https://oktelugu.com/

Gautam Gambhir: దూకుడు మీద ఉన్న పంత్ ను కాదని.. కేఎల్ రాహుల్ వైపు గౌతమ్ గంభీర్ ఎందుకు మొగ్గు చూపాడు.. కారణమిదే..

రిషబ్ పంత్ దూకుడుగా ఆడతాడు. చూస్తుండగానే నష్టం చేసి వెళ్లిపోతాడు. బౌలర్ ఎవరనేది పట్టించుకోడు. ఉన్నంతసేపు గడగడ లాడించి పోతాడు. అందువల్లే అతడు అంటే చాలామంది అభిమానిస్తారు. పైగా సరిగ్గా రెండు సంవత్సరాల క్రితం అతడు రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. చావు చివరి అంచుదాక వెళ్లి వచ్చాడు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : March 10, 2025 / 04:51 PM IST
    Gautam Gambhir

    Gautam Gambhir

    Follow us on

    Gautam Gambhir: ఈ సమయంలో వేగంగా కోలుకున్నాడు.. మంచానికి పరిమితమైనప్పటికీ.. క్రికెట్ మీద ధ్యాసను వదులుకోలేదు. అందువల్లే అతడు గత ఐపీఎల్ ద్వారా మళ్ళీ క్రికెట్లో ఎంట్రీ ఇచ్చాడు. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు నాయకత్వం వహించాడు. గెలుపు ఓటములను పక్కన పెడితే అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. తన మేనరిజం తో ఆకట్టుకున్నాడు. అందువల్లే అతడికి జాతీయ జట్టులో అవకాశం సులభంగానే లభించింది. కొన్ని సందర్భాల్లో ఆకట్టుకునే ఆట తీరు ప్రదర్శించడంతో.. అతడికి ప్రత్యామ్నాయాన్ని చూడాల్సిన అవసరం జట్టు లేకుండా పోయింది. అయితే జట్టుకు అవసరమైన సందర్భంలో పంత్ మెరుగ్గా ఆడలేకపోయాడు. తన వికెట్ విలువ తెలుసుకోలేకపోయాడు. వేగంగా పరుగులు చేయడం.. అంతలోనే వికెట్ పారేసుకున్నాడు. అది సహజంగా రిషబ్ పంత్ కు వ్యతిరేకంగా మారింది. దీంతో ఏం చేయాలో టీమ్ మేనేజ్మెంట్ కు అర్థం కాలేదు. ఇదే క్రమంలో గౌతమ్ గంభీర్ రిషబ్ పంత్ ను కాకుండా కేఎల్ రాహుల్ ను ఛాంపియన్స్ ట్రోఫీలోకి తీసుకున్నాడు.

    ఇక పాతుకుపోయినట్టే

    కేఎల్ రాహుల్ స్థిరంగా ఆడుతాడు. వేగంగానూ ఆడతాడు. జట్టు అవసరాల తగ్గట్టుగా.. ప్రత్యర్థి జట్టు పై పట్టు సాధించే విధంగా బ్యాటింగ్ చేస్తాడు. అందువల్లే కేఎల్ రాహుల్ అంటే చాలామంది ఇష్టపడుతుంటారు. దురదృష్టవశాత్తు కోచ్ తో గ్యాప్ వల్ల కేల్ రాహుల్ జట్టులో స్థిరమైన స్థానాన్ని దక్కించుకోలేకపోయాడు. ఇప్పుడిక ఛాంపియన్స్ ట్రోఫీ ద్వారా తన అసలైన బ్యాటింగ్ టెక్నిక్ ను.. తన ఆట తీరును ప్రదర్శించిన తర్వాత.. ఇకపై మేనేజ్మెంట్ అతడిని దూరం పెట్టే అవకాశం లేదు.. కీపింగ్.. బ్యాటింగ్ లో కేఎల్ రాహుల్ చురుగ్గా వ్యవహరించిన తీరు అందరిని ఆకట్టుకుంటున్నది. ముఖ్యంగా సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్లో కేఎల్ రాహుల్ ఆడిన తీరు ఆమోఘం. అద్భుతం. అందువల్లే రిషబ్ పంత్ ను కాదని కేఎల్ రాహుల్ ను గౌతమ్ గంభీర్ ను జట్టులోకి తీసుకున్నాడు. తనను జట్టులోకి తీసుకున్నందుకు కేఎల్ రాహుల్ సార్ధకత చేకూర్చుకున్నాడు. ” గౌతమ్ గంభీర్ తీసుకున్న నిర్ణయం ఎలా ఉంటుందోనని మొదట్లో చాలా ప్రశ్నలు ఉదయించాయి. కానీ వాటన్నింటికీ కె.ఎల్ రాహుల్ సరైన సమాధానం చెప్పాడు. కష్టకాలంలో జట్టుకు అండగా నిలిచాడు. అందువల్లే అతడు తన స్థానాన్ని సుస్థిరం చేసుకోగలిగాడని” క్రికెట్ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. రిషబ్ పంత్ x ఫ్యాక్టర్ లో విఫలం కావడం కూడా.. అతడి స్థానాన్ని ప్రభావితం చేసింది. ఇదే సమయంలో కే.ఎల్ రాహుల్ స్థిరంగా ఆడటం అతడికి అనుకూలంగా మారింది.