Ashes 2023: యాషెస్ సిరీస్ నాలుగో టెస్ట్ బుధవారం నుంచి ప్రారంభం కానుంది. ఐదు టెస్టుల సిరీస్ లో ఇప్పటికే మూడు టెస్టులు పూర్తయ్యాయి. మొదటి రెండు టెస్టుల్లో ఆస్ట్రేలియా జట్టు విజయం సాధించగా, సిరీస్ లో నిలవాలి అంటే తప్పక గెలవాల్సిన మూడో టెస్ట్ లో ఇంగ్లాండ్ జట్టు విజయం సాధించి సిరీస్ పై ఆశలు నిలబెట్టుకుంది. నాలుగో టెస్ట్ బుధవారం నుంచి మాంచేస్టర్ లోని ఎమరేట్స్ ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా నాలుగో టెస్ట్ జరగనుంది. ఈ టెస్ట్ ను ఎరుజట్లు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ఆస్ట్రేలియా జట్టు విజయం సాధిస్తే సిరీస్ కైవసం చేసుకుంటుంది. ఇంగ్లాండ్ జట్టు విజయం సాధిస్తే ఐదో టెస్టు అత్యంత కీలకంగా మారనుంది. టెస్ట్ లో విజయం సాధించడం ద్వారా సమం చేయాలని ఇంగ్లాండ్ జట్టు భావిస్తుంటే.. ఆస్ట్రేలియా జట్టు మరో టెస్ట్ మిగిలి ఉండగానే సిరీస్ కైవసం చేసుకోవాలని భావిస్తోంది.
ప్రతిష్టాత్మకమైన యాషెస్ సిరీస్ లో ఆస్ట్రేలియా జట్టు మొదటి రెండు టెస్టుల్లో అదరగొట్టింది. తొలి టెస్ట్ లో రెండు వికెట్ల తేడాతో చివరి రోజు విజయం సాధించగా, టెస్ట్ లోను 43 పరుగులు తేడాతో ఆస్ట్రేలియా జట్టు ఘన విజయం సాధించింది. మూడో టెస్టులో మార్పులతో బరిలోకి దిగిన ఇంగ్లాండు జట్టు మూడు వికెట్ల తేడాతో విజయం సాధించి సిరీస్ లో తొలిసారి విజయాన్ని నమోదు చేసింది. దీంతో వరుసగా మూడు టెస్టుల్లో విజయాన్ని నమోదు చేసి సిరీస్ కైవసం చేసుకోవాలన్న ఆస్ట్రేలియాకు ఇంగ్లాండ్ జట్టు షాక్ ఇచ్చింది. మూడో టెస్ట్ లో ఇంగ్లాండ్ జట్టు విజయం సాధించడంతో మిగిలిన రెండు టెస్టులు కీలకంగా మారాయి.
తప్పక విజయం సాధించాల్సిన పరిస్థితి ఇంగ్లాండ్ జట్టుది..
ఈ సిరీస్ లో ఇంగ్లాండ్ జట్టు పోటీలో నిలవాలి అంటే నాలుగో టెస్ట్ లో తప్పక గెలవాల్సిన పరిస్థితి ఇంగ్లాండ్ జట్టుకు ఏర్పడింది. మొదటి రెండు టెస్టుల్లో ఓటమి తర్వాత ఇంగ్లాండ్ జట్టులో మార్పులు చేసింది. ఆ మార్పులే ఇంగ్లాండ్ జట్టుకు మూడో టెస్టులో విజయాన్ని అందించాయి. మొదటి రెండు టెస్టుల్లో విఫలమైన తర్వాత ఇంగ్లాండ్ జట్టు టీమ్ లో మార్పులు చేసి విజయం సాధించింది. మూడో టెస్ట్ లో మార్క్ వుడ్, క్రిష్ వోక్స్, మొయిన్ అలీ బరిలోకి దిగారు. మూడో టెస్ట్ మాదిరిగానే నాలుగో టెస్ట్ లోను అదే ఆటగాళ్లతో బరిలోకి దిగేందుకు ఇంగ్లాండ్ జట్టు సిద్ధమవుతోంది. జాక్ క్రావ్లె, డకెట్, హ్యరీ బ్రూక్, రూట్, బెయిర్ స్టో(వికెట్ కీపర్), బెన్ స్టోక్స్(కెప్టెన్), మొయిన్ అలీ, క్రిస్ వొక్స్, మార్క్ వుడ్, బ్రాడ్, రాబిన్సన్ తో బరిలోకి దిగే అవకాశం ఉంది. అలాగే, ఆస్ట్రేలియా జట్టు కూడా మూడో టెస్ట్ ఆడిన జట్టుతోనే బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబు చేంజ్, స్టీవెన్ స్మిత్, ట్రావిష్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ క్యారీ(వికెట్ కీపర్), పాత్ కమిన్స్ (కెప్టెన్), మిచెల్ స్టార్క్, టాడ్డి ముర్ఫీ, స్కాట్ బోలాండ్ ఆడనున్నారు.
ఇరు జట్లకు అత్యంత కీలకం..
నాలుగో టెస్ట్ ఇరుజట్ల ఆటగాళ్లకు అత్యంత కీలకము కావడంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. ఈ మ్యాచ్లో గెలిస్తే ఇంగ్లాండ్ జట్టు పోటీలో నిలుస్తుంది. అందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ నాలుగో టెస్ట్ లో విజయం సాధించడమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది ఇంగ్లాండ్ జట్టు. ఈ టెస్ట్ లో గనుక విజయం సాధిస్తే మరో టెస్ట్ మిగిలి ఉండగానే సిరీస్ సొంతం చేసుకునే అవకాశం లభిస్తుండడంతో ఆస్ట్రేలియా జట్టు కూడా లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. అందుకు అనుగుణంగా ఆస్ట్రేలియా జట్టు వ్యూహాలను రచిస్తోంది. ఇంగ్లాండ్ జట్టు కనుక విజయం సాధిస్తే 2-2 తో సిరీస్ సమం అవుతుంది. అప్పుడు సిరీస్ విజయం సాధించడానికి ఐదో టెస్ట్ కీలకంగా మారుతుంది. దీంతో ఐదో టెస్టు అత్యంత ఆసక్తికరంగా మారనుంది. దీంతో నాలుగో టెస్ట్ ను ఇరుజట్లు ఆటగాళ్లు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని బరిలోకి దిగనున్నాయి.