Megha akash: హీరో నితిన్ నటించిన లై సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించి అందరి మనసులు దోచుకున్న నటి మెఘా ఆకాశ్. ఆ తర్వాత వచ్చిన చల్ మోహనరంగ సినిమాలో ఆమె అందం, అభినయానికి తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. మెఘా నటించిన రెండు చిత్రాలు బాక్సాఫీసు వద్ద అంతంత మాత్రం ఆడినా.. ఆమెకు మాత్రం మంచి పేరు తెచ్చిపెట్టాయి. అనంతరం తమిళ, హిందీ చిత్రాల్లోనూ నటించింది. ఇప్పడు మళ్లీ తెలుగు తెరపై మెరిసేందుకు సిద్ధమవుతోంది ఈ ముద్దుగుమ్మ. ఇటీవలే ఆమె నటించిన రాజరాజ చోర, డియర్ మేఘ సినిమాలు విడుదలయ్యాయి. శ్రీ విష్ణు హీరోగా నటించిన రాజరాజచోర సూపర్ హిట్ అయ్యింది.
వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటూ మెల్లగా తన ఖాతాలో విజయాలను సొంతం చేసుకుంటోంది ఈ భామ. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఏకంగా మూడు, నాలుగు సినిమాలకు ఒప్పందం కుదుర్చుకుంది. శివ కందుకూరి నటిస్తున్న మనుచరిత్ర లో మేఘ నటిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో పాటు, సత్యదేవ్, తమన్నా జంటగా నటిస్తున్న గుర్తుందా శీతాకాలం మూవీలోనూ మేఘా కీలకపాత్ర పోషిస్తోంది. మరోవైపు, బైలింగ్వల్, అక్టోబర్ 31 లేడీస్‌నైట్ చిత్రాల్లోనూ మేఘ కనిపించనుంది.
అన్నట్లు ఈ రోజు(అక్టోబరు26) మెఘా ఆకాశ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా మను చరిత్ర సినిమాలోని పాటను సినీ నటి కాజల్ విడుదల చేయనుంది. ఈ చిత్రానికి కాజల్ ప్రజెంటర్ కావడం విశేషయం. హీరోయిన్‌గానే కాకుండా, మంచి పాత్ర ఏది లభించినా వదులుకోకుండా చేస్తున్న మేఘ ఆకాశ్‌కు మంచి భవిష్యత్తు ఉంటుందని సిని విశ్లేషకులు చెబుతున్నారు.