. హర్షిత్ గంటకు 140 కిలోమీటర్ల వేగంతో బంతులు విసురుతున్నాడు. ఇటీవల భారత – ఏ జట్టు తరఫున అతడు అద్భుతమైన ప్రతిభ చూపాడు. అందువల్లే హర్షిత్ వైపే గౌతమ్ గంభీర్ మొగ్గు చూపుతున్నాడని తెలుస్తోంది. మీరు మాత్రమే కాకుండా దేవదత్ పడిక్కల్ ను కూడా జట్టులోకి తీసుకుంటారని తెలుస్తోంది. మొత్తంగా చూస్తే ఆస్ట్రేలియా పై తలపడే భారత జట్టులో పూర్తిగా యువ రక్తాన్ని నింపే పనిలో గౌతమ్ గంభీర్ పడ్డట్టు తెలుస్తోంది.