IPL Success: ప్రపంచంలోనే మోస్ట్ సక్సెస్ ఫుల్ లీగ్ గా ఐపీఎల్ ఎందుకైంది?

IPL Success:  క్రీడల్లో అత్యధిక క్రేజ్ ఉన్నది క్రికెట్ కే. భారత్ లో దీన్ని ఒక మతంగా కొలుస్తారు. ఎంత వయసు వచ్చినా ఇది ఇప్పటికీ ఆడినా.. చూసినా.. ఆనందమే.. అవకాశం వస్తే ఒక్క బ్యాటింగ్ అయినా చేయంది వదలరు.. ఫార్మాట్ ఏదైనా సరే టీమిండియా మ్యాచ్ లు ఆడుతుందంటే చూడకుండా నిద్రపోరు కొందరు.. అలాంటి క్రికెట్ ఇప్పుడు రకరకాల ఫార్మట్లతో సాగుతోంది. మొదట్లో క్రికెట్ మ్యాచ్ అంటే టెస్ట్ మ్యాచ్ నే. దాదాపు నాలుగు నుంచి […]

Written By: NARESH, Updated On : June 15, 2022 10:17 am
Follow us on

IPL Success:  క్రీడల్లో అత్యధిక క్రేజ్ ఉన్నది క్రికెట్ కే. భారత్ లో దీన్ని ఒక మతంగా కొలుస్తారు. ఎంత వయసు వచ్చినా ఇది ఇప్పటికీ ఆడినా.. చూసినా.. ఆనందమే.. అవకాశం వస్తే ఒక్క బ్యాటింగ్ అయినా చేయంది వదలరు.. ఫార్మాట్ ఏదైనా సరే టీమిండియా మ్యాచ్ లు ఆడుతుందంటే చూడకుండా నిద్రపోరు కొందరు.. అలాంటి క్రికెట్ ఇప్పుడు రకరకాల ఫార్మట్లతో సాగుతోంది. మొదట్లో క్రికెట్ మ్యాచ్ అంటే టెస్ట్ మ్యాచ్ నే. దాదాపు నాలుగు నుంచి ఐదు రోజుల పాటు సాగేది. కానీ 2020 ఫార్మాట్ వచ్చాకా.. ఈ అటపై మరింత క్రేజ్ పెరిగింది. సమయం తక్కువగా ఉండడంతో పాటు ఉన్నంతసేపు ఆటలో మజా ఉండడమే అందుకు కారణం. 2020 ఫార్మాట్ ప్రవేశించాక దానికి ఊపునిస్తూ ఐపీఎల్ ను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే మిగతా మ్యాచ్ లకంటే ఐపీఎల్ లకు క్రేజీ పెరిగింది. ఆటగాళ్ల కొనుగోలు నుంచి చివరి మ్యాచ్ వరకు క్రీకెట్ అభిమానులు వదలకుండా చూస్తారు. అసలు ఐపీఎల్ అంటే ఎందుకంత మోజు..? అంత ప్రజాదరణ పొందడానికి కారణాలేంటి..?

IPL

ఐపీఎల్ స్ట్రాట్ అవుతుందంటే క్రికెట్ అభిమానుల్లో పండుగ వాతావరణమే.. ఇండియా ప్రవేశపెట్టిన ఈ లీగ్ లో ఏ ఒక్క దేశం అని కాకుండా వివిధ దేశాలకు చెందిన ప్రముఖ క్రీడాకారులు కలిసి ఆడుతారు. ఒక కుటుంబంలా కలిసి పోతారు. విభిన్న సంస్కృతులకు మూలమైన భారత్ లో అనేక సంప్రదాయాలు పుట్టుకొచ్చాయి. ఈ నేపథ్యంలో భారత ప్రీమియర్ లీగ్ ను ఏర్పాటు చేసి క్రికెట్ హిస్టరీలోనే కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. 1990లో క్రికెట్ అంటే చాలా మందికి ఇష్టం ఉండేది. కానీ వీటిని చూడడానికి గంటలకొద్దీ టీవీల ముందు కూర్చోవడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపేవారు కాదు. ఈ తరుణంలో ఐపీఎల్ ను తీసుకొచ్చి క్రీడాభిమానుల్లో జోష్ పెంచారు.

Also Read: CM KCR- Mamatha Benarji Meeting: మమత మీటింగ్ కు అందుకే రాను.. కేసీఆర్ అలకకు వెనుక అసలు కారణం ఇదీ

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆటగాళ్లందరూ ఐపీఎల్ ద్వారా ఒకే వేదికపైకి వస్తారు. ఆయా ప్రాంచైజీలు ఆటగాళ్ల రేటింగ్ ను బట్టి కొనుగోలు చేస్తాయి. కొందరు బాగా ఆడే ఇతర దేశాల ఆటగాళ్లను అత్యధికంగా వెచ్చించి ఫ్రాంచైజీలు కొనుగోలు చేస్తాయి. ఇంకొందరు ప్రపంచ ప్రఖ్యాత కెప్టెన్ లను ఐపీఎల్ లో జట్లకు కెప్టెన్సీగా నియమించుకున్నాయి. వివిధ దేశాల క్రికెట్ జట్లను అనుసంధానం చేసినప్పుడు అందులో ప్రతిభ కలిగిన క్రీడాకారులే ఉంటారు. ఈ సమయంలో మ్యాచ్ పై మరింత ఆసక్తి పెరుగుతుంది. ఇక్కడ ప్రతీ క్రికెటర్ పై కొంత మొత్తం వెచ్చిస్తున్నందున క్రీడాకారులు సైతం వ్యక్తిగతంగా ప్రతిభ చూపించేందుకు ఉత్సాహం చూపుతారు.

IPL

సాధారణంగా వన్డే మ్యాచ్ 8 నుంచి 9 గంటల పాటు సాగుతుంది. కానీ ఐపీఎల్ 2020 ఫార్మాట్ అయినందున తక్కువ సమయంలో ఎక్కువ ఎంజాయ్ చేయొచ్చని కొందరు క్రీడాభిమానులు భావిస్తారు. అందువల్ల దీనిని ఎక్కువగా ఆదరిస్తారు. 2020 ఫార్మాట్ అంతకుముందే ప్రవేశపెట్టినా ఐపీఎల్ వచ్చాక దీని ప్రాధాన్యత విపరీతంగా పెరగింది. కేవలం మూడు గంటల్లోపు మ్యాచ్ పూర్తవుతున్నందున ఇది అందరికీ సౌలభ్యంగా ఉంటుంది.

క్రికెట్ ఫెస్టిఫెల్ లో ఒకప్పుడు వివాదాలు కనిపించేవి కావు. ఏదైనా సమస్య ఉంటే రూంలోకి వెళ్లి విచారించుకునేవారు. కానీ ఐపీఎల్ లో ఎక్కువశాతం మైదానంలో వివాదాలే కనిపిస్తాయి. కొందరు క్రీడాకారులు కొట్టుకునే స్థాయికి వెళ్లడం గమనార్హం. దీంతో క్రికెట్ చూసేవారికి అదోక ప్రత్యేకతలా కనిపిస్తుంది. దీంతో ఎప్పుడు ఏ వివాదం స్ట్రాట్ అవుతుందోనని క్రీడాకారులు ఆసక్తిగా ఎదురుచూస్తారు. ఇక క్రీడాకారులనే కాకుండా అభిమానులను అలరించేందుకు ప్రత్యేక ఎంటర్టైన్మెంట్ ప్రొగ్రామ్స్ ఐపీఎల్ లో కనిపిస్తాయి. దీంతో ఐపీఎల్ ఎక్కువ ఆనందాన్నిచ్చే క్రీడగా మారింది.

IPL

ఐపీఎల్ ఇంతగా ఆదరణ పొందడానికి కారణం భారత క్రికెట్ అభిమానులే. వారికున్న క్రేజ్ ఈ టోర్నీ సక్సెస్ కావడానికి కారణం. ఇక ప్రపంచంలోని మెరుగైన ఆటగాళ్లంతా కలిసి ఐపీఎల్ లో ఆడడంతో జట్లు పటిష్టంగా మారి ఆట మాజా వస్తోంది. ఎన్నో టై మ్యాచ్ లు, సూపర్ ఓవర్ మ్యాచ్ లు జరుగుతున్నాయి. అందుకే ఎక్కడ లేని ఉత్కంఠతో ఐపీఎల్ ఊపేస్తోంది. ఐపీఎల్ లో ఇతర కార్యక్రమాలు, ప్రైజ్ మనీ, హంగులు, ఆర్బాటాలు కూడా ఆకర్షణగా మారి ప్రపంచంలోనే మోస్ట్ సక్సెస్ ఫుల్ లీగ్ గా ఐపీఎల్ ను మార్చేశాయి.

Also Read:BJP Targeted Southern States: దేశ రాజకీయం దక్షిణాది వైపు ఎందుకు చూస్తోంది? తెలంగాణలో బీజేపీ కొత్త ప్లాన్

Tags