RCB New Captain 2022: ఆర్సీబీ కొత్త కెప్టెన్ ఎవ‌రు.. ఈ సారైనా క‌ప్ కొడుతారా.. టీమ్ బ‌లాబ‌లాలు ఏంటి..?

RCB New Captain 2022: ఐపీఎల్ లో ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క‌సారి కూడా టైటిల్ కొట్ట‌క‌పోయినా.. చాలా ఫేవ‌రెట్ జ‌ట్టుల్లో ఆర్సీబీ కూడా ఒక్క‌టి. ఇందుకు కార‌ణం విరాట్ కోహ్లీ కెప్టెన్ గా ఉండ‌ట‌మ‌నే చెప్పుకోవ‌చ్చు. అయితే కోహ్లీ నేతృత్వంలో కూడా ఒక్క‌సారి అంటే ఒక్క‌సారి టైటిల్ విన్ కాలేదు. ప్ర‌తిసారి టైటిల్ కొడుతామంటూ చెప్పుకోవ‌డం.. చివ‌ర‌కు చేజార్చుకోవ‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంది. అయితే గ‌తేడాది 14వ సీజ‌న్ పూర్త‌యిన త‌ర్వాత ఆర్సీబీ కెప్టెన్సీ నుంచి కోహ్లీ త‌ప్పుకున్న […]

Written By: Mallesh, Updated On : March 8, 2022 3:27 pm
Follow us on

RCB New Captain 2022: ఐపీఎల్ లో ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క‌సారి కూడా టైటిల్ కొట్ట‌క‌పోయినా.. చాలా ఫేవ‌రెట్ జ‌ట్టుల్లో ఆర్సీబీ కూడా ఒక్క‌టి. ఇందుకు కార‌ణం విరాట్ కోహ్లీ కెప్టెన్ గా ఉండ‌ట‌మ‌నే చెప్పుకోవ‌చ్చు. అయితే కోహ్లీ నేతృత్వంలో కూడా ఒక్క‌సారి అంటే ఒక్క‌సారి టైటిల్ విన్ కాలేదు. ప్ర‌తిసారి టైటిల్ కొడుతామంటూ చెప్పుకోవ‌డం.. చివ‌ర‌కు చేజార్చుకోవ‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంది.

RCB New Captain 2022

అయితే గ‌తేడాది 14వ సీజ‌న్ పూర్త‌యిన త‌ర్వాత ఆర్సీబీ కెప్టెన్సీ నుంచి కోహ్లీ త‌ప్పుకున్న విష‌యం తెలిసిందే. కాగా త్వ‌ర‌లోనే 15వ సీజ‌న్ స్టార్ట్ కాబోతోంది. ఈ నేప‌థ్యంలో కొత్త కెప్టెన్ ఎవ‌రా అంటూ అంద‌రూ ఆరా తీస్తున్నారు. ఇక ఆర్సీబీ మేనేజ్ మెంట్ కూడా కొత్త కెప్టెన్ ఎవ‌ర‌నేది ఇంకా ప్ర‌క‌టించ‌లేదు. అయ‌తే రేసులో డుప్లెసిస్‌, గ్లేన్ మ్యాక్స్ వెల్ పేర్లు బ‌లంగా వినిపిస్తున్నాయి.

Also Read: కేసీఆర్ కు నిజంగా ఆ భయం పట్టుకుందా?

కాగా ఆర్సీబీ ప్ర‌తిసారి టాప్ ఆర్డ‌ర్ బ్యాట్స‌మెన్ల మీద‌నే ఆధార‌ప‌డుతోంది. మిడిల్ ఆర్డ‌ర్‌లో ఎవ్వ‌రూ చెప్పుకోద‌గ్గ వారు లేరు. విరాట్ కోహ్లీ, కొత్త‌గా వ‌చ్చిన డుప్లెసిస్‌, గ్లేన్ మ్యాక్స్ వెల్ తో పాటు దినేశ్ కార్తీక్ ఉన్నారు. ప్ర‌తిసారి విరాట్ బ్యాటింగ్ మీద‌నే జ‌ట్టు ఆధార‌ప‌డుతోంది. ఈసారి కూడా అలాగే చేస్తే కుద‌ర‌దు. మిగ‌తా వారంద‌రూ రాణించాలి. అప్పుడే విజ‌యం త‌థ్యం అవుతోంది. కానీ ఒక‌ప్పుడు ఏబీ డివిలియ‌ర్స్ లాంటి భీక‌ర బ్యాట్స్ మెన్ ఇప్పుడు లేక‌పోవ‌డం నిజంగా పెద్ద దెబ్బే అని చెప్పుకోవాలి.

RCB New Captain 2022

బౌలింగ్ ప‌రంగా మ‌హ‌మ్మ‌ద్ ష‌మీ, జోష్ హేజిల్ వుడ్ లాంటి వారు బ‌లంగా క‌నిపిస్తున్నారు. వీరిద్ద‌రూ కూడా ప్ర‌పంచంలోనే మెరుగైన బౌల‌ర్లు. హ‌ర్ష‌ల్ ప‌టేల్‌, హ‌స‌రంగా, మ‌హ‌మ్మ‌ద్ సిరాజ్ లాంటి వారితో భీక‌ర‌మైన లైన‌ప్‌ను క‌లిగి ఉంది ఆర్సీబీ. అయితే గ‌తంలో ఉన్న యుజ్వేంద్ర చాహ‌ల్‌, దేవ‌ద‌త్ ప‌డిక్క‌ల్ లాంటి అద్భుత‌మైన ఆట‌గాళ్ల‌ను చేజార్చుకుంది ఆర్సీబీ.

మ‌రి ఇప్పుడు ఉన్న టీమ్‌ను చూస్తుంటే.. కొంత బౌలింగ్ ప‌రంగా కొంత ప‌ర్వాలేద‌నిపించినా.. బ్యాటింగ్ ప‌రంగానే ఇంకా మెరుగు కావాల్సి ఉంది. అటు ఆర్సీబీ మాత్రం కోహ్లీని కెప్టెన్ గా ఉంచ‌డానికి చ‌ర్చ‌లు జ‌రుపుతున్న‌ట్టు గ‌తంలో స్ప‌ష్ట‌త ఇచ్చింది. కానీ కోహ్లీ మాత్రం అందుకు సుముఖంగా లేన‌ట్టు తెలుస్తోంది. మ‌రి ఈ సారి ఈ జ‌ట్టు క‌ల‌ను నిజం చేసుకుంటుందా లేదా అన్న‌ది చూడాలి

Also Read: యూపీలో మళ్లీ బీజేపీనే.!? కేంద్రంలో మళ్లీ మోడీనే? కానీ ట్విస్ట్ ఇదే!

Tags