Indians as ICC chairmen : ఆదివారం ఐసీసీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు. బీసీసీఐ సెక్రటరీగా జై షా తనదైన మార్క్ ప్రదర్శించారు. క్రికెట్ ను మరింతగా విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందించారు. ఆటగాళ్ల ఫీజులు పెంచడం, దేశవాళి క్రికెట్ టోర్నీల సంఖ్యను పెంచడం, డొమెస్టిక్ క్రికెట్లో టి20 విధానాన్ని అందుబాటులోకి తేవడం వంటి విప్లవాత్మక నిర్ణయాలను జై షా తీసుకున్నారు. వర్ధమాన ఆటగాళ్లకు విశేషమైన అవకాశాలు కల్పిస్తూనే.. సీనియర్ ఆటగాళ్లకు సముచిత ప్రాధాన్యం ఇచ్చారు. ఐపీఎల్ లో మార్కెటింగ్ స్ట్రాటజీని పెంపొందించడం.. బీసీసీఐకి భారీగా ఆదాయం వచ్చేలా చేయడం.. ఫ్రాంచైజీలకు సరికొత్త ఇతర ఆదాయ మార్గాలు చూపించడం వంటివన్నీ జై షా హయాంలోనే చోటుచేసుకున్నాయి. అంతేకాదు బీసీసీఐ ఆర్థిక మూలాలను మరింత పటిష్టం చేయడంతో ప్రపంచ క్రికెట్ ను శాసించే స్థాయికి ఎదిగింది. జై షా ఆధ్వర్యంలో కొత్త కొత్త స్టేడియాలు రూపుదిద్దుకున్నాయి. హైదరాబాదులో అతిపెద్ద క్రికెట్ స్టేడియం ఏర్పాటుకు మార్గం సుగమం అయింది. ఇలా చెప్పుకుంటూ పోవాలే గాని బీసీసీఐ మీద జైషా చూపించిన మార్క్ అంతా ఇంతా కాదు. అయితే ఇప్పుడు ఐసీసీ చైర్మన్ గా జై షా ఎన్నిక కావడంతో ప్రపంచ క్రికెట్ మీద భారత్ ప్రభావం మరింత పెరుగుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఇదివరకు ఎవరు చేశారంటే
ఐసీసీ చైర్మన్ గా జై షా ఎన్నిక కావడం.. ఆయన వయసు 36 సంవత్సరాలు కావడంతో సరికొత్త చరిత్ర సృష్టించారు. అంటే ఈయన కంటే ముందు జగన్మోహన్ దాల్మియా తొలిసారి ఐసీసీ చైర్మన్ గా నియమితులయ్యారు. ఈ బాధ్యతను స్వీకరించిన తొలి భారతీయుడిగా ఆయన రికార్డు సృష్టించారు. 1997 నుంచి 2000 వరకు ఆయన చైర్మన్ గా పనిచేశారు. 2010 నుంచి 12 వరకు శరద్ పవార్ పనిచేశారు. ఎన్ శ్రీనివాసన్ 2014 నుంచి 2015 వరకు పనిచేశారు. శశాంక్ మనోహర్ 2017 నుంచి 2020 వరకు పని చేశారు. ఇప్పుడు కొత్త చైర్మన్ గా జై షా బాధ్యతలు స్వీకరించారు. ఈ పదవిని అలంకరించిన ఐదవ భారతీయుడిగా ఆయన ఘనత అందుకున్నారు. ” క్రికెట్ ను మరింత విశ్వవ్యాప్తం చేయాలి. ఈ ఆటకు సముచిత ప్రాధాన్యం కల్పించాలి. అన్ని దేశాలు ఈ ఆట ఆడే విధంగా ప్రోత్సాహాకాలు కల్పించాలి. అలా అయితేనే పోటీతత్వం మరింత పెరుగుతుంది. వర్ధమాన ఆటగాళ్లకు అవకాశాలు లభిస్తాయి. ఉన్నవారికి మెరుగైన ఆదాయ మార్గాలు ఏర్పాటు అవుతాయి. అందువల్లే క్రికెట్ ను మరింతగా విస్తరించే ప్రణాళికలు రూపొందించాల్సిన అవసరం ఉందని” జై షా పేర్కొన్నారు.