India Vs Australia Final 2023: సమరానికి శంఖం ఉదిన ఇండియా భారీ గెలుపే దిశగా పయనిస్తూ ఆకాశమే హద్దు గా చెలరేగి ఆస్ట్రేలియా ని చిత్తు గా ఓడించి రివెంజ్ తీర్చుకోవడమే ఇండియన్ టీమ్ వేసిన ప్రణాళిక…గెలవాలనే సంకల్పమే ఇప్పుడు ఇండియన్ టీమ్ దగ్గర ఉన్న ప్రధాన అస్త్రం…
ఇక అందులో భాగంగానే ఆస్ట్రేలియా ఇండియా టీంల మధ్యన ఫైనల్ మ్యాచ్ ఈనెల 19 వ తేదీన జరగబోతుంది…ఇక ఈ రెండు టీములు కూడా టైటిల్ ఫేవరెట్ గానే బరిలోకి దిగుతున్నాయి.ఇక రెండు టీములు ప్రస్తుతం ఉన్న ఫామ్ ప్రకారం చూస్తే ఇండియన్ టీమ్ ఆధిపత్యం లో ఉంది. అయినప్పటికీ ఆస్ట్రేలియా టీమ్ ని తక్కువ అంచనా వేయలేం వాళ్ళు నాకౌట్ మ్యాచ్ అంటే ఎలాగైనా సరే గెలిచి తీరాలనే సంకల్పంతో ఆడుతారు. కాబట్టి వాళ్ళని ఓడించడం కొంతవరకు కష్టమే అవుతుంది. ఇక ఇప్పటివరకు వరల్డ్ కప్ లో వాళ్ళు మొత్తం సెమీ ఫైనల్, క్వార్టర్ ఫైనల్, ఫైనల్ అంటూ 18 సార్లు నాకౌట్ మ్యాచ్ లు ఆడారు. అందులో 13 సార్లు ఆస్ట్రేలియా విజయం సాధిస్తే, కేవలం ఐదు సార్లు మాత్రమే వాళ్ళు ఓడిపోయారు. అంటే ఈ లెక్కలను బట్టి చూస్తే ఆస్ట్రేలియాకి నాకౌట్ మ్యాచ్ లు ఆడటం అంటే ఎంత సరదనో మనం అర్థం చేసుకోవచ్చు…
ఇక ఇప్పటికే 2003 వ సంవత్సరంలో ఇండియన్ టీమ్ ని ఫైనల్ లో ఓడించి ఆస్ట్రేలియా నాకౌట్ లో తమ సత్తా చాటుకుంది. ఇక ఇప్పటివరకు ఇండియా వరల్డ్ కప్ లో నాలుగు సార్లు ఫైనల్ కి వస్తే అందులో రెండుసార్లు వరల్డ్ కప్పు గెలిచింది.ఒక సారి ఆస్ట్రేలియా మీదనే ఓడిపోయింది.ఇక ఇప్పుడు ఏం చేస్తుందో తెలియాల్సి ఉంది… ఇక ఇండియా ఆస్ట్రేలియా ఇప్పటివరకు వరల్డ్ కప్ లో మూడుసార్లు నాక్ అవుట్ మ్యాచ్ లు అడాయి. అందులో రెండుసార్లు ఆస్ట్రేలియా విజయం సాధించగా, ఒకసారి మాత్రమే ఇండియా విజయం సాధించింది.అది కూడ 2011 వ సంవత్సరంలో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో ఇండియా ఆల్మోస్ట్ ఓడిపోతుందని అందరూ అనుకున్నారు కానీ యువరాజ్ సింగ్ తన ఒంటి చేత్తో ఈ మ్యాచ్ ని గెలిపించి సూపర్ హీరో గా మారాడు. అలాగే ఇండియన్ టీం ని సెమీ ఫైనల్ కి చేర్చాడు…
ఇక ఇప్పుడు కూడా ఇండియా గెలిచి తన ఆధిపత్యాన్ని చూపించాలని చూస్తుంది. మరి ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఏ స్ట్రాటజీ తో బరిలోకి దిగబోతుందో తెలీదు గానీ, మన ఇండియా మాత్రం భారీ అంచనాలతో పక్క ప్రణాళికలతో దిగుతుంది…ఇక వాళ్ళని ఎదిరించాలంటే మనవాళ్లు భయం లేకుండా ధైర్యంగా ఆడాలి, ఎందుకంటే ఆస్ట్రేలియా నాకౌట్ దశలో చాలా అద్బుతం గా ఆడుతుంది… ఇక మనవాళ్ళు కూడా చాలా కాన్ఫిడెంట్ గా పోరాడటం ఒక్కటే దారి…