Suryakumar Yadav: చెన్నైతో ఓటమి తర్వాత ముంబై జట్టు మళ్లీ గెలుపు బాట పట్టింది. గురువారం రాత్రి పంజాబ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో ఘనవిజయం సాధించింది. ముంబై విజయంలో టీమిండియా మిస్టర్ 360.. సూర్య కుమార్ యాదవ్ కీలకపాత్ర పోషించాడు. చెన్నై జట్టుతో జరిగిన మ్యాచ్ లో గోల్డెన్ డక్ గా అవుటయిన అతడు.. పంజాబ్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో 78 పరుగులు చేసి అలరించాడు. ఇటీవల స్పోర్ట్స్ హెర్నియా వల్ల అతడు శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ ఆకాడమీలో చాలా రోజులు చికిత్స పొందాడు. ఐపీఎల్ 17వ సీజన్లో ముంబై జట్టు ఆడిన మూడు మ్యాచ్లకు అతడు దూరమయ్యాడు. ఇటీవల నిర్వహించిన పరీక్షల్లో పూర్తిస్థాయిలో సామర్థ్యం సాధించడంతో.. తిరిగి జట్టులోకి అడుగుపెట్టాడు. అయితే ప్రస్తుతం అతడిని ముంబై జట్టు ఇంపాక్ట్ ప్లేయర్ గానే బరిలోకి దించుతోంది. ఇప్పటివరకు ఆడిన మ్యాచ్లలో సూర్యకుమార్ యాదవ్ రెండు అర్థ సెంచరీలు సాధించాడు.
“నా సామర్థ్యం పరంగా 100% పూర్తిస్థాయిలో సిద్ధమయ్యేందుకు ప్రయత్నం చేస్తున్నాను. ఫీల్డింగ్ కోసం ఇప్పటికే శిక్షణ మొదలుపెట్టాను. త్వరలో 40 ఓవర్లపాటు (బ్యాటింగ్, ఫీల్డింగ్ కలిపి) స్టేడియంలో ఉండేందుకు ప్రయత్నం చేస్తాను. నా క్రీడా జీవితంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నాను. వాటన్నింటినీ అధిగమించి ఈ స్థాయికి వచ్చాను. నా బ్యాటింగ్ శైలిపై చాలామంది విమర్శలు చేశారు. వారిని తిరిగి విమర్శించలేదు. నా వరకు టి20 ఫార్మాట్ కు దూకుడు, తెగువ కచ్చితంగా ఉండాల్సిందేనని భావిస్తాను. ముంబై జట్టు మేనేజ్మెంట్ నాకోసం ప్రత్యేకంగా ఎటువంటి సలహాలు, సూచనలు ఇవ్వదు. నిబంధనల ప్రకారం మ్యాచ్ ముందు ఒకరోజు బ్యాటర్లతో సమావేశం నిర్వహిస్తారు. ఆ సందర్భంగా టాప్ ఆర్డర్లో కనీసం ఒక్క బ్యాటరైనా 17 ఓవర్ల పాటు క్రీజ్ లో ఉండాలని ఆదేశాలు జారీ చేస్తారు.. ఇక పంజాబ్ జట్టుతో జరిగే మ్యాచ్ లో ముందుగా బ్యాటర్లతో మీటింగ్ జరిగింది.. మైదానం అత్యంత కఠినంగా ఉండడంతో నెట్స్ లో తీవ్రంగా సాధన చేశా. స్కోర్ బోర్డు పరుగులు పెట్టించడానికి కారణం అదే. అలా పరుగులు ఉంటేనే బౌలర్ల పని ఈజీ అవుతుంది. పంజాబ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో రోహిత్ భారీ స్కోరు సాధించే క్రమంలో అవుట్ అయ్యాడు. అలాంటప్పుడు ఆ బాధ్యత నేను తీసుకోవాల్సి వచ్చింది. అలాగని నా బ్యాటింగ్ తీరులో ఏమాత్రం మార్పు ప్రదర్శించలేదని” సూర్య పేర్కొన్నాడు.
సూర్య కుమార్ చేసిన ఈ వ్యాఖ్యలతో అతడు ఫీల్డింగ్ కు ఎందుకు రావడం లేదనే విషయంపై ఓ క్లారిటీ వచ్చింది. ఇంపాక్ట్ ప్లేయర్ గా మైదానంలోకి దింపడం పట్ల సూర్యకుమార్ అభిమానులు సోషల్ మీడియాలో ముంబై ఇండియన్స్ జట్టుపై విమర్శలు చేయడం మొదలుపెట్టారు. కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై కూడా ఆరోపణలు చేశారు. అయితే వాటన్నింటికీ చెక్ పెట్టే విధంగా సూర్యకుమార్ యాదవ్ గురువారం రాత్రి కీలక వ్యాఖ్యలు చేశాడు. దీంతో వారంతా ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. ఇక, పంజాబ్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో ముంబై బౌలర్ ఆకాశ్ మద్వాల్ రోహిత్ శర్మ సూచనలు చేస్తూ కనిపించాడు. అయితే ఆ సమయంలో హార్దిక్ పాండ్యా కూడా అక్కడే ఉన్నాడు. రోహిత్ చెప్పినట్టు ఆకాష్ పకడ్బందీగా బంతులు వేయడంతో ముంబై జట్టు తీవ్ర ఉత్కంఠ మధ్య 9 పరుగుల తేడాతో విజయాన్ని పరుగుల తేడాతో విజయాన్ని దక్కించుకుంది.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Why is suryakumar yadav not fielding why is he coming as an impact player
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com