Ind Vs Pak: గత మెంతో ఘనం.. ప్రపంచకప్ వేదికలపై ఒక్కసారి కూడా టీమిండియాపై పాకిస్తాన్ గెలవలేదని నిన్నటి వరకూ చెప్పుకున్నాం.. కానీ ఇప్పుడు గెలిచి చూపించింది. ఇదే తొలి ఓటమి కాదు.. ప్రపంచకప్ కాకుండా చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ లో ఇదే కోహ్లీ సేన పాకిస్తాన్ చేతిలో చిత్తయ్యింది. గడిచిన నాలుగేళ్లలో ఇది రెండో ఓటమి. ఒకప్పుడు ఎదురు లేకుండా ఉన్న టీమిండియాకు ఇప్పుడు వరుస ఓటములు బాధ కలిగిస్తున్నాయి. సగటు భారత అభిమాని తట్టుకోలేకపోతున్నాడు.

క్రికెట్ అంటే దేశంలో ఒక ఆట కాదు.. ఒక మతంలా భావిస్తారు.పిచ్చిగా చూస్తారు. అభిమానిస్తారు. ఇక పాకిస్తాన్ తో అంటే ప్రాణాలు పోయేలా ఆడుతారు.. చూస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఇంతటి రసవత్తర పోరు లేదంటే అతిశయోక్తి కాదు..
అయితే మూడు దశాబ్ధాలుగా పాకిస్తాన్ ను అన్ని ఐసీసీ టోర్నమెంట్లలో భారత్ ఓడించి 12-0తో ఉంది. కానీ నాలుగేళ్లలో మాత్రం టీమిండియా నాలుగు సార్లు తలపడితే రెండుసార్లు ఓడిపోయింది. ప్రస్తుతం పాకిస్తాన్ దే పైచేయిగా ఉంది. రెండు సార్లు టీమిండియా ఓడిపోవడం తీవ్రంగా కలిచివేస్తోంది. అసలు టీమిండియాకు ఏమైంది? ఈ దారుణ వైఫల్యానికి కారణాలేంటనే దానిపై అభిమానులు విశ్లేషకులు ఆరాతీస్తున్నారు.
క్రికెట్ పిచ్ లే ఇప్పుడు టీమిండియా కొంప ముంచాయి. టాస్ గెలవగానే పిచ్ ను అర్థం చేసుకొని బ్యాటింగ్/బౌలింగ్ ఎంచుకోక టీమిండియా దారుణంగా ఓడిపోయింది. ఇక భారీ అంచనాలు భారత్ ఆటగాళ్లను ఒత్తిడిలోకి నెట్టి చిత్తు చేస్తున్నాయి. ఇక మన టాప్ ఆర్డర్ విఫలమైతే టీమిండియా ఓడిపోతుంది. కోహ్లీ, రోహిత్, రాహుల్ ఔట్ అయితే టీమిండియా ఓటమే. ఆ బలహీనతను అధిగమించాల్సి ఉంది. పాకిస్తాన్ తో ఆడకపోవడం.. వారి గురించి తెలియకపోవడం.. వ్యూహాలు సిద్ధం చేయలేకపోవడం కూడా భారత్ ఓటమికి కారణం అవుతున్నాయి. మరి ఇప్పటికైనా గుణపాఠాలు నేర్చుకొని టీమిండియా తిరిగి పుంజుకుంటుందా? లేదా? అన్నది వేచిచూడాలి.