https://oktelugu.com/

Virat Kohli: విరాట్ కోహ్లీ స్థానాన్ని భర్తీ చేసేదెవరు?

Virat Kohli: క్రికెట్లో మరో శకం ముగిసింది. టెస్ట్ ఫార్మాట్ కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లి నిష్ర్కమించాడు. తనదైన శైలిలో ఆడే కోహ్లి కెప్టెన్సీ నుంచి వైదొలగడం నిజంగా దురదృష్టమే. ఇన్నాళ్లు జట్టును విజయ తీరాలకు చేర్చిన ఆటగాడు కెప్టెన్సీ నుంచి తప్పుకోవడం నిజంగా చేదు వార్తే. విదేశాల్లో జట్టుకు ఎక్కువ విజయాలు అందించిన కెప్టెన్ గా రికార్డులు సొంతం చేసుకున్న అతడు టెస్ట్ కెప్టెన్సీకి టాటా చెప్పడం అభిమానులకు నిరాశే కలిగించింది. బీసీసీఐని షాక్ కు […]

Written By:
  • Srinivas
  • , Updated On : January 17, 2022 / 05:35 PM IST
    Follow us on

    Virat Kohli: క్రికెట్లో మరో శకం ముగిసింది. టెస్ట్ ఫార్మాట్ కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లి నిష్ర్కమించాడు. తనదైన శైలిలో ఆడే కోహ్లి కెప్టెన్సీ నుంచి వైదొలగడం నిజంగా దురదృష్టమే. ఇన్నాళ్లు జట్టును విజయ తీరాలకు చేర్చిన ఆటగాడు కెప్టెన్సీ నుంచి తప్పుకోవడం నిజంగా చేదు వార్తే. విదేశాల్లో జట్టుకు ఎక్కువ విజయాలు అందించిన కెప్టెన్ గా రికార్డులు సొంతం చేసుకున్న అతడు టెస్ట్ కెప్టెన్సీకి టాటా చెప్పడం అభిమానులకు నిరాశే కలిగించింది. బీసీసీఐని షాక్ కు గురి చేసింది.

    Virat Kohli

    ఇటీవల దక్షిణాఫ్రికాలో జరిగిన మూడు టెస్ట్ ల సిరీస్ చేజార్చుకోవడంతో కోహ్లి నిరాశ పరచాడనే ప్రచారం సాగింది. 2-1 తేడాతో టెస్ట్ సిరీస్ కోల్పోవడం దారుణమే. దీంతో క్రీడా లోకం ఉలిక్కిపడింది. నాలుగేళ్ల పాటు వరల్డ్ నెంబర్ వన్ స్థానంలో నిలిపిన కోహ్లి బీసీసీఐతో రాజుకున్న వివాదాలతోనే తప్పుకున్నట్లు తెలుస్తోది. దీనిపై సోషల్ మీడియాలో ఎక్కువ పోస్టులు వస్తున్నాయి.

    Also Read: బాక్సాఫీస్ : ‘బంగార్రాజు’ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ !

    టీ 20 వరల్డ్ కప్ తరువాత కెప్టెన్సీ నుంచి తప్పుకోవగా తరువాత వన్డే జట్టు నుంచి కూడా వైదొలిగాడు. ప్రస్తుతం టెస్ట్ మ్యాచ్ ల నుంచి దూరం కావడం అందరిని బాధపరచింది. కేప్ టౌన్ వేదికగా జరిగిన మూడో టెస్ట్ లో విరాట్ అందుబాటులో లేకపోయినా టెస్ట్ మ్యాచ్ కోల్పోవడం ఆందోళన కలిగించింది. దీంతో కొద్ది రోజులు బీసీసీఐకి విరాట్ కు మధ్య మాటల యుద్ధం కొనసాగినట్లు సమాచారం.

    దీంతో విరాట్ కోహ్లికి బీసీసీకి మధ్య ఎడబాటు పెరిగింది. అందరు ఊహించినట్లుగానే కోహ్లి టెస్ట్ లకు కూడా గుడ్ బై చెప్పడం గమనార్హం. బీసీసీఐలో కొనసాగుతున్న రాజకీయాల కారణంగానే కోహ్లిని పక్కకు పెట్టినట్లు వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తరువాత కెప్టెన్సీ ఎవరనే దానిపై బీసీసీఐ ఆలోచిస్తోంది. రోహిత్ శర్మకే ఈ అవకాశం దక్కనుందని తెలుస్తోంది.

    Also Read: నారా లోకేష్ ను వదిలిపెట్టని కరోనా

    Tags